Adarsha Kutumbam: ఎట్టకేలకు విడుదలకు సిద్ధమైన వెంకీ – త్రివిక్రమ్ మూవీ.. కొత్త రిలీజ్ డేట్ ఇదే
వెంకటేష్ సినిమాలంటే కుటుంబ ప్రేక్షకుల్లో ప్రత్యేకమైన ఆసక్తి ఉంటుంది. ముఖ్యంగా ఆయన కామెడీ టైమింగ్, సహజమైన నటన, భావోద్వేగ సన్నివేశాలు ప్రేక్షకులను ఆకట్టుకుంటుంటాయి. ఈ నేపథ్యంలో త్రివిక్రమ్ దర్శకత్వంలో ఆయన నటిస్తున్న ‘ఆదర్శ కుటుంబం’ ఎలాంటి కథతో ప్రేక్షకుల ముందుకు వస్తుందోనని అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

టాలీవుడ్లో విక్టరీ వెంకటేష్‌కు ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఫ్యామిలీ ఎంటర్టైనర్ సినిమాలతో ప్రేక్షకులను అలరించడంలో ఆయనది ప్రత్యేకమైన శైలి. మరోవైపు, తనదైన మాటలు, కథాకథనం, వినోదంతో ప్రేక్షకులను ఆకట్టుకునే దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్. ఈ ఇద్దరి కాంబినేషన్లో తెరకెక్కుతున్న తాజా చిత్రం ‘ఆదర్శ కుటుంబం: హౌస్ నెం. 47’ కోసం సినీ అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. పలుమార్లు వాయిదా పడిన ఈ సినిమా ఎట్టకేలకు అక్టోబర్ 30న ప్రేక్షకుల ముందుకు రానుంది. తాజాగా ఈ సినిమా రిలీజ్ డేట్ ను వెంకటేష్ సోషల్ మీడియా వేదికగా అనౌన్స్ చేశారు. వెంకటేష్, త్రివిక్రమ్ కాంబినేషన్లో వస్తున్న ఈ సినిమాపై మొదటి నుంచే మంచి అంచనాలు నెలకొన్నాయి. తొలుత ఈ చిత్రాన్ని అక్టోబర్ 2న విడుదల చేయాలని మేకర్స్ భావించారు. ఆ తర్వాత అక్టోబర్ 9కు వాయిదా వేశారు. అయితే అనుకున్న సమయానికి సినిమా థియేటర్లలోకి రాకపోవడంతో అభిమానులు నిరాశకు గురయ్యారు.
బాబోయ్.. ఈ చిన్నది బయట ఎలా ఉందో చూశారా..! స్టార్ హీరోయిన్స్ కూడా కుళ్లుకోవాల్సిందే
సినిమాకు సంబందించిన కొన్ని పనులు , టెక్నీకల్ వర్క్ సంబంధించిన అంశాల కారణంగా విడుదలను మరోసారి వాయిదా వేశారు. ఫైనల్ గా ఈ సినిమాను అక్టోబర్ 30న విడుదల చేసేందుకు చిత్రబృందం సిద్దమైంది. వరుస వాయిదాలతో ఎదురుచూస్తున్న అభిమానులకు ఈ వార్త ఊరటనిస్తోంది. వెంకటేష్, త్రివిక్రమ్ గతంలో రచయితగా వచ్చిన సినిమాలు ప్రేక్షకులను అలరించినప్పటికీ, దర్శకుడిగా త్రివిక్రమ్‌తో వెంకటేష్ చేస్తున్న ఈ చిత్రం ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తోంది. కుటుంబ కథలు, వినోదాత్మక సన్నివేశాలు, భావోద్వేగాలను తెరపై అద్భుతంగా చూపించడంలో వెంకటేష్‌కు మంచి పేరుంది. త్రివిక్రమ్ తనదైన సంభాషణలు, కథనంతో ఈ సినిమాను ఎలా తీర్చిదిద్దారనే ఆసక్తి అభిమానుల్లో నెలకొంది.
రజినీకాంత్‌కు జోడీగా 27 ఏళ్ల హీరోయిన్.. భారీ అంచనాలతో విడుదలై అట్టర్ ఫ్లాప్ అయిన సినిమా
‘ఆదర్శ కుటుంబం’ అనే టైటిల్‌తోనే ఈ సినిమా కుటుంబ సంబంధాలు, మనుషుల మధ్య అనుబంధాలు, జీవితంలోని భావోద్వేగాలకు ప్రాధాన్యతనిచ్చే కథతో రూపొందుతోందనే ఆసక్తి ఏర్పడింది. ఈ చిత్రంలో వెంకటేష్ సరసన శ్రీనిధి శెట్టి కథానాయికగా నటిస్తున్నారు. నారా రోహిత్, నివేతా పేతురాజ్, డింపుల్ హయతి సహా పలువురు ప్రముఖ నటీనటులు కీలక పాత్రల్లో కనిపించనున్నారు. రావు రమేష్, బ్రహ్మాజీ, వెన్నెల కిశోర్ తదితరులు కూడా ఈ సినిమాలో నటిస్తున్నారు. హారిక అండ్ హాసిని క్రియేషన్స్ బ్యానర్‌పై ఎస్. రాధాకృష్ణ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వం వహిస్తుండగా, ఎస్. థమన్ సంగీతాన్ని అందిస్తున్నారు. రవి కె. చంద్రన్ సినిమాటోగ్రఫీ బాధ్యతలు చేపట్టగా, నవీన్ నూలి ఎడిటింగ్ చేస్తున్నారు.
మహేష్ బాబు తర్వాత ఆ హీరో నటన అంటే నాకు చాలా ఇష్టం: సూపర్ స్టార్ కృష్ణ
Coming together with Srinu after two decades is very special, and we’re bringing you a wholesome entertainer with fun, action and a lot more 🤗❤️❤️
See you all in theatres with your #AadarshaKutumbam and friends on October 30th! ❤️
Happy Dussehra ✨
#AK47OnOct30 #VenkateshXTrivikram
— Venkatesh Daggubati (@VenkyMama) October 20, 2026
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.




