అదే మీరు నాకిచ్చే బ‌ర్త్ డే గిప్ట్..చ‌ర‌ణ్ ఎమోష‌న‌ల్ పోస్ట్..

తన బ‌ర్త్ డే సంద‌ర్బంగా అభిమానులు బయటకు వెళ్లకుండా ఇంట్లోనే ఉండి కరోనా త‌రిమికొట్టేందుకు పోరాడాలని పిలుపునిచ్చాడు మెగా హీరో రామ్ చరణ్. అదే ఫ్యాన్స్ త‌న‌కు ఇచ్చే అతిపెద్ద గిప్ట్ అంటూ ట్వీట్ చేశాడు. 35 ప‌డిలోకి అడుగుపెట్టిన మెగా ప‌వర్ స్టార్ కు ప‌లువురు ఇండస్ట్రీ పెద్ద‌లు, సెల‌బ్రిటీలు ట్విట్ట‌ర్ ద్వారా విషెస్ తెలిపారు. చ‌ర‌ణ్ బ‌ర్త్ డే సంద‌ర్భంగా మెగాస్టార్ చిరంజీవి.. చిన్న‌ప్ప‌టి రామ్ చరణ్ ను ముద్దు చేస్తోన్న లాంగ్ బ్యాక్ […]

అదే మీరు నాకిచ్చే  బ‌ర్త్ డే గిప్ట్..చ‌ర‌ణ్ ఎమోష‌న‌ల్ పోస్ట్..

Updated on: Mar 27, 2020 | 5:19 PM

తన బ‌ర్త్ డే సంద‌ర్బంగా అభిమానులు బయటకు వెళ్లకుండా ఇంట్లోనే ఉండి కరోనా త‌రిమికొట్టేందుకు పోరాడాలని పిలుపునిచ్చాడు మెగా హీరో రామ్ చరణ్. అదే ఫ్యాన్స్ త‌న‌కు ఇచ్చే అతిపెద్ద గిప్ట్ అంటూ ట్వీట్ చేశాడు. 35 ప‌డిలోకి అడుగుపెట్టిన మెగా ప‌వర్ స్టార్ కు ప‌లువురు ఇండస్ట్రీ పెద్ద‌లు, సెల‌బ్రిటీలు ట్విట్ట‌ర్ ద్వారా విషెస్ తెలిపారు.

చ‌ర‌ణ్ బ‌ర్త్ డే సంద‌ర్భంగా మెగాస్టార్ చిరంజీవి.. చిన్న‌ప్ప‌టి రామ్ చరణ్ ను ముద్దు చేస్తోన్న లాంగ్ బ్యాక్ ఫోటోను సోష‌ల్ మీడియాలో పోస్ట్ చేశారు. ప్రజంట్ రామ్ చరణ్.. రాజమౌళి డైరెక్ష‌న్ లో ‘ఆర్ఆర్ఆర్’ మూవీ చేస్తున్న విష‌యం తెలిసిందే. బ‌ర్త్ డే సంద‌ర్భంగా చ‌ర‌ణ్ కు అదిరిపోయే గిఫ్ట్ ను ఇచ్చాడు ఎన్టీఆర్. ‘భీమ్ ఫర్ రామరాజు’ పేరుతో రిలీజైన వీడియో ఇప్పుడు ఇంట‌ర్నెట్ లో ప్ర‌కంప‌న‌లు క్రియేట్ చేస్తోంది. చెర్రీ లుక్ అదిరిపోగా.. కీరవాణి సంగీతం వీడియోకు మ‌రింత ఫైర్ యాడ్ చేసింది.