
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటించిన లేటెస్ట్ సినిమా ‘పెద్ది’. ఉప్పెన ఫేమ్ బుచ్చిబాబు సనా తెరకెక్కించిన ఈ విలేజ్ స్పోర్ట్స్ డ్రామాలో బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ హీరోయిన్ గా చేసింది. అభిమానుల భారీ అంచనాల మధ్య జూన్ 04న ప్రపంచ వ్యాప్తంగా విడుదలైన పెద్ది సినిమా సూపర్ హిట్ టాక్ తెచ్చుకుంది. రామ్ చరణ్ యాక్టింగ్, బుచ్చిబాబు టేకింగ్ కు ఆడియెన్స్ ఫిదా అయిపోతున్నారు. అలాగే ఏఆర్ రెహమాన్ పాటలు, బీజీఎం సినిమాకు స్పెషల్ అట్రాక్షన్ గా నిలిచాయి. టాక్ కు తగ్గట్టుగానే తొలి రోజే భారీ వసూళ్లు సాధించింది పెద్ది సినిమా. ఏకంగా 135 కోట్లకు పైగా కలెక్షన్లు సాధించి మరో సారి మెగా పవర్ స్టార్ స్టామినాను ప్రూవ్ చేసింది. ఇక తాజాగా పెద్ది సినిమా రెండు రోజుల కలెక్షన్లను అధికారికంగా ప్రకటించారు మేకర్స్. ప్రపంచ వ్యాప్తంగా ఇప్పటివరకు మొత్తం రూ.181.8 కోట్ల గ్రాస్ వసూళ్లు వచ్చినట్లు సోషల్ మీడియా ద్వారా వెల్లడించారు. ఈ మేరకు బాక్సాఫీస్ ఛాంపియన్ పెద్ది థియేటర్లను జయిస్తోందంటూ ఒక పోస్టర్ ను కూడా రిలీజ్ చేశారు. కేవలం తెలుగులోనే కాదు ఇతర దక్షిణాది భాషల్లోనూ, హిందీలోనూ పెద్ది సినిమాకు మంచి కలెక్షన్లు వస్తున్నాయి.
ఇక ఓవర్సీస్ లోనూ రామ్ చరణ్ సినిమాకు రికార్డు కలెక్షన్లు వస్తున్నాయి. నార్త్ అమెరికాలో పెద్ది సినిమాకు 2.2 మిలియన్ డాలర్లు వచ్చినట్లు తెలుస్తోంది. మైత్రి మూవీ మేకర్స్, సుకుమార్ రైటింగ్స్ సమర్పణలో వృద్ది సినిమాస్ బ్యానర్‌పై వెంకట సతీష్ కిలారు, ఇషాన్ సక్సేనా పెద్ది సినిమాను నిర్మించారు. కన్నడ సూపర్ స్టార్ శివరాజ్ కుమార్, జగపతిబాబు, దివ్యేందు త్రిపాఠి, రావు రమేష్, సత్య, చమ్మక్ చంద్ర తదితరులు ఈ సినిమాలో ప్రధాన పాత్రలు పోషించారు. ఆస్కార్ విజేత ఏఆర్ రెహమాన్ ఈ సినిమాకు స్వరాలందించారు.
#Peddi collects 181.8 CR+ GROSS WW in 2 Days💥💥
BOX OFFICE CHAMPION #PEDDI is conquering the cinemas ❤🔥
Book your tickets now 💥https://t.co/hBzGpimDwP
Mega Power Star @AlwaysRamCharan @NimmaShivanna #JanhviKapoor @BuchiBabuSana @arrahman @RathnaveluDop @artkolla… pic.twitter.com/CRTON3fyU9
— Vriddhi Cinemas (@vriddhicinemas) June 6, 2026
Team #PEDDI blockbuster celebrations from the Pressmeet ❤️#PEDDI Now in cinemas 💥https://t.co/hBzGpimDwP
Mega Power Star @AlwaysRamCharan @NimmaShivanna #JanhviKapoor @BuchiBabuSana @arrahman @RathnaveluDop @artkolla @NavinNooli @bomanirani @IamJagguBhai @divyenndu… pic.twitter.com/nBoxkZxmCa
— Vriddhi Cinemas (@vriddhicinemas) June 5, 2026
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి