హెయిర్ ఫాల్ నివారించడానికి రవీనా టాండన్ చిట్కా !

పలు భాష‌ల్లో న‌టించి, మెప్పించిన బాలీవుడ్‌ న‌టి రవీనా టాండన్ తాజాగా హెయిర్ ఫాల్ సమస్యతో  బాధపడుతున్నవారి కోసం ఓ చిట్కాతో ముందుకొచ్చింది.

హెయిర్ ఫాల్ నివారించడానికి రవీనా టాండన్ చిట్కా !

Updated on: Sep 23, 2020 | 3:51 PM

పలు భాష‌ల్లో న‌టించి, మెప్పించిన బాలీవుడ్‌ న‌టి రవీనా టాండన్ తాజాగా హెయిర్ ఫాల్ సమస్యతో  బాధపడుతున్నవారి కోసం ఓ చిట్కాతో ముందుకొచ్చింది.  ఈ రోజుల్లో జుట్టు రాలడమనేది ప్రధాన సమస్యగా మారిందని, దీనికి పోషకాహార లోపంతో పాటు టెన్షన్, ఒత్తిడి, హానికరమైన పదార్ధాలతో చేసిన షాంపూల వాడకం వంటి అనేక కారణాలు ఉన్నాయని తెలిపింది. ప్రస్తుతం జుట్టు ఊడిపోవడం సమస్యతో బాధపడుతున్న వారికి స్వాంతన కలిగించే చిట్కాతో ఆమె సోషల్ మీడియా ముందుకు వచ్చారు. కాగా ప్రతి రోజు కొన్ని ఉసిరికాయలను(ఆమ్లా)తినడం ద్వారా జుట్టు రాలడాన్ని నివారించవచ్చని రవీనా చెప్పుకొచ్చారు.

తొలుత ఓ కప్పు పాలలో కొన్ని ఉసురుకాయాలను వేయాలి. ఆ తర్వాత ఉసిరికాయలు మెత్తబడే వరకు ఉడికించాలి. ఈ క్రమంలో పైన ఉన్న ఉసిరి పోరలను తీసి వేస్తే గుజ్జు వస్తుంది. ఆ గుజ్జను జుట్టుకు రాసి, పావుగంట తర్వాత గోరు వెచ్చని నీటితో తల స్నానం చేయాలి. ఈ పద్దతిని మీరు పాటించగలిగితే షాంపూ అవసరం కూడా ఉండదని రవీనా టండన్‌ పేర్కొంది. కాగా ఈ సీనియర్ నటి వరుసగా బ్యూటీ సిరీస్‌ పేరుతో ఆరోగ్య చిట్కాలను చెప్పనున్నారు.

Also Read :

Bigg Boss Telugu 4 : కుమార్ సాయికి అదే బలంగా మారిందా..?

సీఎం జగన్ మరో విప్లవాత్మక పథకం, సెప్టెంబర్ 28న శ్రీకారం

Loading...
Unable to load recommendations.
Follow Us