Ram Pothineni: ‘స్కంద’ మూవీ ట్రోల్స్ పై స్పందించిన రామ్.. ఒక్క ఫోటోతో చెక్ పెట్టేశాడు..

రెండు రోజులుగా డైరెక్టర్ బోయపాటి శ్రీనుకు సంబంధించిన ఓఫోటోను సైతం వైరల్ చేస్తున్నారు. ఫైట్ సీన్ లో భాగంగా ఓ సన్నివేశాన్ని బోయపాటి చేసి చూపిస్తున్న ఆ ఫోటోను తెగ ట్రోల్ చేస్తున్నారు. ఈ క్రమంలో తాజాగా స్కంద మూవీ ట్రోలింగ్స్ పై స్పందించారు హీరో రామ్ పోతినేని. సినిమా కోసం తాను ఎంతగా కష్టపడ్డారో చెబుతూ.. గాయపడిన తన పాదాల ఫోటోను షేర్ చేశారు. ఆ ఫైటింగ్ సీన్ ఇంకా గుర్తుందని..ఆ సీన్ తర్వాత సరిగ్గా నడవలేకపోయానని పాదాల నుంచి రక్తం వచ్చిందంటూ

Ram Pothineni: స్కంద మూవీ ట్రోల్స్ పై స్పందించిన రామ్.. ఒక్క ఫోటోతో చెక్ పెట్టేశాడు..
Ram Pothineni

Updated on: Nov 04, 2023 | 6:37 PM

గత కొద్దిరోజులుగా సోషల్ మీడియాలో ‘స్కంద’ సినిమాపై విపరీతమైన ట్రోల్స్ నడుస్తున్న సంగతి తెలిసిందే. ఈ మూవీలోని కొన్ని యాక్షన్ సన్నివేశాలపై మీమ్స్ తెగ వైరలవుతున్నాయి. రామ్ పోతినేని ఫైటింగ్ సీన్స్ పై ఫన్నీగా మీమ్స్ చేసి ట్రోల్ చేస్తున్నారు. ఇక రెండు రోజులుగా డైరెక్టర్ బోయపాటి శ్రీనుకు సంబంధించిన ఓఫోటోను సైతం వైరల్ చేస్తున్నారు. ఫైట్ సీన్ లో భాగంగా ఓ సన్నివేశాన్ని బోయపాటి చేసి చూపిస్తున్న ఆ ఫోటోను తెగ ట్రోల్ చేస్తున్నారు. ఈ క్రమంలో తాజాగా స్కంద మూవీ ట్రోలింగ్స్ పై స్పందించారు హీరో రామ్ పోతినేని. సినిమా కోసం తాను ఎంతగా కష్టపడ్డారో చెబుతూ.. గాయపడిన తన పాదాల ఫోటోను షేర్ చేశారు. ఆ ఫైటింగ్ సీన్ ఇంకా గుర్తుందని..ఆ సీన్ తర్వాత సరిగ్గా నడవలేకపోయానని పాదాల నుంచి రక్తం వచ్చిందంటూ సోషల్ మీడియా వేదికగా రాసుకొచ్చారు.

“22.04.23 నాకు ఇంకా గుర్తుంది. వేసవి కాలం అత్యంత వేడిగా ఉండే రోజులలో ఇది కూడా ఒకటి. మొత్తం 25 రోజుల షెడ్యూల్‏లో అది 3వ రోజు మాత్రమే. ఈ ఎపిసోడ్‌ని షూట్ చేసిన తర్వాత నేను సరిగ్గా నడవలేకపోయాను. కనీసం అడుగులు వేయలేకపోయాను. ఒకసారి నడిస్తే పాదాల నుంచి రక్తం వచ్చింది. అందుకే ఆ సీన్ ఎలా రావాలి.. ఎలా నటించాలనేది మా డైరెక్టర్ స్వయంగా చేసి చూపించారు. కంటెంట్‌ని ఇష్టపడడం లేదా ఇష్టపడకపోవడం అనేది పూర్తిగా ప్రేక్షకుల ఎంపిక. నేను మీ అభిప్రాయాలను గౌరవిస్తూనే ఉంటాను. కానీ నా కోసం స్కంద మూవీని ఇచ్చినందుకు థాంక్యూ. థియేటర్లలో మీ వద్దకు వచ్చే ప్రతి సినిమాలో నా రక్తం & చెమటను చిందించడానికి సిద్ధంగా ఉంటాను” అంటూ షూటింగ్ సమయంలో గాయపడిన పాదం ఫోటోను ట్విట్టర్ వేదికగా షేర్ చేస్తూ స్కంద సినిమా వచ్చే ట్రోలింగ్స్‏కు గట్టి కౌంటరిచ్చారు రామ్.

మాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీను దర్శకత్వంలో రామ్ పోతినేని నటించిన చిత్రం స్కంద. మాస్ యాక్షన్ నేపథ్యంలో వచ్చిన ఈ సినిమా ఎన్నో అంచనాల మధ్య విడుదలై డిజాస్టర్ అయ్యింది. ఇందులో శ్రీలీల కథానాయికగా నటించింది. ప్రస్తుతం ఈ మూవీ ఓటీటీ ప్లాట్ ఫాం డిస్నీ ప్లస్ హాట్ స్టార్ వేదికగా అలరిస్తోంది.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.