అప్పుడు కూతురిగా.. ఇప్పుడు కోడలిగా ప్రేమను అందిస్తున్నారు.. ఎమోషనల్ అయిన రష్మిక

తెలంగాణ గద్దర్ అవార్డుల ప్రదానోత్యవం ఎంతో ఘనంగా జరుగుతుంది.ఈ అవార్డుల వేడుకలో రాక్ స్టార్ దేవి శ్రీ ప్రసాద్ ఇరగదీశారు అలాగే హీరోయిన్ రష్మిక మందన్న గర్ల్ ఫ్రెండ్ సినిమాకు గాను అవార్డును అందుకుంది. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఆసక్తికర కామెంట్స్ చేసింది.

అప్పుడు కూతురిగా.. ఇప్పుడు కోడలిగా ప్రేమను అందిస్తున్నారు.. ఎమోషనల్ అయిన రష్మిక
Rashmika

Updated on: Mar 19, 2026 | 10:14 PM

తెలంగాణ గద్దర్ అవార్డుల ప్రదానోత్సవంలో రష్మిక మందన్న మాట్లాడుతూ.. గతంలో నేను ట్రోల్స్ ఎదుర్కొన్నా.. ఇప్పుడు నాకు రాష్ట్ర అవార్డు వచ్చింది ఎంతో సంతోషంగా ఉంది. గర్ల్ ఫ్రెండ్ సినిమాకు అవార్డు రావడంతో ఎంతో ఆనందంగా ఉందని రష్మిక తెలిపింది. అలాగే ఆమె మాట్లాడుతూ.. కోడలిగా రాక ముందు.. కూతురిగా నాకు ప్రేమ అందించారు. ఇప్పుడు తెలంగాణ కోడలిగా ప్రేమను అందిస్తున్నారు ఎంతో సంతోషంగా ఉంది అని రష్మిక తెలిపింది.

రేంవత్ రెడ్డి సర్‌ మీ చేతులు మీదగా అవార్డు అందుకోవటం చాలా స్పెషల్. జ్యూరీ అందరికీ చాలా థ్యాంక్స్‌. నా పెర్ఫామెన్స్‌కు అవార్డు రావటం చాలా గర్వంగా ఉంది. ఈ అవార్డు ఇలాంటి సినిమాలు మరిన్ని చేయడానికి కాన్ఫిడెన్స్ ఇచ్చింది. ఈ సినిమా రాహుల్‌ రవీంద్రన్‌ వల్లే జరిగింది. సినిమా కోసం పని చేసిన ప్రతీ ఒక్కరికీ పేరు పేరున థాంక్యూ
ఈ ఇండస్ట్రీకి వచ్చినప్పుడు అందరూ నన్ను ఓ కూతురిలా ఆదరించారు..ఇప్పుడు ఓ కోడలిలా మీ ముందున్నా… అందరూ నా ఫ్యామిలీని జాగ్రత్తగా చూసుకోండి. అంటూ చెప్పుకొచ్చింది రష్మిక. రష్మిక మాట్లాడుతుండగా విజయ్ దేవరకొండ తల్లి, రష్మిక అత్తగారు ఎమోషనల్ అయ్యారు.

ఇవి కూడా చదవండి

Follow Us