Ram Gopal Varma: రాధేశ్యామ్ సినిమాపై ఆర్జీవీ షాకింగ్ కామెంట్స్.. ప్రేమకథకు విజువల్ ఫీస్ట్ అవసరం లేదంటూ..

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ (Prabhas).. పూజా హెగ్డే జంటగా నటించిన సినిమా రాధేశ్యామ్ (Radhe Shyam). డైరెక్టర్ రాధాకృష్ణ కుమార్ తెరకెక్కించిన

Ram Gopal Varma: రాధేశ్యామ్ సినిమాపై ఆర్జీవీ షాకింగ్ కామెంట్స్.. ప్రేమకథకు విజువల్ ఫీస్ట్ అవసరం లేదంటూ..
Ram Gopal Varma
Follow us

|

Updated on: Mar 18, 2022 | 12:37 PM

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ (Prabhas).. పూజా హెగ్డే జంటగా నటించిన సినిమా రాధేశ్యామ్ (Radhe Shyam). డైరెక్టర్ రాధాకృష్ణ కుమార్ తెరకెక్కించిన ఈ మూవీ మార్చి 11న విడుదలై బ్లాక్ బస్టర్ హిట్ అందుకుంది. పాన్ ఇండియా లెవల్లో ఎంతో గ్రాండ్‏గా రిలీజ్ అయిన ఈ మూవీపై మిక్స్డ్ టాక్ కూడా వచ్చింది. వింటెజ్ లవ్ స్టోరీగా వచ్చిచన ఈ మూవీ సూపర్ హిట్ అని కొందరు అంటుండగా.. మరి కొందరు మాత్రం ప్లాప్ అంటూ కామెంట్స్ చేసిన సంగతి తెలిసిందే. తాజాగా వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ (Ram Gopal Varma) ఈ మూవీపై రాధేశ్యామ్ సినిమాపై సంచలన వ్యాఖ్యలు చేశాడు. ప్రభాస్ రెమ్యునరేషన్ పక్కన పెడితే ఆ మూవీకి అంతగా ఖర్చు పెట్టాల్సిన అవసరం లేదంటూ కామెంట్స్ చేశాడు.. ఈ సినిమాకు పెట్టిన బడ్జెట్‏లో 5వ వంతులో రాధేశ్యామ్ తీయవచ్చని చెప్పాడు..

ఇటీవల ఓ యూట్యూబ్ ఛానల్‏కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆర్జీవి మాట్లాడుతూ.. రాధేశ్యామ్ సినిమాలో ప్రభాస్ పారితోషికం పక్కన పెడితే.. ఈ సినిమా బడ్జెట్ మొత్తంలో 5వ వంతుతో సినిమా తీయవచ్చు. రాధేశ్యామ్ వంటి ఇంటెన్స్ లవ్ స్టోరీ అభిమానులకు విజువల్స్ ఫీస్ట్ అవసరం లేదన్నాడు.. గీతాంజలి సినిమా మాదిరిగా.. మంచు కొండలు వంటి లొకేషన్ ఉంటే చాలన్నాడు.. కథలోని భావోద్వేగం.. భావాలను విజువల్ ఫిస్ట్ డ్యామినేట్ చేస్తాయని.. అసలైన స్టోరీని చంపేస్తాయన్నాడు. ప్రభాస్ సినిమా ఎలా ఉన్నా అభిమానులు ఆధరిస్తారని.. విజువల్ ఫిస్ట్ ఉన్నందునే రాధేశ్యామ్ సినిమాకు ప్రేక్షకులు కనెక్ట్ కాలేకపోయారని తెలిపాడు.. సెట్ ఆర్టిఫిషియల్ కావడంతో.. కథలోని పాత్రలు కూడా ఆర్టిఫిషియల్ అయిపోయాన్నాడు..

బాలీవుడ్ మూవీ ది కశ్మీర్ ఫైల్స్ గురించి విడుదలయ్యే వరకు ఎవరికీ తెలియదని.. కేవలం రూ. 4 కోట్ల నుంచి 5 కోట్లతో రూపొందించారని.. ఇప్పుడు 100 కోట్ల వసూళ్లు సాధించిందని తెలిపాడు.. రాధేశ్యామ్ సినిమా బడ్జెట్.. వచ్చిన వసూళ్లకు పొంతన లేదంటూ చెప్పుకొచ్చాడు.. ఒక్కడు.. గజిని వంటి చిత్రాలు ఎంతో అందమైన లొకేషన్స్‏లో తెరకెక్కించారని… వాటి కోసం అంతగా ఖర్చు కాలేదని చెప్పుకొచ్చాడు.. బాహుబలి సినిమాకు పెట్టిన బడ్జెట్ కరెక్ట్ అని.. కానీ ఇప్పుడు అంత బడ్డెట్ అవసరం లేని సినిమాకు ఖర్చు చేసి మూవీని ప్లాస్టిక్ చేస్తున్నారంటూ చెప్పుకొచ్చాడు.

Also  Read: Vidya Balan: ఆ నిర్మాత నాతో దారుణంగా ప్రవర్తించాడు.. నన్ను అసహ్యంగా చూసేవారు.. బాలీవుడ్ బ్యూటీ షాకింగ్ కామెంట్స్..

Aishwarya Danush: భార్యభర్తలుగా విడిపోయారు.. స్నేహితులుగా మారిపోయారు.. ధనుష్.. ఐశ్వర్య ట్వీట్స్ వైరల్..

Holi 2022: హోలీ రంగుల నుంచి కళ్లను కాపాడుకోవాలనుకుంటే.. ఈ 4 చిట్కాలను అనుసరించండి..

Chia Seeds Benefits: చియా విత్తనాలతో అద్భుతమైన ప్రయోజనాలు.. ఈ వ్యాధులకు చెక్ పెట్టొచ్చు….

Latest Articles
కొత్త ఓటర్లతో ముచ్చటించిన కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి..
కొత్త ఓటర్లతో ముచ్చటించిన కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి..
ఏంటీ.? నిజామా.! రజనీకాంత్‌ ఆత్మహత్య చేసుకోవాలనుకున్నారా?
ఏంటీ.? నిజామా.! రజనీకాంత్‌ ఆత్మహత్య చేసుకోవాలనుకున్నారా?
పోలింగ్‌ డే రోజున వరుణుడు కరుణిస్తాడా.? 5 రోజుల పాటు వర్షాలు
పోలింగ్‌ డే రోజున వరుణుడు కరుణిస్తాడా.? 5 రోజుల పాటు వర్షాలు
మీ నీడ మాయమైయ్యిందా.? నక్షత్రశాల ప్రతినిధులు వెల్లడి..
మీ నీడ మాయమైయ్యిందా.? నక్షత్రశాల ప్రతినిధులు వెల్లడి..
నట్టింట్లో నల్లత్రాచుకు ప్రత్యేక పూజలు.! వీడియో వైరల్..
నట్టింట్లో నల్లత్రాచుకు ప్రత్యేక పూజలు.! వీడియో వైరల్..
కొత్తకారు కొన్నాడు.. గుడిలో పూజలు కూడా చేయించాడు.. అంతలోనే షాక్.!
కొత్తకారు కొన్నాడు.. గుడిలో పూజలు కూడా చేయించాడు.. అంతలోనే షాక్.!
ఓటు వెయ్యాలంటే గుర్రమెక్కాల్సిందే.! గిరిజనుల వినూత్న నిరసన.
ఓటు వెయ్యాలంటే గుర్రమెక్కాల్సిందే.! గిరిజనుల వినూత్న నిరసన.
ఎర్ర అరటిపండ్లు ఎక్కడ కనపడ్డా వెంటనే కొనేయండి.. ఎందుకంటే.?
ఎర్ర అరటిపండ్లు ఎక్కడ కనపడ్డా వెంటనే కొనేయండి.. ఎందుకంటే.?
మొబైల్‌ వినియోగదారులకు అలర్ట్‌.. ఈ ఫోన్లలో ప్రమాదకర వైరస్‌.!
మొబైల్‌ వినియోగదారులకు అలర్ట్‌.. ఈ ఫోన్లలో ప్రమాదకర వైరస్‌.!
అబ్బా తమ్ముడు.! కారులోనే యాపారం మొదలెట్టేశావ్‌గా.. చెక్ చేయగా!
అబ్బా తమ్ముడు.! కారులోనే యాపారం మొదలెట్టేశావ్‌గా.. చెక్ చేయగా!