
మెగా పవర్‌స్టార్ రామ్ చరణ్ కథానాయకుడిగా, డైరెక్టర్ దర్శకుడు బుచ్చిబాబు సన కాంబినేషన్‌లో తెరకెక్కిన మోస్ట్ అవేటెడ్ స్పోర్ట్స్ యాక్షన్ డ్రామా ‘పెద్ది’. ఈ చిత్రం థియేటర్లలో విడుదలై బాక్సాఫీస్ వద్ద కనకవర్షం కురిపిస్తోంది. జూన్ 4న భారీ అంచనాల మధ్య విడుదలైన ఈ సినిమాకు మంచి రెస్పాన్స్ వస్తుంది. ముఖ్యంగా మొదటి రోజు నుంచి ఇప్పటివరకు చిత్రం కలెక్షన్స్ సునామీ సృష్టిస్తుంది. ఈ చిత్ర వసూళ్లను మేకర్స్ ఎప్పటికప్పుడు పోస్టర్స్ ద్వారా సోషల్ మీడియాలో తెలియజేస్తున్నారు. తాజాగా మూడు రోజుల కలెక్షన్స్ అనౌన్స్ చేశారు. చిత్ర యూనిట్ అధికారికంగా విడుదల చేసిన సరికొత్త పోస్టర్ ప్రదర్శిస్తున్నట్లుగా, ఈ సినిమా కేవలం మూడు రోజుల్లోనే ప్రపంచవ్యాప్తంగా 236.7 కోట్ల రూపాయల గ్రాస్ వసూళ్లను సాధించి సరికొత్త రికార్డులను సృష్టిస్తోంది.
ఎక్కువ మంది చదివినవి : Meenakshi Chaudhary : ఆ హీరో నా ఫస్ట్ క్రష్.. ఎప్పటికైన అతడితో డేట్‌కు వెళ్తాను.. హీరోయిన్ మీనాక్షి చౌదరి..
ఈ సినిమా మొదటి రోజు ప్రపంచవ్యాప్తంగా రూ.136.36 కోట్ల భారీ గ్రాస్ అందుకుంది. అలాగే రెండవ రోజు ముగిసేసరికి ఈ మూవీ రూ.181.8 కోట్లు రాబట్టింది. ఇక తాజాగా మూడో రోజు ముగిసేసరికి ఈ చిత్రం ఏకంగా రూ.236.7 కోట్ల గ్రాస్ వసూళ్లు సాధించినట్లు మేకర్స్ వెల్లడించారు. అటు బుక్ మై షో, డిస్ట్రిక్ట్ యాప్స్ లో అన్ని కలిపి ఈ సినిమా ఇప్పటివరకు ఏకంగా 4 మిలియన్లకు పైగా టికెట్లు అమ్ముడైనట్లు చిత్రయూనిట్ వెల్లడించింది. అడ్వాన్స్ బుకింగ్స్ లోనూ ఈ స్థాయి రికార్డులు నమోదు చేయడం విశేషం.
ఎక్కువ మంది చదివినవి : Brahmanandam : చివరి రోజుల్లో ఎంఎస్ నారాయణ కోరిన ఆఖరి కోరిక అదే.. హాస్పిటల్ బెడ్ మీద అలా చూశాక.. బ్రహ్మానందం ఎమోషనల్..
ఈ విజయంతో రామ్ చరణ్ మరోసారి తన బాక్సాఫీస్ స్టామినాను నిరూపించుకుని ‘బాక్సాఫీస్ ఛాంపియన్’ గా నిలిచారు. తాజా విడుదలైన ఈ పోస్టర్‌లో రామ్ చరణ్ కండలు తిరిగిన దేహంతో, తీవ్రమైన హావభావాలతో సైకిల్ తొక్కుతూ కనిపిస్తున్న లూక్ అభిమానులను విశేషంగా ఆకట్టుకుంటోంది. ఈ పోస్టర్ సినిమాలోని ఆయన పాత్ర తీవ్రతను, గ్రామీణ నేపథ్యాన్ని స్పష్టంగా ప్రతిబింబిస్తోంది.1980ల నాటి ఆంధ్రప్రదేశ్ గ్రామీణ నేపథ్యంలో, ఒక సామాన్య యువకుడు తన సమాజం కోసం, ఆత్మగౌరవం కోసం కుస్తీ (రెజ్లింగ్), క్రీడల ద్వారా ఎలా పోరాడాడు అనే ఆసక్తికరమైన కథాంశంతో ఈ చిత్రం రూపొందింది.
ఎక్కువ మంది చదివినవి : Tanikella Bharani: ఆ హీరో అద్భుతమైన వ్యక్తి.. వయసులో చిన్నోడైనా చేతులెత్తి నమస్కరిస్తున్నా..
BOX OFFICE CHAMPION #PEDDI IS UNSTOPPABLE 🔥🔥#Peddi collects a gross of 236.7 CRORES GROSS WORLDWIDE in 3 days ❤🔥
Book your tickets now!
🎟️ https://t.co/hBzGpimDwP#PEDDI in cinemas NOW 💥Mega Power Star @AlwaysRamCharan @NimmaShivanna #JanhviKapoor @BuchiBabuSana… pic.twitter.com/uPOhFx4Ryq
— Vriddhi Cinemas (@vriddhicinemas) June 7, 2026
ఎక్కువ మంది చదివినవి : Peddi Movie : ఏం తీశాడు భయ్యా.. చరణ్ ఎంట్రీ మైండ్ బ్లోయింగ్.. ఆ ఒక్క సీన్ గూస్ బంప్స్..