ప్రస్తుతం టాలీవుడ్ ఇండస్ట్రీలో ఉన్న అగ్రకథాయికలలో సమంత (Samantha) ఒకరు. ఓవైపు వరుస సినిమాలతో బిజీగా ఉంటూనే మరోవైపు.. సోషల్ మీడియాలోనూ ఫుల్ యాక్టివ్‌గా ఉంటుంది సామ్. ఎప్పటికప్పుడు లేటేస్ట్ ఫోటోస్.. వీడియోస్.. వర్కవుట్ వీడియోస్.. మోటివేషనల్ కోట్స్ షేర్ చేస్తూ అభిమానులతో టచ్‌లో ఉంటుంది సామ్. తాజాగా నేను వందసార్లు పడిపోయాను.. కానీ లేచి నిల్చున్నాను.. వదిలేయాలని ఆలోచన వచ్చినా… వదిలిపెట్టలేదు అంటూ ఇంట్రెస్టింగ్ పోస్ట్ చేసింది సమంత. ఇప్పుడు ఆమె షేరే చేసిన వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. ఇంతకీ సామ్ షేర్ చేసిన వీడియోలో స్పెషాలిటీ ఎంటో తెలుసుకుందామా.
ప్రస్తుతం సమంత స్విట్జర్లాండ్‌లో టూర్ ఎంజాయ్ చేస్తున్న సంగతి తెలిసిందే. అక్కడ స్కీయింగ్ చేస్తున్న వీడియోస్ ఎప్పటికప్పుడు తన సోషల్ మీడియా ఖాతాలో షేర్ చేస్తూ వస్తుంది. అయితే స్కీయింగ్ కోసం దాదాపు పది రోజులపాటు రోజుకు 5 నుంచి 6 గంటలపాటు ప్రాక్టీస్ చేసినట్లుగా తెలుపుతూ..స్కీయింగ్ కోసం తాను పడిన పాట్లను చూపిస్తూ ఓ వీడియో పోస్ట్ చేసింది.
“నేను బన్నీ వాల్ పై నా స్కీయింగ్ ప్రయాణాన్ని ప్రారంభించాను. వందసార్లు పడిపోయాను. పడిన ప్రతిసారీ లేచాను.. వదిలేయాలనే ఆలోచన చాలాసార్లు నా మనస్సులోకి వచ్చింది. కానీ సంతోషంగా ముందుకు సాగాను. బన్నీ స్లోప్ ల నుంచి రెడ్ రన్ పూర్తి చేయడానికి పట్టిన సమయం.. దాని కోసం నేను చేసిన కృషిలో నిజమైనదానిని కనుగొన్నాను. ఊహించని విధంగా ఇది ఉత్సాహంగా ఉంది ” అంటూ సామ్ చెప్పుకొచ్చింది. అలాగే తనకు స్విట్జర్లాండ్‌లోని వెర్బియర్ స్కీ రిస్టార్ట్‌లో స్కీయింగ్ ట్రైనింగ్ ఇచ్చిన శిక్షకురాలు కేట్ మెక్‌బ్రైడ్‌కు ధన్యవాదాలు తెలిపింది.
Allu Shirish: మల్టీస్టారర్ ప్రాజెక్ట్‌కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన అల్లువారబ్బాయి.. మరో హీరో ఎవరంటే..
Janhvi Kapoor: టాలీవుడ్ ఎంట్రీకి సిద్ధమైన అతిలోక సుందరి తనయ.. ఏ సినిమాతో అంటే..