Mosagallu Movie : మంచు – కొణిదెల ఫ్యామిలీ బాండ్… విష్ణుకు బాసటగా నిలిచిన రాం చరణ్

|

Mar 20, 2021 | 8:42 PM

మెగాస్టార్ చిరంజీవి ఫ్యామిలీకి మంచు ఫ్యామిలీకి మధ్య అనుబంధం గురించి ప్రత్యేకంగా చెప్పాలిసిన అవసరం లేదు. ఒకరింటి ఫ్యామిలీ ఫంక్షన్స్ లో ఒకరు వెళ్తూ ఇద్దరి మధ్య అనుబంధాన్ని మరింత  పెంచుకుంటున్నారు.

Mosagallu Movie : మంచు - కొణిదెల ఫ్యామిలీ బాండ్... విష్ణుకు బాసటగా నిలిచిన రాం చరణ్
Charan
Follow us on

Mosagallu Movie : మెగాస్టార్ చిరంజీవి ఫ్యామిలీకి మంచు ఫ్యామిలీకి మధ్య అనుబంధం గురించి ప్రత్యేకంగా చెప్పాలిసిన అవసరం లేదు. ఒకరింటి ఫ్యామిలీ ఫంక్షన్స్ లో ఒకరు వెళ్తూ ఇద్దరి మధ్య అనుబంధాన్ని మరింత పెంచుకుంటున్నారు. గతంలో ఈ ఇద్దరి మధ్య చిన్న చిన్న వివాదాలు ఉండేవి. ఇటీవల అవన్నీ తొలిగిపోయి ఎంతో ఐక్యమత్యంగా ఉంటున్నారు. ఇక మెగాస్టార్ సినిమా షూటింగ్ స్పాట్ లో మోహన్ బాబు దర్శనమిస్తుండటంతో అభిమానులు మరింత ఖుష్ అవుతున్నారు. ఇక మెగాస్టార్ చిరంజీవి తనయుడు రామ్ చరణ్, అలాగే మోహన్ బాబు పిల్లలు మంచు లక్ష్మీ, విష్ణు, మనోజ్ కూడా చాలా క్లోజ్ గా ఉంటారు.

తాజాగా మంచు విష్ణు నటించిన మోసగాళ్లు సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. భారీ స్క్యామ్ నేపథ్యంలో తెరకెక్కిన ఈ సినిమా ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది. ఈ సినిమాలో విష్ణు అక్కగా స్టార్ హీరోయిన్ కాజల్ అగర్వాల్ నటించింది. ఇక రూ. 50 కోట్ల పెట్టుబడితో హాలీవుడ్ దర్శకుడి సారధ్యంలో తెరకెక్కించామని స్వయంగా నిర్మాత, నటుడు మంచు విష్ణు ప్రకటించారు. కాజల్ తనకి అక్కగా నటించిందన్న విషయన్నీ కూడా బయట పెట్టాడు. అన్ని రకాల పబ్లిసిటీ మార్గాల ద్వారా ఈ సినిమాపై ఆసక్తిని పెంచారు చిత్రయూనిట్. ఈ సినిమా పై మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ సినిమా పై ప్రశంసలు కురిపించారు. సోషల్ మీడియా వేదికగా చిత్రయూనిట్ కు అభినందనలు తెలిపాడు చరణ్. సినిమా చాలా బాగుందండని టాక్ వినిపిస్తుంది.మోసగాళ్లు చిత్రయూనిట్ కు శుభాకాంక్షలు, మై బ్రదర్ విష్ణు, సునీల్ శెట్టి అలాగే ఈ సినిమాలో అద్భుతంగా నటించిన కాజల్ కు అభినందనలు. మంచి థ్రిల్లర్ సినిమాను తప్పక చూడండి అంటూ తన సోషల్ మీడియాలో చరణ్ రాసుకొచ్చారు.

మరిన్ని ఇక్కడ చదవండి : 

Sonu Sood: సోనూ భాయ్‌‌కు అరుదైన గౌరవం.. ఉబ్బితబ్బిబ్బవుతున్న బాలీవుడ్ రియల్ హీరో..(Photo Gallery)

Raashi Khanna New Pics: గోల్డ్ కలర్‌లో మెరిసిన రాశి ఖన్నా.. చూస్తే కుర్రాళ్లు మతులు పోయినట్లే.!