యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఆర్ఆర్ఆర్ సినిమాతో ఒక్కసారిగా పాన్ ఇండియా స్టార్ గా మారిపోయారు. విదేశాల్లో కూడా ఎన్టీఆర్ ను అభిమానించే వారి సంఖ్య పెరిగిపోయింది. ఇక తారక్ నటన గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఆర్ఆర్ఆర్ సినిమాలో ఆయన నటనకు ప్రేక్షకులంతా ఫిదా అయ్యారు. ఆర్ఆర్ఆర్ సినిమాతో సంచలన విజయం అందుకున్న తారక్ ప్రస్తుతం కొరటాల శివ దర్శకత్వంలో సినిమా చేస్తున్నాడు. దేవర అనే టైటిల్ తో తెరకెక్కుతోన్న ఈ సినిమా పై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ సినిమా కంటే ముందు మెగాస్టార్ చిరంజీవి, రామ్ చరణ్ తో కలిసి ఆచార్య అనే సినిమా చేశాడు కొరటాల. ఈ సినిమా ఆశించిన స్థాయిలో ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయింది. ఇప్పటివరకు కొరటాల దర్శకత్వంలో వచ్చిన సినిమాలు ఏవీ కూడా ఫ్లాప్ అవ్వలేదు ఒక్క ఆచార్య సినిమా తప్పా.. గతంలో ఎన్టీఆర్ తో జనతా గ్యారేజ్ అనే సినిమా చేశారు కొరటాల. ఆ సినిమా మంచి విజయాన్ని అందుకుంది.
ఇక ఇప్పుడు ఈ ఇద్దరు కలిసి దేవర సినిమా చేస్తుండటంతో అభిమానుల్లో ఈ మూవీ పై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇప్పటికే దేవరసినిమా నుంచి విడుదల చేసిన ప్రీ లుక్ పోస్టర్స్ ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. ఈ మూవీలో ఎన్టీఆర్ కు జోడీగా అతిలోక సుందరి శ్రీదేవి కూతురు జాన్వీ కపూర్ నటిస్తుంది. ఈ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయం కానుంది జాన్వీ.
ఇదిలా ఉంటే ఈ సినిమా గురించి ఓ ఇంట్రెస్టింగ్ టాక్ ఇప్పుడు ఫిలిం సర్కిల్స్ లో చక్కర్లు కొడుతోంది. ఈ సినిమాలో ఎన్టీఆర్ కు అత్తగా విలక్షణ నటి రమ్యకృష్ణ నటించనున్నారని తెలుస్తోంది. గతంలో ఎన్టీఆర్ తో కలిసి నా అల్లుడు సినిమాలో నటించారు. ఆ సినిమాలో ఎన్టీఆర్ కు అత్తగా నటించారు. ఇప్పుడు మరోసారి ఆమె తారక్ కు అత్త పాత్రలో కనిపించనున్నారని టాక్ వినిపిస్తుంది. జాన్వీ కపూర్ అమ్మపాత్రలో రమ్యకృష్ణ కనిపించనున్నారట. ఎన్టీఆర్ . రమ్య కృష్ణ మధ్య వచ్చే సన్నివేశాలు ప్రేక్షకులను ఆకట్టుకుంటాయని తెలుస్తోంది. త్వరలోనే దీని పై క్లారిటీ వస్తుందేమో చూడాలి.
ఎన్టీఆర్ దేవర సినిమా తర్వాత ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో సినిమా చేయనున్న విషయం తెలిసిందే..
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.