ఈనెల 10న జరిగాయి ‘మా’ ఎలక్షన్స్. ఎన్నికలకు ముందు ఎంత రచ్చ జరిగిందో చూశాం. లోకల్-నాన్ లోకల్, పొలిటికల్ లీడర్స్ సపోర్ట్.. కులాల కుంపట్లు, వ్యక్తిగత ఆరోపణలు, డబ్బులు పంపకం… ఇలా రకరకాలు అంశాలు తెరపైకి వచ్చాయి. ఎన్నికల తర్వాత అయినా పరిస్థితులకు కుదటపడతాయి అనుకున్నాం. అయితే రిజల్ట్స్ తర్వాత వేడి మరింత పెరిగింది. ప్రకాశ్ రాజ్ ప్యానల్ నుంచి గెలిచిన 11 మంది సభ్యులు రాజీనామా చేశారు. ఎన్నికల రోజు ఏకంగా మోహన్ బాబు అండ్ కో రౌడీయిజం చేశారన్నది ప్రకాష్‌రాజ్ టీమ్ ఆరోపణ. మోహన్‌బాబు, నరేష్ భౌతిక దాడులకు దిగారాని, బండబూతులు తిట్టారని చెబుతున్నారు. ఏకంగా ప్రెస్‌మీట్ పెట్టిమరీ ఇదేవిషయం చెప్పారు. కౌంటింగ్ జరిగిన తీరుపైనా డౌట్స్ రైజ్ చేశారు. రాత్రి గెలిచాం..ఉదయానికి ఓడిపోయాం అంటూ స్టేట్‌మెంట్లు కూడా ఇచ్చారు. అయితే ఈ ఆరోపణలకు సాక్ష్యాలు కూడా ఉన్నాయంటోంది ప్రకాష్‌రాజ్ టీమ్. సీసీఫుటేజ్ ఇస్తే అన్ని విషయాలు బయటపడుతాయన్నది వారి వాదన. మరి ఇచ్చేందుకు ఎలక్షన్ ఆఫీసర్‌కు ఉన్న అభ్యంతరాలేంటి అన్నది తేలాల్సి ఉంది..మొత్తానికి ‘మా’ సినిమా ఇంకా ముగియలేదు. ఇదిలా ఉంచితే.. తనకు సంబంధం ఉన్నా, లేకపోయినా అన్ని అంశాల్లో ‘ట్వీటు’ పెట్టే దర్శకుడు రామ్ గోపాల్ వర్మ.. ఇంత రచ్చ జరుగుతున్నా కనీసం స్పందించలేదు. అప్పుడెప్పుడో లోకల్, నాన్-లోకల్ అంశపై ఓ సెటైరికల్ ట్వీట్ వేసి లైట్ తీసుకున్నారు. తాజాగా తీరిగ్గా ఓ ట్వీట్ వేశారు. లేటుగా వేసినా ‘మా’ పరిణామాలపై తన వెర్షన్‌ను ఒక్క మాటలో తేల్చేశారు.
‘మా’లోని మొత్తం వ్యవహారం చూస్తుంటే సర్కస్‌ని తలపించేలా ఉందంటూ వ్యంగ్యాస్త్రాలు విసిరారు. దీంతో వర్మ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు అంతటా చర్చనీయాంశంగా మారాయి. ఆర్జీవీ ట్వీట్ ఇప్పుడు వైరల్‌గా మారింది.
Cine”MAA”people proved to the audience, that they are actually a CIRCUS ????
— Ram Gopal Varma (@RGVzoomin) October 16, 2021
Also Read: ‘అలయ్ బలయ్’ కార్యక్రమంలో పవన్‌ను పలకరించేందుకు మంచు విష్ణు యత్నం.. కానీ