
బాలీవుడ్ బడా మూవీ బ్రహ్మాస్త్ర(Brahmastra) నేడు ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. అయాన్ ముఖర్జీ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలో రణబీర్ కపూర్ హీరోగా నటించగా , అలియా భట్ హీరోయిన్. ఈ సినిమా పై బాలీవుడ్ చాలా ఆశలు పెట్టుకుంది. ఈ సినిమాలో అమితాబ్ బచ్చన్ కీలక పాత్రలో కనిపించనున్నారు. అలాగే టాలీవుడ్ కింగ్ నాగార్జున కూడా ఈ సినిమాలో ముఖ్యమైన పాత్రలో నటించారు. ఇప్పటికే విడుదలైన పోస్టర్స్, ట్రైలర్ సినిమాపై భారీ హైప్ క్రియేట్ చేశాయి. పాన్ ఇండియా లెవల్లో భారీ బడ్జెట్తో నిర్మించిన ఈ చిత్రాన్ని తెలుగులో రాజమౌళి విడుదల చేయనున్నారు. ఇందులో అమితాబ్ సైతం కీలకపాత్రలో నటిస్తున్నారు. పాన్ ఇండియా స్థాయిలో 2022 సెప్టెంబర్ 9న(నేడు) హిందీ, తెలుగు, తమిళం, కన్నడ, మలయాళ భాషల్లో ఈ సినిమా విడుదల కానుంది.
తాజాగా ఈ సినిమా ప్రీమియర్స్ మొదలయ్యాయి. ఈ సినిమా చూసిన ప్రేక్షకులు తమ అభిప్రాయాలను సోషల్ మీడియా వేదికగా పంచుకుంటున్నారు. ప్రస్తుతం ఈ సినిమాకు పాజిటివ్ రివ్యూస్ వస్తున్నాయి. ఈ సినిమా లో ముఖ్యంగా నాగార్జున నటన గురించి అందరూ మాట్లాడుకుంటున్నారు. అలాగే గ్రాఫిక్స్ కూడా ఆకట్టుకున్నాయని అంటున్నారు ప్రేక్షకులు.
మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.