Ram Charan: శంకర్ సినిమా కోసం చమటోడుస్తున్న రామ్ చరణ్.. ఎర్రటి ఎండను సైతం లెక్కచేయకుండా..

చరణ్.. డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో భారీ ప్రాజెక్ట్ చేస్తున్నారు. పొలిటికల్ నేపథ్యంలో రాబోతున్న ఈ మూవీలో చరణ్ ద్విపాత్రాభినయం చేస్తున్నాడని..

Ram Charan: శంకర్ సినిమా కోసం చమటోడుస్తున్న రామ్ చరణ్.. ఎర్రటి ఎండను సైతం లెక్కచేయకుండా..
Ram Charan

Updated on: Nov 17, 2022 | 1:03 PM

డైరెక్టర్ రాజమౌళి తెరకెక్కించిన ట్రిపుల్ ఆర్ చిత్రంతో పాన్ ఇండియా స్టార్‏గా క్రేజ్ సంపాదించుకున్నాడు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్. ఈ మూవీ తర్వాత చరణ్.. డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో భారీ ప్రాజెక్ట్ చేస్తున్నారు. పొలిటికల్ నేపథ్యంలో రాబోతున్న ఈ మూవీలో చరణ్ ద్విపాత్రాభినయం చేస్తున్నాడని.. అందులో ఒకటి ముఖ్యమంత్రి పాత్ర అని ఫిల్మ్ సర్కిల్లో రూమర్స్ చక్కర్లు కొడుతున్నాయి. దీంతో ఈ సినిమాపై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇక గతంలో ఈ మూవీ నుంచి లీక్ అయిన ఫోటోస్ మూవీపై మరింత క్యూరియాసిటిని పెంచేశాయి. అయితే కొద్ది రోజులుగా శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ మూవీకి కాస్త బ్రేక్ ఇచ్చారు శంకర్.. ప్రస్తుతం ఆయన ఇండియన్ 2 సినిమా తెరకెక్కించే పనిలో పడ్డారు. ఇక మరోవైపు చరణ్ కూడా జపాన్ ఆర్ఆర్ఆర్ ప్రమోషన్స్.. ఆఫ్రికన్ వేకెషన్ అంటూ తన ఖాళీ సమయాన్ని గడిపేస్తున్నారు. తాజాగా తన ఇన్ స్టా వేదికగా ఆర్సీ15 ప్రాజెక్ట్ అప్డేట్ ఇచ్చాడు చరణ్.

త్వరలోనే ఈ సినిమా తదుపరి షెడ్యూల్ స్టార్ట్ కాబోతుందట. అందుకోసం చరణ్ సిద్ధమవుతున్నాయి. చెర్రీ తన రెగ్యులర్ జిమ్ విడిచిపెట్టి… సిటికి దూరంగా ప్రశాంతమైన ప్రదేశంలో వర్కవుట్స్ చేస్తున్నారు. అంతేకాదు.. ఆ జిమ్ వస్తువులు కూడా రెగ్యులర్ వి కాకుండా సిమెంట్‏తో రెడి చేసినవిగా కనిపిస్తున్నాయి. ఓవైపు ఎర్రటి ఎండను సైతం లెక్కచేయకుండా మట్టిలో వర్కవుట్స్ చేస్తున్నాడు చరణ్. నా రాబోయే షెడ్యూల్ కోసం అంతా సిద్ధంగా ఉంది అంటూ క్యాప్షన్ ఇచ్చాడు చెర్రీ. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరలవుతుంది.

ఇవి కూడా చదవండి

భారీ బడ్జెట్‏తో పాన్ ఇండియా లెవల్లో నిర్మిస్తున్న ఈ మూవీలో చరణ్ సరసన బాలీవుడ్ బ్యూటీ కియారా అద్వానీ నటిస్తుండగా.. కీలకపాత్రలలో సునీల్, శ్రీకాంత్, హీరోయిన్ అంజలి నటిస్తున్నారు.

మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Loading...
Unable to load recommendations.
Follow Us