ఆ కళ్లలో ఎదో మ్యాజిక్ ఉంది భయ్యా..! ఆర్జీవీ హీరోయిన్ ఈ రేంజ్‌లో పిచ్చేక్కిస్తుందేంటీ..!

కొత్త కొత్త హీరోయిన్స్ ను వెతికి మరి ఇండస్ట్రీకి పరిచయం చేస్తుంటారు ఆర్జీవీ. ప్రస్తుతం రామ్ గోపాల్ వర్మ ఓ అమ్మడి అందానికి దాసోహం అయ్యారు. సోషల్ మీడియాలో ఆ అమ్మాయి అందాన్ని ఆస్వాదిస్తూ.. తెగ పోస్ట్ లు పెడుతున్నారు. ఆమె పేరు శ్రీలక్ష్మీ సతీష్.. అయితే ఆమె పేరు ఆరాధ్యదేవి గా మార్చుకుంది. సోషల్ మీడియాలో ఈ చిన్నది చాలా యాక్టివ్ గా ఉంటుంది.

ఆ కళ్లలో ఎదో మ్యాజిక్ ఉంది భయ్యా..! ఆర్జీవీ హీరోయిన్ ఈ రేంజ్‌లో పిచ్చేక్కిస్తుందేంటీ..!
Rgv
Follow us

|

Updated on: Feb 04, 2024 | 10:09 AM

సినీ ఇండస్ట్రీలో ఆర్జీవీ అంటేనే ఓ సంచలనం.. ఆయన సినిమాలకు ఎంత క్రేజ్ ఉంటుంది. ఆయన సెలక్ట్ చేసుకునే హీరోయిన్స్ కూడా అంతకు మించి క్రేజ్ ఉంటుంది. కొత్త కొత్త హీరోయిన్స్ ను వెతికి మరి ఇండస్ట్రీకి పరిచయం చేస్తుంటారు ఆర్జీవీ. ప్రస్తుతం రామ్ గోపాల్ వర్మ ఓ అమ్మడి అందానికి దాసోహం అయ్యారు. సోషల్ మీడియాలో ఆ అమ్మాయి అందాన్ని ఆస్వాదిస్తూ.. తెగ పోస్ట్ లు పెడుతున్నారు. ఆమె పేరు శ్రీలక్ష్మీ సతీష్.. అయితే ఆమె పేరు ఆరాధ్యదేవి గా మార్చుకుంది. సోషల్ మీడియాలో ఈ చిన్నది చాలా యాక్టివ్ గా ఉంటుంది. ప్రతిరోజు రకరకాల వీడియోలు షేర్ చేస్తూ ఉంటుంది. అలా ఓ రోజు ఆర్జీవీ కంట పడింది. అంతే ఆమె ఎవరు.? ఆమె ఐడి తెలిస్తే చెప్పండి అంటూ నెటిజన్స్ ను రిక్వెస్ట్ చేశారు వర్మ.

మొత్తానికి ఆమె ఐడి పట్టుకున్నారు. ఆమెను హీరోయిన్ గా ఒప్పించారు.ఆమెతో ఇప్పుడు శారీ అనే సినిమా కూడా చేస్తున్నారు ఆర్జీవీ. ఇటీవలే ఈ సినిమానుంచి పోస్టర్ ను కూడా వదిలారు. దాంతో ఈ అమ్మడు ఎవరు అంటూ చాలా మంది నెటిజన్స్ సోషల్ మీడియాను జల్లెడ పడుతున్నారు. ఈ క్రమంలో ఆరాధ్యదేవి వీడియోలు, ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.

ఆర్జీవీ హీరోయిన్ అంటే మాములుగా ఉంటుంది.. ఆ చిన్నదాని అందం కుర్రకారును ఫిదా చేస్తుంది. మోడ్రన్ డ్రస్సుల్లో కాకుండా చీరకట్టులో అంతకు మించి అందంగా ఉంది ఆ అమ్మడు. దాంతో ఆమె వీడియోలను తెగ షేర్ చేస్తున్నారు నెటిజన్స్. ఆమె కూడా తన ఫ్యాన్స్ ను డిస్సప్పాయింట్ చేయకుండా వీడియోలు షేర్ చేస్తుంది. తాజాగా ఓ వీడియోను పంచుకుంది.. అలా చీరకట్టులో వయ్యారాలు పోతూ.. కాటుకకళ్లను అటు ఇటూ ఇప్పుతూ.. అబ్బో .. మతిపోగొడుతోంది ఈ చిన్నది. ఈ వీడియోకు కుర్రాళ్ళు ఓ రేంజ్ లో కామెంట్స్ చేస్తున్నారు..

ఆర్జీవీ హీరోయిన్ ఆరాధ్యదేవి

ఆర్జీవీ హీరోయిన్ ఆరాధ్యదేవి .

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..