RRR-Ram Charan: మన మధ్య లేడంటే నమ్మాలని లేదు.. ఇక్కడే ఉన్నారనిపిస్తోంది.. రామ్ చరణ్  భావోద్వేగ కామెంట్స్.. 

మెగా నందమూరి అభిమానులు ఆర్ఆర్ఆర్ (RRR) సినిమా కోసం ఎంతో ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు. మరో ఐదు రోజుల్లో ఆర్ఆర్ఆర్

RRR-Ram Charan: మన మధ్య లేడంటే నమ్మాలని లేదు.. ఇక్కడే ఉన్నారనిపిస్తోంది.. రామ్ చరణ్  భావోద్వేగ కామెంట్స్.. 
Charan

Updated on: Mar 20, 2022 | 9:16 AM

మెగా నందమూరి అభిమానులు ఆర్ఆర్ఆర్ (RRR) సినిమా కోసం ఎంతో ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు. మరో ఐదు రోజుల్లో ఆర్ఆర్ఆర్ సినిమా ప్రపంచవ్యాప్తంగా భారీ స్తాయిలో విడుదల కానుంది. ఈ క్రమంలో సినిమా ప్రమోషన్స్ వేగవంతం చేసింది చిత్రయూనిట్.. ముంబై.. దుబాయ్ అంటూ ప్రపంచవ్యాప్తంగా ప్రీరిలీజ్ ఈవెంట్స్ నిర్వహిస్తున్నారు. శుక్రవారం దుబాయ్‏లో ఘనంగా ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించిన చిత్రయూనిట్.. ఆదివారం సాయంత్రం కర్ణాటకలోని చిక్‏బల్లాపూర్‏లో ప్రీ రిలీజ్ ఈవెంట్ ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకలో రామ్ చరణ్, ఎన్టీఆర్, రాజమౌళి పాల్గొన్నారు. అదే సమయంలో కన్నడ పవర్ స్టార్ పునీత్ రాజ్ కుమార్‏ను తలచుకుని ఎమోషనల్ అయ్యారు..

ఈ సందర్భంగా రామ్ చరణ్ మాట్లాడుతూ.. మా కుటుంబ సభ్యుడు.. పెద్దన్నయ్య పునీత్ రాజ్ కుమార్ గారు మన మధ్య లేడంటే నమ్మాలని లేదు..నమ్మను కూడా. ఆయన ఇక్కడే ఉంటూ మనల్ని ఆశీర్వాదిస్తుంటాడు.. ఆయన లేని లోటు శివన్న ద్వారా తీర్చుకుంటాం. మా కోసం ఓపికగా ఎదురుచూస్తున్నా అభిమానులకు ధన్యవాదాలు.. మీరంత నీడలా మా వెంట ఉన్నారు. మా కష్టం.. మా శ్రమను మీరు మార్చి 25న చూడబోతున్నారు. ప్రస్తుతం జీరో ఫీలింగ్స్ ఉన్నాయి. మీ అందరూ సినిమా చూడండి.. కర్ణాటక పెద్ద మార్కెట్. ఏపీ. తెలంగాణ ఎంత పెద్ద మార్కెటో.. కర్ణాటక కూడా అంతే. ఈ సినిమాను రిలీజ్ చేస్తున్న కేవీఎన్ గారికి థ్యాంక్స్. ఈ సినిమాలో నటించిందుకు సంతోషంగా ఉందంటూ చెప్పుకొచ్చారు చరణ్.

Also Read: Puneeth Rajkumar: అందుకే నేను పునీత్‌ చివరి సినిమాకు వెళ్లలేదు.. జేమ్స్‌ చిత్రంపై అప్పు సతీమణి అశ్విని ఎమోషనల్‌..

Bheemla Nayak: భీమ్లా నాయక్‌లో పవన్ వాడిన బైక్‌ను సొంతం చేసుకోవాలా?.. అయితే ఇలా చేయండి

Puneeth Rajkumar: పునీత్ పుట్టిన రోజున నీ స్మృతిలో అంటూ అనాథ వృద్ధులకు అన్నదానం చేసిన హీరో విశాల్.. వీడియో వైరల్

Pushpa 2: పుష్ప సీక్వెల్‌లోనూ ఐటెం సాంగ్‌.. ఈసారి బన్నీతో చిందులేయనుంది ఎవరో తెలుసా.?

Loading...
Unable to load recommendations.
Follow Us