Roja Selvamani: ఒక తల్లికి ఇంతకంటే గొప్ప బహుమతి ఏముంటుంది? కూతురు అన్షుపై రోజా ఎమోషనల్ పోస్ట్

ప్రముఖ నటి, మాజీ మంత్రి ఆర్ కే రోజా భావోద్వేగానికి గురయ్యారు. ఆమె కుమార్తె అన్షు.. అమెరికాలోని ఇండియానా యూనివర్సిటీ బ్లూమింగ్‌టన్ నుంచి గ్రాడ్యుయేషన్ పూర్తి చేసింది. ఈ సందర్బంగా గ్రాడ్యుయేషన్ డే వేడుకలను పంచుకున్న రోజా కూతురి ఘనత పట్ల ఎమోషనల్ అయ్యింది.

Roja Selvamani: ఒక తల్లికి ఇంతకంటే గొప్ప బహుమతి ఏముంటుంది? కూతురు అన్షుపై రోజా ఎమోషనల్ పోస్ట్
Roja Selvamani

Updated on: May 11, 2026 | 1:44 PM

సీనియర్ నటి, మాజీ మంత్రి ఆర్‌కే రోజా కూతురు అన్షు మాలిక గురించి ప్రత్యేక పరిచయం అక్కర్లేదు. ఉన్నత చదువులు అభ్యసిస్తూనే సామాజిక సేవా కార్యక్రమాల్లోనూ చురుగ్గా రాణిస్తోంది అన్షు. అలాగే రైటర్ గానూ సత్తా చాటుతోంది. ఇప్పటికే పలు పుస్తకాలు కూడా రాసింది. అలాగే అంతర్జాతీయ వేదికలపై ర్యాంప్ వాక్ లు కూడా చేసింది. ఇదిలా ఉంటే గొప్ప శాస్త్రవేత్త కావాలని కలలు కంటోన్న అన్షు ఇటీవలే తన గ్రాడ్యుయేషన్ ను పూర్తి చేసుకుంది. అమెరికాలోని ప్రతిష్ఠాత్మక ఇండియానా యూనివర్సిటీ బ్లూమింగ్‌టన్ నుంచి కంప్యూటర్ సైన్స్ హనర్స్‌లో బ్యాచిలర్ ఆఫ్ సైన్స్ డిగ్రీని హయ్యెస్ట్ డిస్టింక్షన్‌తో పూర్తి చేసింది. ఈ డిగ్రీతో పాటు
యూనివర్సిటీ ఏటా ఒక్కరికి మాత్రమే ప్రదానం చేసే హెర్మన్ బి వెల్స్ అవార్డును కూడా అందుకుంది అన్షు. దీంతో తన కూతురిని చూస్తూ తెగ సంబరపడిపోతోంది అన్షు. ఈ క్రమంలోనే అంతర్జాతీయ మాతృదినోత్సవాన్ని పురస్కరించుకుని సోషల్ మీడియాలో ఒక ఎమోషనల్ పోస్ట్ పెట్టిందీ అందాల తార. తన కూతురి గ్రాడ్యుయేషన్ డే వేడుకలకు సంబంధించిన ఫొటోలను షేర్ చేస్తూ ఒక ఎమోషనల్ నోట్ రాసుకొచ్చింది.

‘నా కూతురు ‍అన్షు.. అమెరికాలోని ఇండియానా యూనివర్సిటీ బ్లూమింగ్‌టన్ నుంచి కంప్యూటర్ సైన్స్ హనర్స్‌లో బ్యాచిలర్ ఆఫ్ సైన్స్ డిగ్రీని హయస్ట్ డిస్టింక్షన్‌తో పూర్తి చేసింది. ఇండియానా యూనివర్సిటీ అందించే ప్రతిష్ఠాత్మమైన హెర్మన్ బి వెల్స్ డిస్టింగ్విష్ సీనియర్ అవార్డ్‌ని అందుకుని ఈ గౌరవం సాధించిన తొలి భారతీయ విద్యార్థిగా అన్షు నిలిచింది. గ్రాడ్యుయేషన్ కాలంలోనే అన్షు.. మౌరీన్ బిగ్గర్స్ లీడర్‌షిప్ అవార్డు ఫర్ ఈక్విటీ అండ్ టెక్నాలజీ, ఔట్ స్టాండింగ్ స్టూడెంట్ లీడర్ సీఈడబ్ల్యూ & టీ 2026, అకడమిక్ ఎక్సలెన్స్ అవార్డు, పలు డీన్స్ లిస్ట్ గౌరవాలు, అలానే ఫౌండర్స్ స్కాలర్ గుర్తింపు లాంటి పురస్కారాలను అందుకుంది. కూతురు కష్టపడి నిబద్ధతతో ఉన్నత శిఖరాలను అధిరోహించడం కంటే తల్లికి గొప్ప బహుమతి మరొకటి లేదు. నా చిన్నారి అన్షు.. ఈ మదర్స్ డేని నా జీవితంలో ఎప్పటికీ మర్చిపోలేని ప్రత్యేకమైన రోజుగా మార్చావు. నిన్ను చూస్తుంటే చాలా గర్వంగా ఉంది’ అని తన ఆనందానికి అక్షర రూపమిచ్చింది రోజా.

ఇవి కూడా చదవండి

గ్రాడ్యుయేషన్ డే వేడుకల్లో రోజా కూతురు..

ఆర్కే రోజా షేర్ చేసిన ఫొటోలు ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో వైరల్ గా మారాయి. వీటిని చూసిన సినీ ప్రముఖులు, నెటిజన్లు అన్షుకు అభినందనలు, శుభాకాంక్షలు తెలుపుతున్నారు.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us