Ranabaali: బుక్‌మైషోలో రణబాలి రికార్డుల జోరు.. దసరా బరిలోనూ తగ్గని క్రేజ్.!

టాలీవుడ్ స్టార్ కపుల్ విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న జంటగా నటించిన లేటెస్ట్ సినిమా రణబాలి. 1878 కాలంలో రాయలసీమలో సంభవించిన కరువు, ప్రజల కష్టాలు, బ్రిటిష్ పాలకుల ఆగడాలను నేపథ్యంగా తీసుకుని దర్శకుడు రాహుల్ సాంకృత్యాన్ ఈ సినిమాను తెరకెక్కించాడు.

Ranabaali: బుక్‌మైషోలో రణబాలి రికార్డుల జోరు.. దసరా బరిలోనూ తగ్గని క్రేజ్.!
Ranabaali

Updated on: Oct 20, 2026 | 2:35 PM

టాలీవుడ్‌లో ప్రస్తుతం రణబాలి సినిమా హవా కొనసాగుతోంది. విడుదలైన ఐదో రోజు కూడా ఈ సినిమా మంచి ఆదరణతో  దూసుకుపోతుంది. దసరా పండుగ సీజన్‌ లోనూ బాక్సాఫీస్ వద్ద తన సత్తా చాటుతోంది. ముఖ్యంగా బుక్‌మైషోలోనూ సినిమా రికార్డులు సృష్టిస్తోందంటూ మేకర్స్ చేసిన ప్రకటన ఇప్పుడు సినీ అభిమానుల దృష్టిని ఆకర్షిస్తోంది. విజయ్ దేవరకొండ హీరోగా నటించిన రణబాలి సినిమాకి రాహుల్ సాంకృత్యాయన్ దర్శకత్వం వహించారు. పీరియడ్ యాక్షన్ డ్రామాగా తెరకెక్కిన ఈ సినిమా మంచి విజయాన్ని అందుకుంది. అలాగే కలెక్షన్స్ పరంగానూ ఈ సినిమా బాక్సాఫీస్ ను షేక్ చేస్తుంది.సాధారణంగా సినిమా విడుదలైన తొలి రోజుల్లో ప్రేక్షకుల ఆసక్తి ఎక్కువగా ఉంటుంది. అయితే ఆ తర్వాత కూడా థియేటర్లకు ప్రేక్షకులు వస్తున్నారా? లేదా? అనేదే సినిమా విజయాన్ని నిర్ణయించే కీలక అంశం. ఈ నేపథ్యంలో ‘రణబాలి’ ఐదో రోజూ మంచి ఆక్యుపెన్సీతో  కొనసాగుతుంది.

బాబోయ్.. ఈ చిన్నది బయట ఎలా ఉందో చూశారా..! స్టార్ హీరోయిన్స్ కూడా కుళ్లుకోవాల్సిందే

దసరా సెలవులు సినిమాలకు ఎంతో కీలకమైన సమయం. కుటుంబ సభ్యులతో కలిసి థియేటర్లకు వెళ్లే ప్రేక్షకుల సంఖ్య ఈ సమయంలో పెరుగుతుంది. ఈ అవకాశాన్ని ‘రణబాలి’ సినిమా అందిపుచ్చుకుంటోంది. రణబాలి సినిమా కేవలం సిటీలోనే కాదు ఏ, బీ, సీ సెంటర్లలోనూ ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది. అన్ని వర్గాల ప్రేక్షకుల నుంచి సినిమాకు విశేష ఆదరణ లభిస్తోంది, థియేటర్లకు కుటుంబ సమేతంగా ప్రేక్షకులు వచ్చి సినిమాను ఎంజాయ్ చేస్తున్నారు. సినిమాకు ఫ్యామిలీ ఆడియన్స్ నుంచి స్పందన రావడం బాక్సాఫీస్ పరంగా కీలక పరిణామంగా చెప్పుకోవచ్చు.

రజినీకాంత్‌కు జోడీగా 27 ఏళ్ల హీరోయిన్.. భారీ అంచనాలతో విడుదలై అట్టర్ ఫ్లాప్ అయిన సినిమా

టికెట్ బుకింగ్ ప్లాట్‌ఫామ్ బుక్‌మైషోలో ‘రణబాలి’ రికార్డు సృష్టిస్తుంది. ఐదో రోజూ భారీ స్పందన కొనసాగుతోంది. గంటల వ్యవదిలోనే 10వేలకు పైగా టికెట్స్ బుక్ అవుతున్నాయి. ముఖ్యంగా తొలి ఐదు రోజుల తర్వాత కూడా థియేటర్లలో ప్రేక్షకుల సందడి కొనసాగుతుంది. ‘రణబాలి రానున్న రోజుల్లో బాక్సాఫీస్ కలెక్షన్స్ సంఖ్య పెరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. మొత్తానికి, దసరా సీజన్‌లో ‘రణబాలి’కి మంచి స్పందన లభించడం. ఐదో రోజు కూడా భారీ ఆక్యుపెన్సీతో సినిమా దూసుకుపోవడం అభిమానుల్లో ఆసక్తిని పెంచుతోంది.

ఇవి కూడా చదవండి

మహేష్ బాబు తర్వాత ఆ హీరో నటన అంటే నాకు చాలా ఇష్టం: సూపర్ స్టార్ కృష్ణ

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Loading...
Unable to load recommendations.
Follow Us