
రానా, సాయిపల్లవి హీరోహీరోయిన్లుగా.. వేణు ఊడుగుల దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా ‘విరాటపర్వం’. ఎస్.ఎల్.వి సినిమాస్ బ్యానర్ పై డి.సురేష్ బాబు సమర్పణలో సుధాకర్ చెరుకూరి ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ప్రస్తుతం ఈ మూవీ పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటున్నాయి. తాజాగా సాయి పల్లవి ఈ సినిమా గురించి ఆసక్తికరంగా ట్వీట్ చేసింది.
సాయిపల్లవి షేర్ చేసిన ఫోటోలో కాకతీయ తోరణం వద్ద డ్యాన్స్ చేస్తూ కనిపించింది. ఈ పోస్టర్ ను ఉద్దేశిస్తూ.. “ప్రేమలో మునిగి ఉన్న వెన్నెల” అంటూ సాయిపల్లవి ట్విట్టర్లో పేర్కోంది. ఈ నెల 25న ఈ సినిమాలోని కోలు కోలు అనే లిరికల్ సాంగ్ విడుదల చేయబోతున్నట్లుగా చిత్రయూనిట్ ప్రకటించింది. ఇక ఈ సినిమాలో ప్రియమణి, నందితా దాస్, నివేదా పేతురాజ్, నవీన్ చంద్ర, జరీనా వహాబ్, ఈశ్వరీ రావ్, సాయిచంద్ కనిపించనున్నారు. సురేష్ బొబ్బిలి సంగీతం సమకూరుస్తున్నారు.
Premalo munigi unna Vennela ❤️@venuudugulafilm @RanaDaggubati @SLVCinemasOffl @SureshProdns #KoluKolu #VirataParvam pic.twitter.com/bauCUKMU67
— Sai Pallavi (@Sai_Pallavi92) February 22, 2021
Also Read:
తారక్‌కు విలన్‌గా సేతుపతి.. అన్నీ కుదిరితే రేర్ కాంబో.. రికార్డులు బద్దలు కావడం ఖాయం.!