ప్రముఖ నటీనటులు నరేశ్, పవిత్రలు త్వరలోనే పెళ్లిపీటలెక్కనున్న సంగతి తెలిసిందే. గత కొంతకాలంగా రిలేషన్ షిప్‌లో ఉన్న వీరిద్దరు న్యూ ఇయర్ రోజున తమ బంధాన్ని అధికారికంగా ప్రకటించారు. కాగా నరేష్‌కు ఇది నాలుగో వివాహం. అలాగే ఆయన మూడో భార్య రమ్య రఘుపతితో ఇప్పటికీ విభేదాలు కొనసాగుతున్నాయి. నరేష్, పవిత్రల రిలేషన్‌షిప్‌పై ఇప్పటికే చాలాసార్లు మీడియా వేదికగా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది రమ్య. భార్యను నేనుండగా.. వేరొకరితో ఎందుకు ఉన్నాడంటూ రచ్చ రచ్చ చేసింది. అటు నరేష్ కూడా రమ్యపై పలు ఆరోపణలు గుప్పించాడు. ఈనేపథ్యంలో పవిత్రను పెళ్లి చేసుకోబోతున్నట్లు నరేష్ వీడియో ద్వారా అధికారికంగా ప్రకటించడంతో మరోసారి సంచలన వ్యాఖ్యలు చేసింది రమ్య. ‘నరేశ్ బూతు వీడియోలు చూస్తాడు. నాన్న డర్టీ వీడియోలు చూస్తున్నాడని నా కుమారుడు రణ్‌వీర్ చెప్పడంతో ఈ విషయం నాకు తెలిసింది. ఒక తండ్రి ఎంత బాధ్యతగా ఉండాలి? పిల్లలతో ఎలా ప్రవర్తించాలి? ఇవేవీ నరేష్‌కు తెలియదు. అతను ఎంతో చండాలంగా ప్రవర్తించాడు. అంతేకాదు నాకు డ్రైవర్‌తో పాటు ఎవరెవరితోనో లింకులు అంటగట్టాడు.
‘ నా మీద నరేశ్ నోటికొచ్చిన అబద్ధాలు చెబుతున్నాడు. ఇవన్నీ విని నా కొడుకు మెంటల్‌గా డిస్టర్బ్ అవుతున్నాడు. మేం నిద్రలేని రాత్రుళ్లు గడుపుతున్నాం. బాబు గురించి అతను ఒక్కసారి కూడా ఆలోచించడం లేదు. ఇక పవిత్రకు నా చేత్తో అన్నం వడ్డించాను. కానీ చివరికి నరేశ్, పవిత్రా నాకే ద్రోహం చేశారు. నా కొడుకు.. నాన్న కావాలని కోరుకుంటున్నాడు. కనుక నరేశ్‌ను వదిలే ప్రసక్తే లేదు. రమ్య రఘుపతి అన్నారు.’ అంటూ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది రమ్య. ప్రస్తుతం ఈ వ్యాఖ్యలు టాలీవుడ్‌లో హాట్ టాపిక్‌గా మారాయి.
New Year ✨
New Beginnings ?
Need all your blessings ?From us to all of you #HappyNewYear ❤️
– Mee #PavitraNaresh pic.twitter.com/JiEbWY4qTQ
— H.E Dr Naresh VK actor (@ItsActorNaresh) December 31, 2022
మరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి..