మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం కొరటాల శివ దర్శకత్వంలో ‘ఆచార్య’ సినిమాలో నటిస్తోన్న విషయం తెలిసిందే. కరోనా కారణంగా ఈ మూవీ షూటింగ్ ఆగిపోయింది. ‘ఆచార్య’ కంప్లీట్ అయ్యాక మలయాళ సినిమా ‘లూసిఫర్’ తెలుగు రీమేక్ పట్టాలెక్కించేందుకు ప్రణాళికలు జరుగుతున్నాయి. టాలీవుడ్ మాస్ డైరెక్టర్ వీవీ వినాయక్ దీనికి సంబంధించిన పనులు చూస్తున్నారని చిరు ఇటీవలే తెలిపారు. అయితే ఈ సినిమా గురించి ఓ ఇంట్రస్టింగ్ అప్డేట్ ఫిల్మ్ సర్కిల్ లో చక్కర్లు కొడుతోంది.
ఈ సినిమాలోని ఓ కీలక పాత్రలో సీనియర్ నటి రమ్యకృష్ణ కనిపించనుందని టాక్. ఇప్పటికే మూవీ యూనిట్ ఆమెతో చర్చలు జరపగా.. గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని సమాచారం. త్వరలోనే దీనిపై అధికారిక ప్రకటన వచ్చే అవకాశముంది. గతంలో ‘అల్లుడు మజాకా’, ‘ముగ్గురు మొనగాళ్లు’, ‘ఇద్దరు మిత్రులు’ తదితర సినిమాల్లో కలిసి నటించారు చిరు-రమ్యకృష్ణ. అప్పట్లో ఈ జోడీకి ఆడియెన్స్ నుంచి మంచి స్పందన లభించింది. మరోసారి వీరిద్దరూ కలిసి నటిస్తే చూడాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. మరి వారి కోరిక నిజమవుతుందో లేదో తెలియాలంటే మరికొన్ని రోజులు వెయిట్ చేయాల్సిందే.
Also Read : నెల్లూరులో భారీ చోరీ, ఎన్ఫోర్స్మెంట్ అధికారులమంటూ