RGV: సినిమాలో నాకు అది నచ్చలేదు.. తెలిసి తీశారా.? తెలియక చేశారా.?

సినిమాలు చేయకున్నా సోషల్ మీడియాలో ఫుల్ యాక్టివ్ గా ఉంటున్నాడు సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ. సినిమా ఇండస్ట్రీలో జరుగుతోన్న సంఘటనలపై తన అభిప్రాయాలను పంచుకుంటున్నాడు. అలాగే కొత్తగా రిలీజవుతోన్న సినిమాలు, వెబ్ సిరీస్ లపై రివ్యూలు కూడా ఇస్తున్నాడు.

RGV: సినిమాలో నాకు అది నచ్చలేదు.. తెలిసి తీశారా.? తెలియక చేశారా.?
Rgv

Updated on: Apr 17, 2026 | 10:41 AM

సంచలన దర్శకుడు ఆర్జీవీ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.. తన సినిమాలతో ప్రేక్షకులను కట్టిపడేసిన ఆర్జీవీ.. స్టార్ డైరెక్టర్ గా సినిమాలు చేసి ఆకట్టుకున్న ఆర్జీవీ ఇప్పుడు సినిమాలకు బ్రేక్ ఇచ్చారు. సినిమాలు స్పీడ్ తగ్గించిన ఆర్జీవీ సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటారని అందరికి తెలుసు. ఆయన ఏం చేసినా అది ఓ పెద్ద వార్తే అవుతుంది. వివాదం లేకుండా వర్మ ఉండలేరు అని కొందరు కామెంట్స్ చేస్తున్నారు. సినిమాలతోనే కాదు తన వ్యాఖ్యలతో వార్తల్లో నిలవడం అనేది వర్మకే సాధ్యం.. దేనికి భయపడని ఆర్జీవీ.. తన మనసులో మాట కూడా మొఖంమీద చెప్పేస్తారు. ముక్కుసూటిగా మాట్లాడతారు ఆర్జీవీ. సోషల్ మీడియాలో ఆయన షేర్ చేసే పోస్ట్ లు కూడా కొన్ని వివాదాలకు దారి తీస్తున్నాయి.

Srihari: ఆ హీరో ఫైట్స్ చేస్తుంటే భయమేసేది.. అందుకే అతని బాధ్యత తీసుకున్నా..!

తాజాగా ఓ స్టార్ హీరో పై షాకింగ్ కామెంట్స్ చేశారు ఆర్జీవీ. రామ్ గోపాల్ వర్మ ఓ సినిమా గురించి నెగిటివ్ కామెంట్స్ చేశారు. సినిమాలో అది నచ్చలేదు అని చెప్పారు. ఇంతకూ సినిమా ఎదో కాదు వెయ్యికోట్లకు పైగా వసూల్ చేసిన ధురంధర్ 2. రణవీర్ సింగ్ నటించిన బాలీవుడ్ మూవీ సంచలన విజయాన్ని అందుకుంది. పాన్ ఇండియా మూవీగా విడుదలైన ఈ సినిమా భారీ విజయాన్ని అందుకుంది. దేశంమొత్తం నచ్చిన ఈ సినిమా అర్జీవికి నచ్చలేదట.

ఇవి కూడా చదవండి

అదంతా అబద్దం.. చక్రీ చనిపోవడానికి కారణం ఇదే.. అసలు విషయం బయటపెట్టిన రఘు కుంచె

అయితే సినిమా మొత్తం కాదు.. సినిమాలో కొన్ని సన్నివేశాలు తనకు నచ్చలేదు అని తెలిపారు. దావూద్ ఇబ్రహీం పాత్ర తన నచ్చలేదని.. సినిమాలో దావూద్‌ను ‘బడే సాహబ్’ అని పిలుస్తూ, పాకిస్థాన్‌తో కలిసి భారత్‌లో ఉగ్ర కార్యకలాపాలను నడిపించే కీలక వ్యక్తిగా చూపించారు అది నాకు నచ్చలేదు. ధురంధర్ 2 సినిమాలో నాకు నచ్చని అంశం ఏదైనా ఉందంటే అది దావూద్ ఇబ్రహీం పాత్రను చూపించిన విధానమే అని ఆర్జీవీ తెలిపారు. అలాగే నేను చెప్పేదే పూర్తి నిజమని కూడా అనను. కానీ నాకు తెలిసిన విషయాలతో పోల్చితే సినిమాలో దావూద్ గురించి చెప్పింది పొంతన లేకుండా ఉంది అని తెలిపారు ఆర్జీవీ. ఈ కామెంట్స్ ఇప్పుడు వైరల్ అవుతున్నాయి.

సచిన్‌తో టాలీవుడ్ హీరోయిన్ ప్రేమాయణం.. అప్పట్లో తెగ చక్కర్లు.. అసలు విషయం చెప్పిన నటి

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us