మాస్ మహారాజ రవితేజ అప్పుడెప్పుడో వచ్చిన రాజా ది గ్రేట్ సినిమా తర్వాత మొన్నామధ్య క్రాక్ సినిమాతో హిట్ అందుకున్నాడు. ఆ తర్వాత షరామామూలే.. రీసెంట్ గా వచ్చిన రామారావు ఆన్ డ్యూటీ సినిమా డిజాస్టర్ గా మిగిలింది. అయినా మాస్ రాజా మాత్రం తగ్గడం లేదు. వరుస సినిమాలను లైనప్ చేసి రెట్టింపు ఉత్సహాం తో షూటింగ్ చేస్తున్నారు. ఇదిలా ఉంటే ఇప్పుడు ధమాకా అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు రావడానికి రెడీ అయ్యారు రవితేజ. త్రినాథరావు నక్కిన దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో క్రేజీ బ్యూటీ శ్రీ లీల హీరోయిన్ గా నటిస్తోంది. ఈ సినిమా షూటింగ్ కంప్లీట్ చేసుకొని రిలీజ్ కు రెడీ అవుతోంది. గతంలో త్రినాథరావు నక్కిన దర్శకత్వంలో వచ్చిన సినిమాలు ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. ఈ సినిమా కూడా తప్పకుండా ప్రేక్షకులను ఆకట్టుకుంటుందని చిత్రయూనిట్ ధీమా వ్యక్తం చేస్తున్నారు ఈ సినిమా తర్వాత వరుస సినిమాలను లైనప్ చేశాడు మాస్ రాజా.
వీటీలో రావణాసుర, టైగర్ నాగేశ్వరావు సినిమాలు ఉన్నాయి. వీటితో పాటు ఈగల్ అనే సినిమా కూడా చేస్తున్నాడు రవితేజ. రవితేజ ట్రై చేయని యాంగిల్ లో ఆ సినిమా తెరకెక్కుతుందట. కార్తీక్ ఘట్టమనేని ఆ సినిమాను డైరెక్ట్ చేస్తున్నాడు. ఇంతకుముందు కార్తీక్ కార్తికేయ సినిమాతో సినిమాటోగ్రాఫర్ గా మంచి గుర్తింపు అందుకున్నాడు.
కార్తీక్ ఘట్టమనేని డైరెక్ట్ చేసిన సూర్య వర్సెస్ సూర్య సినిమా కూడా మంచి టాక్ ను సొంతం చేసుకుంది. ఇక ఇప్పుడు అతను విభిన్నమైన కథతో రవితేజతో ఈగల్ అనే సినిమాను తెరపైకి తీసుకురాబోతున్నారు. ఇటీవలే ఈ సినిమా షూటింగ్ మొదలైందట.ఈ మూవీ షూటింగ్ ను పోలాండ్ దేశంలో మొదలైనట్లుగా తెలుస్తోంది. అక్కడ యాక్షన్స్ సీన్స్ తెరకెక్కించారట దర్శకుడు కార్తీక్.
మరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి..