80వ గోల్డెన్ గ్లోబ్ అవార్డుల ప్రధానోత్సవం అమెరికాలోని లాస్ ఏంజిల్స్ లో ఘనంగా జరిగింది. ఈ వేడుకలో ఆర్ఆర్ఆర్ చిత్రం నుంచి నాటు నాటు పాటకు అవార్డ్ వరించిన సంగతి తెలిసిందే. ఉత్తమ ఒరిజినల్ సాంగ్.. నాన్ ఇంగ్లీష్ కేటగిరీ నుంచి నాటు నాటు పాట ఎంపికవ్వగా.. ఏంఏం కీరవాణి ఈ అవార్డును అందుకున్నారు. ఈ కార్యక్రమానికి డైరెక్టర్ రాజమౌళి,రామ్ చరణ్, ఎన్టీఆర్, కీరవాణి పాల్గొన్నారు. ఇందులో చరణ్, స్టైలీష్ లుక్ లో కనిపించారు. అయితే ఎస్.ఎస్.రాజమౌళితో పాటు గోల్డెన్ గ్లోబ్‌కి వెళ్లిన రామ్‌చరణ్ అక్కడ వెరైటీ మార్క్ మాల్కిన్‌తో మాట్లాడారు. తమను భారతదేశం నుంచి గ్లోబల్ స్పేస్‌కి నడిపించిన అద్భుతమైన విషయాలను పంచుకున్నారు. వెరైటీ మార్క్ మాల్కిన్‌కి ఈ సినిమా మార్వెల్ మూవీని తలపించిందట. రామ్‌చరణ్‌ని చూస్తే మార్వెల్ యాక్టర్‌లాగా కనిపించారట. ఈ విషయాన్నే ఆయన చరణ్‌తో ప్రస్తావించారు.
మార్వెల్ స్టార్‌గా, సూపర్‌హీరోగా చేయాలనుకుంటున్నారా? అని రామ్‌చరణ్‌ని ప్రశ్నించారు. దానికి స్పందించిన రామ్‌చరణ్ ”తప్పకుండా. ఎందుకు చేయను” అని అన్నారు. తన ఫేవరేట్ మార్వెల్ స్టార్ కెప్టెన్ అమెరికా అని అన్నారు. రామ్ చరణ్ మాట్లాడుతూ ”మా భారతదేశంలోనూ అద్భుతమైన సూపర్‌హీరోస్ ఉన్నారు. వాళ్లల్లో ఒకరిని మళ్లీ ఇక్కడికి పిలిపిస్తే బావుంటుందేమో” అని అన్నారు.
ఇక నాటు నాటు పాట చిత్రీకరణ సమయంలో ఎవరు ఎక్కువగా గాయపడ్డారు అని అడగ్గా.. చరణ్ స్పందిస్తూ.. ”దాని గురించి మాట్లాడటానికి ఇప్పటికీ నా మోకాళ్లు వణుకుతున్నాయి. అయినా చేశాం. అలాగే చేశాం. అది అందమైన టార్చర్. ఆ కష్టం, ఆ విధానం, లుక్ మమ్మల్ని ఇక్కడిదాకా నడిపించాయి. ఇక్కడ అందరి ముందు నిలుచుని మాట్లాడగలుగుతున్నామని అంటే దానికి కారణం అదే. ధన్యవాదాలు” అని చెప్పారు.
మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.