Ram Charan: యాక్టింగ్ స్కూల్లో రామ్ చరణ్ ఫస్డ్ డే ఆడిషన్ వీడియో.. భయంగా మొహమాటపడుతూ..

ట్రిపుల్ ఆర్ మూవీలో అల్లూరి సీతారామరాజు, రంగస్థలం సినిమాలో చిట్టిబాబు పాత్రలతో తన నటనతో కట్టిపడేశాడు. మెగాస్టార్ చిరంజీవి వారసుడిగా తెరంగేట్రం చేసి.. ఇప్పుడు తనకంటూ గ్లోబల్ స్టార్ ఇమేజ్ సంపాదించుకున్నాడు. కెరీర్ మొదట్లో ఎన్నో అవమానాలు ఎదుర్కొన్నాడు. కానీ తన నటన.. పట్టుదల.. శ్రమతో విమర్శించిన వారే ప్రశంసించేలా చేసుకున్నాడు. నిజ జీవితంలోనూ హీరోగా అందరి హృదయాలను గెలుచుకున్నాడు చరణ్. అయితే సినిమాల్లోకి రాకముందు చరణ్ యాక్టింగ్ స్కూల్లో శిక్షణ తీసుకున్నాడు.

Ram Charan: యాక్టింగ్ స్కూల్లో రామ్ చరణ్ ఫస్డ్ డే ఆడిషన్ వీడియో.. భయంగా మొహమాటపడుతూ..
Ram Charan
Follow us

|

Updated on: Dec 30, 2023 | 12:00 PM

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ప్రస్తుతం ఇండియన్ టాప్ హీరోలలో ఒకరు. ఆర్ఆర్ఆర్ సినిమాతో ప్రపంచవ్యాప్తంగా భారీ ఫాలోయింగ్ సంపాదించుకున్నాడు. ఈ మూవీతో ఆయన క్రేజ్ ఒక్కసారిగా మారిపోయింది. ఇప్పుడు చరణ్ సినిమాలపై హాలీవుడ్ మేకర్స్ సైతం ప్రశంసలు కురిపిస్తున్నారు. ట్రిపుల్ ఆర్ మూవీలో అల్లూరి సీతారామరాజు, రంగస్థలం సినిమాలో చిట్టిబాబు పాత్రలతో తన నటనతో కట్టిపడేశాడు. మెగాస్టార్ చిరంజీవి వారసుడిగా తెరంగేట్రం చేసి.. ఇప్పుడు తనకంటూ గ్లోబల్ స్టార్ ఇమేజ్ సంపాదించుకున్నాడు. కెరీర్ మొదట్లో ఎన్నో అవమానాలు ఎదుర్కొన్నాడు. కానీ తన నటన.. పట్టుదల.. శ్రమతో విమర్శించిన వారే ప్రశంసించేలా చేసుకున్నాడు. నిజ జీవితంలోనూ హీరోగా అందరి హృదయాలను గెలుచుకున్నాడు చరణ్. అయితే సినిమాల్లోకి రాకముందు చరణ్ యాక్టింగ్ స్కూల్లో శిక్షణ తీసుకున్నాడు. అక్కడ హీరోయిన్ శ్రియాతో కలిసి ఒక స్కిట్ కూడా చేశాడు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అయిన సంగతి తెలిసిందే. ఇక ఇప్పుడు చరణ్ యాక్టింగ్ ఇన్‌స్టిట్యూట్ కు సంబంధించిన పాత వీడియో చక్కర్లు కొడుతుంది.

వీడియో చూస్తుంటే.. యాక్టింగ్ స్కూల్లో చరణ్‏కు మొదటి రోజు అని తెలుస్తోంది. తన శిక్షణ ప్రారంభించే ముందు స్టేజ్ భయం పోవడానికి కాసేపు వ్యాయమం చేయించారు. ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరలవుతున్న వీడియోలో.. చరణ్ కాస్త భయపడుతూ.. మొహమాటపడుతూ వ్యాయమం చేస్తూ కనిపిస్తున్నాడు. క్లీన్ షేవింగ్, పొడవాటటి జుట్టుతో ఉన్న చెర్రీని గుర్తించడం కష్టమే. చరణ్ ఫస్ట్ ఆడిషన్ వీడియో ఇప్పుడు వైరలవుతుండగా.. హీరోగా తనను తాను నిరూపించుకునేందుకు చరణ్ ఎప్పుడో ప్రయాణం మొదలు పెట్టాడని.. తన శ్రమ, పట్టుదలతో ఇప్పుడు గ్లోబల్ స్టార్ ఇమేజ్ అందుకున్నాడని కామెంట్స్ చేస్తున్నారు మెగా ఫ్యాన్స్.

ఇదిలా ఉంటే.. చివరిసారిగా ట్రిపుల్ ఆర్ సినిమాలో కనిపించిన చరణ్.. ప్రస్తుతం గేమ్ ఛేంజర్ చిత్రంలో నటిస్తున్నారు. డైరెక్టర్ శంకర్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో కియారా అద్వానీ, అంజలి హీరోయిన్లుగా నటిస్తున్నారు. భారీ బడ్జెట్ పాన్ ఇండియా మూవీగా వస్తున్న గేమ్ ఛేంజర్ వచ్చే ఏడాదిలో అడియన్స్ ముందుకు రానుంది. పొలిటికల్ నేపథ్యంలో రాబోతున్న ఈ చిత్రంలో మొదటిసారి చరణ్ రాజకీయ నాయకుడిగా.. అలాగే కలెక్టర్ పాత్రలో కనిపించనున్నాడు. ఇప్పటికే విడుదలైన ఫస్ట్ లుక్ పోస్టర్ సినిమాపై ఆసక్తిని పెంచేసింది.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.