Ramayanam: మొదటి భాగానికే 835 కోట్లు..!! అంచనాలను పెంచేస్తున్న రామాయణం

|

May 14, 2024 | 7:25 AM

ఇప్పుడు తెరకెక్కుతున్న సినిమాలు మినిమమ్ వందకోట్ల బడ్జెట్ తో తెరకెక్కుతున్నాయి. కొంత మంది నిర్మాతలు, నటీనటులు, దర్శకులు ఇండియన్ సినిమాను ప్రపంచ స్థాయికి తీసుకెళ్లడానికి కష్టపడుతున్నారు. దాంతో భారతీయ సినిమా పరిధి ఏటా పెరుగుతూ వస్తుంది. అలాగే బడ్జెట్ కూడా భారీగా పెరుగుతుంది.

Ramayanam: మొదటి భాగానికే 835 కోట్లు..!! అంచనాలను పెంచేస్తున్న రామాయణం
Ramayana
Follow us on

ప్రస్తుతం సినీ ఇండస్ట్రీలో పాన్ ఇండియా మూవీల హవా నడుస్తున్న విషయం తెలిసిందే.. అలాగే భారీ బడ్జెట్ సినిమాలను కూడా తెరకెక్కుతున్నాయి. ఇప్పటికే చాలా సినిమాలు పాన్ ఇండియా మూవీస్ గా తెరకెక్కి సంచలన విజయాలను అందుకున్నాయి. మరికొన్ని సినిమాలు రెడీ అవుతున్నాయి. ఇప్పుడు తెరకెక్కుతున్న సినిమాలు మినిమమ్ వందకోట్ల బడ్జెట్ తో తెరకెక్కుతున్నాయి. కొంత మంది నిర్మాతలు, నటీనటులు, దర్శకులు ఇండియన్ సినిమాను ప్రపంచ స్థాయికి తీసుకెళ్లడానికి కష్టపడుతున్నారు. దాంతో భారతీయ సినిమా పరిధి ఏటా పెరుగుతూ వస్తుంది. అలాగే బడ్జెట్ కూడా భారీగా పెరుగుతుంది. గత కొన్ని నెలలుగా ‘రామాయణం’ సినిమాపై రకరకాల వార్తలు వినిపిస్తున్నాయి. ఇప్పుడు ఈ సినిమా బడ్జెట్‌ పై ఓ ఆశ్చర్యకరమైన టాక్ వినిపిస్తుంది.

రామాయణం ఆధారంగా తెరకెక్కుతున్న ఈ చిత్రానికి నితేష్ తివారీ దర్శకత్వం వహిస్తుండగా, నమిత్ మల్హోత్రా నిర్మిస్తున్నారు. కన్నడ స్టార్ హీరో యష్ సహ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. ఈ సినిమా బడ్జెట్ దాదాపు 835 కోట్లు అని తెలుస్తోంది. ఈ సినిమా షూటింగ్ ఇప్పటికే ప్రారంభమైంది. రాముడిగా రణబీర్ కపూర్, సీతగా సాయి పల్లవి నటిస్తున్నారు. ఈ సినిమాలో చాలా మంది ప్రముఖ ఆర్టిస్టులు నటిస్తున్నారు. ఆర్టిస్టుల రెమ్యూనరేషన్, సెట్ల నిర్మాణం, గ్రాఫిక్స్ వర్క్ అన్నీ కలిపి ఈ సినిమా బడ్జెట్ 835 కోట్ల వరకు చేరిందని తెలుస్తోంది.

2022లో విడుదలైన ‘బ్రహ్మాస్త్ర’ సినిమా 450 కోట్ల రూపాయల బడ్జెట్‌తో తెరకెక్కింది. ఇప్పటివరకు బాలీవుడ్‌లో అత్యంత భారీ బడ్జెట్‌తో తెరకెక్కిన సినిమా ఇది. ఆ సినిమాలో కూడా రణబీర్ కపూర్ హీరోగా నటించాడు. ఇప్పుడు ఆ రికార్డును తానే బద్దలు కొట్టబోతున్నాడు. రణబీర్ కపూర్ నటించిన ‘రామాయణం: పార్ట్ 1’ బడ్జెట్ 835 కోట్లు అన్న వార్త ఇప్పుడు బాలీవుడ్ లో తెగ చక్కర్లు కొడుతుంది. ఈ వార్తల్లో వాస్తవం ఎంత అన్నది తెలియాల్సి ఉంది.  ‘రామాయణం’ సినిమా మొదటి భాగానికే 835 కోట్ల రూపాయల బడ్జెట్ అవుతుంది. ఈ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ కోసం దాదాపు 600 రోజులు కేటాయిస్తున్నారు. రామాయణ కథను అద్భుత దృశ్య కావ్యంగా ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని చిత్ర బృందం సన్నాహాలు చేస్తుంది. ఇప్పటికే ఈ సినిమా నుంచి లీక్ అయినా ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. రాముడిగా రణబీర్, సీత గా సాయి పల్లవి అద్భుతంగా కనిపిస్తున్నారు.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.