Ravi Teja Khiladi: వేస‌విలో వ‌స్తానంటున్న ర‌వితేజ‌… ఖిలాడిలో ద్విపాత్రాభిన‌యం చేయ‌నున్న మాస్ మ‌హారాజ్‌…

మాస్‌ మహారాజ్‌ రవితేజ ‘ఖిలాడి’ షూటింగ్‌ను ఇటీవ‌లే మొద‌లెట్టాడు. అయితే ఇప్పుడే సినిమా రిలీజ్ డేట్‌ను ప్ర‌క‌టించేశాడు. చేతిలో‌ గన్‌ పట్టుకొని...

Ravi Teja Khiladi: వేస‌విలో వ‌స్తానంటున్న ర‌వితేజ‌... ఖిలాడిలో ద్విపాత్రాభిన‌యం చేయ‌నున్న మాస్ మ‌హారాజ్‌...

Edited By:

Updated on: Jan 30, 2021 | 6:24 PM

మాస్‌ మహారాజ్‌ రవితేజ ‘ఖిలాడి’ షూటింగ్‌ను ఇటీవ‌లే మొద‌లెట్టాడు. అయితే ఇప్పుడే సినిమా రిలీజ్ డేట్‌ను ప్ర‌క‌టించేశాడు. చేతిలో‌ గన్‌ పట్టుకొని రవితేజ నడుచుకుంటూ వస్తున్న కొత్త పోస్టర్‌ను పరిచయం చేస్తూ ‘ప్రపంచ వ్యాప్తంగా థియేటర్లలో మే 28 నుంచి ఖిడాడీ రిలీజ్‌ కానుంది’ అని రవితేజ ట్విటర్‌లో పేర్కొన్నారు.

ఈ సినామాలో రవితేజ డ్యూయోల్ రోల్‏లో నటించనున్నాడు. రమేశ్ వర్మ డైరెక్షన్‌లో తెరకెక్కుతున్న ఈ సినిమాలో డింపుల్ హయతి, మీనాక్షి చౌదరిలు హీరోయిన్లుగా నటిస్తున్నారు. పెన్‌ స్టూడియోస్‌ సమర్పణలో హవీష్ నిర్మిస్తోన్న ఈ చిత్రానికి దేవీ శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు. ప్రస్తుతం శరవేగంగా ఖిలాడి షూటింగ్ జరుపుకోంటుంది. కాగా…ర‌వితేజ‌ నటించిన క్రాక్‌ సినిమా సంక్రాంతి కానుకగా విడుదలై బాక్సాఫీస్‌ వద్ద విజయం సొంతం చేసుకున్న విషయం తెలిసిందే.

మేలో సినిమాలే… సినిమాలు…

మేలో రిలీజ్‌కు సినిమాలు క్యూ క‌డుతున్నాయి. చిరంజీవి నటిస్తున్న ఆచార్య(మే13), వెంకటేష్‌ నటిస్తున్న నారప్ప(మే 14) చిత్రాలు కూడా రిలీజ్‌ కానుంది. తాజాగా ఖిలాడి ఈ జాబితాలో చేరింది. మే 28న విడుద‌ల కానుంది.