RRR Press Conference Highlights: రికార్డ్స్ సృష్టిస్తోన్న ఆర్ఆర్ఆర్ ట్రైలర్.. హైదరాబాద్‏లో ప్రెస్‏మీట్ లైవ్..

|

Dec 11, 2021 | 11:55 AM

RRR Team Meet : ఆర్ఆర్ఆర్ ట్రైలర్ విడుదలన కొద్ది గంటల్లో రికార్డ్స్ సృష్టిస్తోంది. రామ్ చరణ్, ఎన్టీఆర్ ప్రధాన పాత్రలలో నటిస్తోన్న ఈ సినిమా పై

RRR Press Conference Highlights: రికార్డ్స్ సృష్టిస్తోన్న ఆర్ఆర్ఆర్ ట్రైలర్.. హైదరాబాద్‏లో ప్రెస్‏మీట్ లైవ్..

ఆర్ఆర్ఆర్ ట్రైలర్ విడుదలన కొద్ది గంటల్లో రికార్డ్స్ సృష్టిస్తోంది. రామ్ చరణ్, ఎన్టీఆర్ ప్రధాన పాత్రలలో నటిస్తోన్న ఈ సినిమా పై ముందు నుంచి అంచనాలు భారీగానే ఉన్నాయి. ధర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కిస్తోన్న ఆర్ఆర్ఆర్ సినిమా కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు ప్రేక్షకులు. ఇప్పటికే ఈ మూవీ నుంచి వచ్చిన పాటలు.. పోస్టర్స్ సైతం నెట్టింట్లో తెగ ట్రెండ్ అవుతున్నాయి. ఇక ఇప్పుడు ఎక్కడ చూసిన ఆర్ఆర్ఆర్ ట్రైలర్ మేనియా కనిపిస్తోంది. విడుదలైన గంటల్లోనే అన్ని భాషల్లో కలిపి 60 మిలియన్స్ వ్యూస్ సాధించింది. ఇక వీటితో పాటు తమిళ్ , కన్నడ, మలయాళ ట్రైలర్లు కూడా మిలియన్ల కొద్ది వ్యూవర్స్‌ను అట్రాక్ట్ చేస్తున్నాయి.  ట్రైలర్‏లో రామ్ చరణ్, ఎన్టీఆర్ నటన.. ఒళ్లు గగుర్బోడిచే సీన్స్, రోమాలు నిక్కబొడిచే సన్నివేశాలు.. ప్రతి భారతీయుడి ప్రేరణ నింపేలా సాగే డైలాగ్స్ ఆధ్యంతం ఆసక్తిని కలిగిస్తున్నాయి. కేవలం సాధారణం అభిమానులు మాత్రమే కాకుండా.. సినీ ప్రముఖులు సైతం ఆర్ఆర్ఆర్ ట్రైలర్ పై ప్రశంసలు కురిపిస్తున్నారు.

ఇప్పటికే షూటింగ్ పూర్తిచేసుకున్న ఈ సినిమాను జనవరి 7న ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నారు. ఈ క్రమంలో మూవీ ప్రమోషన్స్ వేగవంతం చేశారు చిత్రయూనిట్. ఇక నిన్న బెంగుళూరులో ప్రెస్ మీటి నిర్వహించిన చిత్రయూనిట్ ఈరోజు హైదరాబాద్‏లో ప్రెస్ మీట్ నిర్వహించనుంది. ఈ కార్యక్రమాన్ని టీవీ9 తెలుగులో ప్రతేక్షంగా చూడవచ్చు.

ఆర్ఆర్ఆర్ ప్రెస్ మీట్ లైవ్..

LIVE NEWS & UPDATES

The liveblog has ended.
  • 11 Dec 2021 11:41 AM (IST)

    ఆర్ఆర్ఆర్ ప్రెస్‏మీట్..

    వీరిద్దరితో చాలా ఇబ్బంది పడ్డానని… సినిమా షూటింగ్‌ దాదాపు 300 రోజులు జరిగింది. అయితే, వీరి‌ద్ద‌రి మూలంగా అందులో దాదాపు 25 రోజులు వృథా అయిపోయాయి. ఇద్దరికీ 30 ఏళ్లకు పైగా వ‌య‌సు వ‌చ్చింది. ఇద్దరికీ పెళ్లిళ్లు జ‌రిగాయి. చాలా ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. అన్నా మీ కోసం చ‌చ్చిపోతాం అనే ఫ్యాన్స్ కూడా వున్నారు. సెట్లో మాత్రం ఇద్దరూ గొడ‌వ పడేవారని ఎన్టీఆర్ నా ద‌గ్గర‌కు వచ్చి జ‌క్కన్నా, చ‌ర‌ణ్ న‌న్ను గిల్లాడు అనగానే చరణ్ నేనా.. ఎప్పుడు గిల్లాను? అనేవాడు. నేను స్క్రిప్ట్ లోని లైన్లు చ‌దువుకుంటున్నాన‌ని చెప్పేవాడు. ఇలా సెట్లో సరదాగా గొడ‌వ పడేవారు అని చెప్పుకొచ్చారు రాజమౌళి.

  • 11 Dec 2021 11:35 AM (IST)

    ఆర్ఆర్ఆర్ ప్రెస్‏మీట్..

    తన తదుపరి చిత్రం మహేష్ బాబుతో ఉంటుందని.. ఇప్పటికే ఈ విషయాన్ని చెప్పానని తెలిపారు రాజమౌళి. ఇప్పుడు ఆ సినిమా గురించి ఆలోచించే పరిస్థితి లేదని.. ఆర్ఆర్ఆర్ సినిమా విడుదలైన తర్వాత మహేష్ సినిమా గురించి ఆలోచిస్తానని చెప్పారు రాజమౌళి.

  • 11 Dec 2021 11:19 AM (IST)

    ఆర్ఆర్ఆర్ ప్రెస్‏మీట్..

    ప్రెస్ మీట్ వేదికగా ఏపీ ప్రభుత్వానికి ఓ విన్నపం చేసింది ట్రిపుల్ ఆర్‌ టీం. ఏపీలో టికెట్ల రేట్లు ఏమాత్రం వర్కవుట్ కాదంటూ.. ఆ వేదిక మీదుగా తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేసింది.

  • 11 Dec 2021 11:14 AM (IST)

    ఆర్ఆర్ఆర్ ప్రెస్‏మీట్..

    ఉదయం వచ్చిన దగ్గర్నుంచి.. రాజమౌళి టార్చర్ ఎక్కువగా ఉంటుందని శారీరంలో ఎలాంటి మార్పులు వచ్చాయని గమనిస్తారని.. .. చాలాసార్లు విసుగు వచ్చేదని.. కానీ ఆర్ఆర్ఆర్ కమిట్‏మెంట్ అంటూ తారక్ చెప్పారు.

  • 11 Dec 2021 11:09 AM (IST)

    ఆర్ఆర్ఆర్ ప్రెస్‏మీట్..

    ఆర్ఆర్ఆర్ సినిమా మొత్తం స్నేహం మీద మాత్రమే ఆధారపడి ఉంటుందని.. దేశభక్తి సినిమా కాదని రాజమౌళి అన్నారు. సందర్భం.. క్యారెక్టర్స్ వలన కాస్త దేశభక్తి ఉంటుందని.. సన్నివేశాలు ఉండవని తెలిపారు.

  • 11 Dec 2021 11:04 AM (IST)

    ఆర్ఆర్ఆర్ ప్రెస్‏మీట్..

    చరిత్రకు సంబంధించిన సంఘటనలు.. విషయాలు ఏవి ఆర్ఆర్ఆర్ సినిమాలో లేవని… వాళ్లిద్దరు ఒకేసారి కనిపించి స్నేహితులుగా మారి ఉంటే.. ఎలా ఉండేది అనే విధంగా ఈ సినిమాను తెరకెక్కించినట్లుగా చెప్పారు రాజమౌళి.. పునర్జన్మల గురించి ఏం లేదని తెలిపారు.

  • 11 Dec 2021 10:43 AM (IST)

    ఆర్ఆర్ఆర్ ప్రెస్‏మీట్..

    ఆర్ఆర్ఆర్ అనేది కమిట్‏మెంట్ అని.. మూడు సంవత్సరాలు.. మధ్యలో కరోనా వచ్చినా.. ఆలోచన కూడా ఆర్ఆర్ఆర్ మాత్రమే అని.. సినిమా మొత్తం కమిట్‏మెంట్ అని తెలిపారు ఎన్టీఆర్.

  • 11 Dec 2021 10:41 AM (IST)

    ఆర్ఆర్ఆర్ ప్రెస్‏మీట్..

    ఆర్ఆర్ఆర్ సినిమాలో ఏ సన్నివేశాలలో మీ ఇద్దరిలో ఉన్న మొత్తం పోటేన్షియల్ బయటకు తీశారని అనుకుంటున్నారని అడగ్గా.. ఎక్కువగా హోం వర్క్ రాజమౌళి చేశారని.. మానసికంగా.. శారీరకంగా బలంగా ఉండేందుకు ప్రయత్నించామని చెప్పారు చరణ్.

  • 11 Dec 2021 10:39 AM (IST)

    ఆర్ఆర్ఆర్ ప్రెస్‏మీట్..

    ఇద్దరు మాస్ ఫాలోయింగ్ ఉన్న హీరోలతో సినిమా చేసినప్పుడు ఇద్దరు ఫ్యాన్స్ వర్గాలను ఎలా ఫుల్ ఫిల్ చేయగలను అనే కాన్ఫిడెన్స్ వచ్చిందని ప్రశ్నించగా.. ఎంత పెద్ద స్టార్స్ అయిన.. జనాలను ఉత్సాహంగా థియేటర్ల వరకు రప్పించడమే అని.. థియేటర్లలో కథ మాత్రమే నడిపిస్తుందని.. యాక్టర్స్‏గా మాత్రమే చరణ్, తారక్ కావాలని.. జనాలు థియేటర్లకు రావడానికి మెగా పవర్ స్టార్, యంగ్ టైగర్ కావాలని ఇదే సిద్ధాంతాన్ని నమ్మినట్లు చెప్పారు రాజమౌళి.

  • 11 Dec 2021 10:34 AM (IST)

    ఆర్ఆర్ఆర్ ప్రెస్‏మీట్..

    కొమురం భీంగా నటించడానికి.. తెలంగాణ యాస నేర్చుకోవడానికి ఎలాంటి హార్డ్ వర్క్ చేశారని ప్రశ్నించగా.. స్వతహాగా తెలుగువారమని… తెలిసినవి కాకుండా.. తెలియని చెప్పడానికి రాజమౌళి సహయం చేశారని.. నిజాం ప్రభుత్వంతో పోరాడి మరణించాడనే తెలుసని.. కానీ గోండ్లలో పుట్టిన మనిషి ప్రవర్తన .. ఆలోచన ఎలా ఉంటుంది. అడవిలో ఉన్న మనిషి నడక ఎలా ఉంటుందనేది..మానసికంగా.. శారీరంగా ఎలా ఉండాలనేది విషయంలో రాజమౌళి సహాయం చేశారని తెలిపారు తారక్.

  • 11 Dec 2021 10:30 AM (IST)

    ఆర్ఆర్ఆర్ ప్రెస్‏మీట్..

    పులిని మీరు భయపెట్టారా ? మిమ్మల్ని రాజమౌళిగారు భయపెట్టారా ? అని ఎన్టీఆర్‏ను ప్రశ్నించగా.. కనిపించని టైగర్ రాజమౌళి అని.. గర్జిస్తూ ముందుకు వచ్చిన పరిచయం ఉన్న పులి అని.. అందుకే తను కూడా అరిచినట్లు చెప్పారు తారక్.

  • 11 Dec 2021 10:28 AM (IST)

    ఆర్ఆర్ఆర్ ప్రెస్‏మీట్..

    కరోనా వలన మీ మానసిక సంఘర్షణ ఎలా ఉంది అని రాజమౌళి ప్రశ్నించగా.. ప్రాణ నష్టం జరగడంతో భయం, బాధ కలిగింది.. వ్యక్తిగతంగా ఎంజాయ్ చేశాము.. మేము మాత్రమే ఆగిపోతే భయం ఉంటుండే.. కానీ ప్రపంచం మొత్తం ఆగిపోయినప్పుడు భయం వేయలేదు. మళ్లీ మొదలు పెడతామనే ఆశ ఉండేదని తెలిపారు రాజమౌళి..

  • 11 Dec 2021 10:26 AM (IST)

    ఆర్ఆర్ఆర్ ప్రెస్‏మీట్..

    ప్రతి జీవికి చిన్న ఆశ ఉంటుందని.. రేపు, మర్నాడు బాగుంటుందని.. మాకు అలాగే ఉందని త్వరగా కరోనా నుంచి భయటపడి ఆర్ఆర్ఆర్ సెట్ లోకి వెళ్లి.. ఆ జీవికన్నా (రాజమౌళి) ముందే మేము భాగమవ్వాలని అనుకున్నామని.. ఫైనల్లీ ఇలా వచ్చామన్నారు తారక్..

  • 11 Dec 2021 10:24 AM (IST)

    ఆర్ఆర్ఆర్ ప్రెస్‏మీట్..

    ఆర్ఆర్ఆర్ సినిమాను ఉత్సాహంగా ఫీల్ అయ్యామని.. కరోనా పాండమిక్ రావడంతో ప్రపంచం మొత్తం బాధకు గురయ్యిందని.. ఒక్క చిన్న పాయింట్ ఉత్సాహం కోల్పోకుండా చేసింది.. లాక్ డౌన్ అనంతరం సినిమాకు రెండింతల జోష్‏తో స్టార్ట్ చేశామని చెప్పారు చరణ్.

  • 11 Dec 2021 10:22 AM (IST)

    ఆర్ఆర్ఆర్ ప్రెస్‏మీట్..

    రాజమౌళి సినిమా కోసం రోజూ ఉదయాన్నే నిద్రలేచి షూటింగ్‏కు వెళ్లడం.. కష్టమైన సన్నివేశాలలో నటించడం.. ఇప్పటికీ అదే ఎనర్జీగా.. కరోనా పాండమిక్ సమయంలో ఇబ్బంది పడ్డారా అని ప్రశ్నించగా.. రాజమౌళి గారితో పనిచేయడం గ్రేట్ ఫుల్ అని..కరోనా నిబంధనలు పాటిస్తూ షూటింగ్ చేసినట్లుగా అలియా తెలిపింది.

  • 11 Dec 2021 10:19 AM (IST)

    ఆర్ఆర్ఆర్ ప్రెస్‏మీట్..

    తెలుగులో బాగున్నారా అంటూ ప్రశ్నించింది అలియా.. ఆర్ఆర్ఆర్ ట్రైలర్ పగిలిపోయిందని.. ముంబైలో మాకు పిచ్చేక్కింది అంటూ తెలుగులో కాసేపు ముచ్చటించింది అలియా భట్..

  • 11 Dec 2021 10:17 AM (IST)

    ఆర్ఆర్ఆర్ ప్రెస్‏మీట్..

    ఐదు భాషలలో మాత్రమే విడుదల అవుతుందని.. మిగతా భాషలలో డబ్ అవుతుందని చెప్పారు రాజమౌళి.. కేవలం తెలుగు, హిందీ, తమిళ్, కన్నడ భాషలలో మాత్రమే చరణ్, తారక్ డబ్బింగ్ చెప్పారని తెలిపారు.

  • 11 Dec 2021 10:15 AM (IST)

    ఆర్ఆర్ఆర్ ప్రెస్‏మీట్..

    అనంతరం.. తెలుగు, హిందీ, కన్నడ, మలయాళం, తమిళ్ అన్ని భాషలలో డబ్బింగ్ చెప్పే సమయంలో ఇబ్బంది కలిగిందా అని ఎన్టీఆర్‏ను ప్రశ్నించగా.. మలయాళం ప్రయత్నించాం కానీ.. కూనీ చేస్తున్నామని డైరెక్టర్ అన్నారని.. అందుకే మలయాళం చెప్పలేదని అన్నారు తారక్.. ఏ భాష డబ్బింగ్ చెప్పడానికి ఇబ్బంది కాలేదని చెప్పుకొచ్చారు.

  • 11 Dec 2021 10:14 AM (IST)

    ఆర్ఆర్ఆర్ ప్రెస్‏మీట్..

    మొదటి రోజు ఎన్టీఆర్, రామ్ చరణ్ ఇద్దర్ని ఒకే ఫ్రేములో చూడగానే మీ ఫీలింగ్ ఏంటీ అని రాజమౌళిని ప్రశ్నించగా.. ఫస్ట్ షాట్ ఇద్దరూ బైక్ పై వచ్చే షాట్.. చూడగానే వీరిద్ధరి మధ్య స్నేహంగా ఉంటుందని అర్థమైందన్నారు రాజమౌళి.

  • 11 Dec 2021 10:11 AM (IST)

    ఆర్ఆర్ఆర్ ప్రెస్‏మీట్..

    విలేకర్ల రామ్ చరణ్, తారక్, అలియా భట్, రాజమౌళి, నిర్మాత డీవీవీ దానయ్య.. విలేకర్లు పాల్గొన్నారు. విలేకర్లు అడుగుతున్న ప్రశ్నలకు ఆర్ఆర్ఆర్ చిత్రయూనిట్ సమాధానాలు చెబుతుంది.

  • 11 Dec 2021 10:09 AM (IST)

    ఆర్ఆర్ఆర్ ప్రెస్ మీట్..

    ఆర్ఆర్ఆర్ ట్రైలర్ పై ప్రేక్షకుల నుంచి స్పందనకు కృతజ్ఞతలు తెలిపారు.

    ఆర్ఆర్ఆర్ ట్రైలర్ పై ప్రేక్షకుల నుంచి స్పందనకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా .. శనివారం ఉదయం ఆర్ఆర్ఆర్ చిత్రయూనిట్ విలేకర్ల సమావేశం నిర్వహిస్తుంది.

Follow us on