Ranbir Kapoor: గణేషుని పూజా ప్రసాదాన్ని నిరాకరించిన ‘రామయణం’ హీరో రణ్‌బీర్ కపూర్.. వీడియో వైరల్

వినాయక చవితి సందర్భంగా బాలీవుడ్ హీరో రణబీర్ కపూర్‌కు సంబంధించిన ఒక వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. దీనిని చూసిన సినీ అభిమానులు, నెటిజన్లు రామాయణం హీరోపై తీవ్ర విమర్శలు చేస్తున్నారు. రణ్ బీర్ ను తప్పుపడుతూ కామెంట్స్ పెడుతున్నారు.

Ranbir Kapoor: గణేషుని పూజా ప్రసాదాన్ని నిరాకరించిన రామయణం హీరో రణ్‌బీర్ కపూర్.. వీడియో వైరల్
Ranbir Kapoor

Updated on: Sep 17, 2026 | 1:59 PM

బాలీవుడ్ చాక్లెట్ హీరో రణబీర్ కపూర్ ప్రస్తుతం ‘రామాయణం’ చిత్రంలో నటిస్తున్నాడు. ఇందులో ఆయన శ్రీరాముడిగా నటిస్తున్నాడు. న్యాచురల్ బ్యూటీ సాయి పల్లవి సీతగా కనిపించనుంది. ఇటీవలే ‘రామాయణం’ నుంచి రిలీజైన ‘జై జై రామ్’ పాటకు సోషల్ మీడియాలో మంచి రెస్పాన్స్ వస్తోంది. అయితే ఇంతలోనే రణబీర్‌కు సంబంధించిన ఒక వీడియో సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతోంది. ఈ వీడియోలో వినాయకుడిని దర్శనం చేసుకున్న తర్వాత రణబీర్ ప్రసాదం తీసుకోవడానికి నిరాకరిస్తూ కనిపించారు. దీంతో ఈ వీడియో సోషల్ మీడియాలో తీవ్ర చర్చకు దారితీసింది. దీనిని చూసిన నెటిజన్లు రామయాణం హీరోపై తీవ్ర విమర్శలు చేస్తున్నారు. అయితే సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియో ఇప్పటిది కాదు, 2023 నాటిది. ఆ వీడియోలో రణబీర్ కపూర్ వినాయకుడిని దర్శనం చేసుకున్న తర్వాత అక్కడున్న పూజారి హీరోకు ప్రసాదం ఇస్తారు. అయితే దీనిని స్వీకరించిన ‘రణ్ బీర్ పూర్ ఇప్పుడు ‘నేను డైట్‌లో ఉన్నాను, మీరే తినండి’ అంటూ తన చేతిలో ఉన్న ప్రసాదాన్ని మరొక వ్యక్తికి ఇచ్చాడు రణ్ బీర్ కపూర్.

ఈ పాత వీడియో మళ్లీ వెలుగులోకి వచ్చిన తర్వాత, కొంతమంది సోషల్ మీడియా యూజర్లు రణబీర్‌ను విమర్శిస్తున్నారు. ప్రసాదాన్ని నిరాకరించడం సరైన పద్దతి కాదంటూ కొందరు రణ్ బీర్ ను ట్రోల్ చేస్తున్నారు.ఇదే క్రమంలో రామాయణం సినిమాను కూడా ప్రస్తావిస్తున్నారు. ‘బీఫ్ తినే వ్యక్తి ప్రసాదం ఎలా తింటాడు, పైగా అతనికి శ్రీరాముడి పాత్ర ఇచ్చారు’ అని కొందరు నెటిజన్లు తీవ్రంగా రణ్ బీర్ కపూర్ ను విమర్శిస్తున్నారు.

ఇవి కూడా చదవండి

నితేష్ తివారీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘రామాయణం’ చిత్రంలో రణబీర్ కపూర్ శ్రీరాముడి పాత్రను పోషిస్తున్నారు. ఈ చిత్రంలో సాయి పల్లవి సీతగా, యశ్ రావణుడిగా, సన్నీ డియోల్ హనుమంతుడిగా, రవి దూబే లక్ష్మణుడిగా కనిపించనున్నారు. ‘రామాయణం’ రెండు భాగాలుగా విడుదల కానుంది మరియు మొదటి భాగం 2026 దీపావళికి విడుదలయ్యే అవకాశం ఉంది.

నెట్టింట వైరలవుతోన్న వీడియో ఇదే..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Loading...
Unable to load recommendations.
Follow Us