పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తనయుడు అకీరా నందన్ ఎంట్రీ కోసం పవన్ అభిమానులంతా వేయి కళ్ళతో ఎదురుచూస్తున్నారు. ఇప్పటికే అకీరా హీరోలా ఉన్నాడు. అకీరా ఫోటోలను పవన్ కళ్యాణ్ మాజీ భార్య రేణు దేశాయ్ సోషల్ మీడియాలో పంచుకుంటూ ఉంటారు. అయితే ఆమె ఎక్కువగా అకీరా మొఖం కనిపించకుండా ఉండేలా ఫోటోలను షేర్ చేస్తూ ఉంటారు. తాజాగా అకీరా పుట్టిన రోజు సందర్భంగా ఆమె షేర్ చేసిన అకీరా ఫోటోలు, వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. అయితే రేణు దేశాయ్ షేర్ చేసిన వీడియో పై నెటిజన్స్ ఆసక్తికర కామెంట్స్ చేశారు. ఈ వీడియో పై ఓ నెటిజన్ స్పందిస్తూ రెండు దేశాయ్ కు కోపం వచ్చేలా చేశాడు.
దాంతో రేణు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఓ నెటిజన్ ఈ వీడియో పై స్పందిస్తూ..మేడమ్.. ఒక్కసారైనా మా అకీరాని సరిగ్గా చూపించండి. మా అన్న తనయుడిని చూడాలని మాకెంతో ఆశగా ఉంటుంది అని కామెంట్ చేశాడు. దాంతో రేణు దేశాయ్ సహనం కోల్పోయారు.
మీ అన్న తనయుడా..? అకీరా నా కొడుకు.. మీరు వీరాభిమానాలు అయ్యి ఉండొచ్చు. కానీ మాట్లాడే పద్ధతి నేర్చుకోండి. నేను ఇలాంటి కామెంట్స్ ను పెద్దగా పట్టించుకోనూ.. కానీ కొంతమంది మరీ కఠినంగా వ్యవహరిస్తున్నారు అంటి ఫైర్ అయ్యారు రేణు దేశాయ్..