
మోస్ట్ ఎక్సయిటెడ్ సినిమా ఆర్ఆర్ఆర్. ఈ మూవీ కోసం ప్రపంచవ్యాప్తంగా అభిమానులు ఎదురుచూస్తున్నారు. డైరెక్టర్ రాజమౌళి అత్యంత ప్రతిష్టాత్మకంగా రూపొందిస్తున్న ఈ మూవీపై అంచనాలు భారీగానే ఉన్నాయి. రామ్ చరణ్, ఎన్టీఆర్ ప్రధాన పాత్రలలో నటిస్తుండగా.. అలియా భట్, ఒలివియా మోరీస్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. పాన్ ఇండియా లెవల్లో భారీ బడ్జెట్‌తో తెరకెక్కిస్తున్న ఈ సినిమాను జనవరి 7న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ క్రమంలో అన్ని భాషల ప్రేక్షకులను ఆకట్టుకునేందుక్క జక్కన్న అండ్ టీం వరుస ప్రమోషన్స్ చేస్తూ బిజీగా ఉన్నారు. సౌత్ టూ నార్త్ ప్రేక్షకులకు ఆర్ఆర్ఆర్ సినిమాపై రోజు రోజూకీ క్యూరియాసిటీని పెంచేస్తున్నారు. వరుస ఇంటర్వ్యూలు, ప్రీ రిలీజ్ ఈవెంట్స్‌తో ఫుల్ బిజీగా ఉంది చిత్రయూనిట్.
వరుస ప్రమోషన్స్‌తో బిజీగా గడిపస్తున్న జక్కన్న అండ్ టీ న్యూ ఇయర్ వేడుకలను భారీగా జరుపుకునేందుకు సిద్ధమైంది. ఇందుకోసం ముంబైలో న్యూయర్ వేడుకలను జరపుకోనున్నారు. ఇందుకోసం నిర్వహించిన ఈవెంట్లో రామ్ చరణ్, ఎన్టీఆర్, రాజమౌళి, అలియా భట్, సల్మాన్ హజరయ్యారు. ఈ న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ ఈవెంట్ జీటీవీలో ప్రసారం కానుంది. దీనికి సంబంధించిన ప్రోమో సోషల్ మీడియాలో సందడి చేస్తోంది. ఇదిలా ఉంటే.. ఇటీవల ది కపిల్ శర్మ షోలో పాల్గొన్న రాజమౌళి ఆర్ఆర్ఆర్ టైటిల్ వెనుక ఉన్న అసలు విషయాన్ని బయటపెట్టారు. ఈ సినిమా ప్రారంభించినప్పుడు ఏ టైటిల్ పెట్టాలో అర్థం కాలేదు. దీంతో ఎన్టీఆర్, రామ్ చరణ్, రాజమౌళి ఇలా ముగ్గురి పేర్లు కలిసేలా (ఆర్ఆర్ఆర్) అనుకున్నాం. సోషల్ మీడియాలో కూడా ఆ పేరుతోనే అప్డేట్స్ ఇచ్చాం. అన్ని భాషల నుంచి ఆర్ఆర్ఆర్కు మంచి స్పందన రావడంతో అదే పేరును కన్ఫార్మ్ చేశాం. నిజానికి ఆర్ఆర్ఆర్ అంటే రౌద్రం, రణం, రుధిరం అని చెప్పుకొచ్చారు జక్కన్న.
Also Read:Vishwak Sen: కరోనా భారిన పడ్డ పాగల్ హీరో.. క్యారంటైన్లో ఉన్నానంటూ ట్వీట్ చేసిన విశ్వక్ సేన్..
Samantha: అలాంటి పాత్రలు చేసి అలసిపోయాను.. వాళ్లే ఆ ఆలోచన మార్చారు.. సమంత ఆసక్తికర వ్యాఖ్యలు..
Ilayaraja: వీడియోతో రూమర్స్‌కు చెక్ పెట్టిన ఇళయరాజా.. పాటతో న్యూఇయర్ జోష్ నింపిన మ్యాజిక్ మేస్ట్రో..
RRR : ఆర్ఆర్ఆర్ టైటిల్ పెట్టడానికి కారణం అదే.. అసలు విషయం చెప్పేసిన జక్కన్న..