Rashmika Mandanna: రష్మిక ధరించిన స్వెట్టర్ ధర తెలిస్తే దిమ్మతిరిగి పోవాల్సిందే.. ఏకంగా లక్షకు పైనే..

|

Aug 02, 2022 | 7:44 AM

ఇటీవల ముంబైలోని చిత్రనిర్మాత సిద్దార్థ్ రాయ్ కపూర్ కార్యాలయంలో సందడి చేసింది రష్మిక. ఆమెకు సంబంధించిన ఫోటోస్ నెట్టింట వైరల్ అవుతున్నాయి.

Rashmika Mandanna: రష్మిక ధరించిన స్వెట్టర్ ధర తెలిస్తే దిమ్మతిరిగి పోవాల్సిందే.. ఏకంగా లక్షకు పైనే..
Rashmika
Follow us on

ప్రస్తుతం చేతి నిండా సినిమాలతో బిజీగా ఉంది కన్నడ బ్యూటీ రష్మిక (Rashmika Mandanna). పుష్ప సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ సొంతం చేసుకున్న ఈ చిన్నది… ఇప్పుడు బాలీవుడ్ ఇండస్ట్రీలో పాగా వేసేందుకు సిద్దమైంది. ఇప్పటికే ఆమె నటిస్తున్న మిస్టర్ మజ్ను, గుడ్ బై, యానిమల్ చిత్రాల షూటింగ్స్ శరవేగంగా జరుగుతున్నాయి. అలాగే ఆమె నటించిన సీతారామం సినిమా ఆగస్ట్ 5న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. దుల్కర్ సల్మాన్, మృణాల్ ఠాకూర్ జంటగా నటించిన ఈ మూవీలో రష్మిక కీలకపాత్రలో నటిస్తోంది. ప్రస్తుతం ఈ మూవీ ప్రమోషన్లలో బిజీగా ఉంది.

ఇదిలా ఉంటే.. ఇటీవల ముంబైలోని చిత్రనిర్మాత సిద్దార్థ్ రాయ్ కపూర్ కార్యాలయంలో సందడి చేసింది రష్మిక. ఆమెకు సంబంధించిన ఫోటోస్ నెట్టింట వైరల్ అవుతున్నాయి. సిద్ధార్థ్ రాయ్ కపూర్ కార్యాలయం వద్దకు వచ్చినప్పుడు రష్మిక రూ. 1.26,440 విలువైన గూచీ స్వెట్టర్ ధరించింది. బ్లాక్ ఫార్మల్ ప్యాంట్.. వైట్ స్వెట్టర్ ధరించింది. అయితే రష్మిక ధరించిన స్వెట్టర్ ధర విని నెటిజన్స్ షాకవుతున్నారు. ప్రస్తుతం ఆమె తమిళ్ స్టార్ విజయ్ సరసన వరిసు చిత్రంలోనూ నటిస్తోంది. ఇప్పటికే విడుదలైన ఈ మూవీ పోస్టర్ కు మంచి స్పందన వచ్చింది.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.