
పాన్ ఇండియా స్టార్ రామ్ చరణ్ హీరోగా నటించిన లేటేస్ట్ మోస్ట్ అవేటెడ్ మూవీ ‘పెద్ది’. ఉప్పెన ఫేమ్ డైరెక్టర్ బుచ్చిబాబు సన దర్శకత్వం వహించిన ఈ సినిమా థియేటర్లలో భారీ అంచనాల మధ్య జూన్ 4న ప్రపంచవ్యాప్తంగా విడుదలైంది. బుధవారం రాత్రే ప్రీమియర్ షోస్ పడగా.. గురువారం మార్నింగ్ షోల నుంచే థియేటర్ల వద్ద అభిమానుల కోలాహలం అంబరాన్ని తాకింది. సినిమా చూసిన ప్రతి ఒక్కరూ మెగా పవర్‌స్టార్ మాస్ జాతరను థియేటర్లలో ఎంజాయ్ చేస్తున్నారు. ముఖ్యంగా రామ్‌చరణ్ స్క్రీన్ ప్రెజెన్స్, బుచ్చిబాబు టేకింగ్ ఊహించిన దానికంటే వంద రెట్లు అద్భుతంగా ఉందంటూ సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు. అలాగే ఈ సినిమాలో రామ్‌చరణ్ ఇంట్రడక్షన్ సీన్ థియేటర్లను షేక్ చేస్తోంది. బుచ్చిబాబు డిజైన్ చేసిన చరణ్ ఎంట్రీ సీక్వెన్స్, దానికి తోడు ఏఆర్ రెహమాన్ ఇచ్చిన బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ (BGM) థియేటర్లలో ప్రేక్షకులకు పూనకాలు తెప్పిస్తున్నాయి. చరణ్ బాడీ లాంగ్వేజ్, ఆయన రగ్గడ్ లుక్ మాస్ ఆడియన్స్‌కు గూస్ బంప్స్ తెప్పిసత్తుంది. ఎంట్రీ సీన్ చూస్తున్నంత సేపు ఫ్యాన్స్ థియేటర్లలో పేపర్లు చించి గాల్లోకి విసురుతూ, విజిల్స్ వేస్తూ రచ్చ రచ్చ చేస్తున్నారు. ఒక పక్కా కమర్షియల్, ఎమోషనల్ ఎంటర్‌టైనర్‌కు ఎలాంటి ఎంట్రీ ఉండాలో బుచ్చిబాబు దాన్ని పర్ఫెక్ట్‌గా ప్రెజెంట్ చేశారు.
ఎక్కువమంది చదివినవి : Maheswari: ఆ హీరో అంటే క్రష్.. పిచ్చిగా ప్రేమించా.. చెల్లి అని మనసు ముక్కలు చేశాడు.. హీరోయిన్ మహేశ్వరి..
ఊర మాస్ రగ్గడ్ లుక్కులో చరణ్ ఎంట్రీ సీన్ అదిరిపోయిందని.. అలాగే చికిరి చికిరి సాంగ్ సైతం వేరేలెవల్ అంటూ పోస్టులు పెడుతున్నారు ఫ్యాన్స్. దర్శకుడు బుచ్చిబాబు సన ఈ కథను తెరకెక్కించిన విధానంపై ట్రేడ్ వర్గాలు, సినీ విశ్లేషకులు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. ఫస్ట్ హాఫ్ అంతా మైండ్ బ్లోయింగ్ ఎలిమెంట్స్‌తో, పీక్ ఎలివేషన్స్‌తో సాగిపోతుందని.. బుచ్చిబాబు టేకింగ్ నెక్స్ట్ లెవెల్‌లో ఉందంటూ నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. కేవలం కమర్షియల్ ఎలిమెంట్స్ మాత్రమే కాకుండా, కథలోని ఎమోషన్‌ను కూడా ఎక్కడా మిస్ కాకుండా ప్రతీ ఫ్రేమ్‌ను చాలా రిచ్‌గా మలిచారు.
Maa Bangaram cult ECF Varun Tej😘♥️#PEDDI pic.twitter.com/s6PR2cBBmt
— Uppalapati Ramvarma (@Ramvarma2025) June 3, 2026
ఎక్కువమంది చదివినవి : ఏం సినిమా రా బాబూ.. ఒక్కో సీన్ ఊపిరి బిగపట్టి చూడాల్సిందే.. ఓటీటీలో రచ్చ చేస్తున్న మలయాళీ
మరోవైపు ఇప్పటికే డైరెక్టర్ రాజమౌళి, డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా, రవితేజ కూతురు, కుమారుడు పెద్ది సినిమా థియేటర్లో సందడి చేశారు. మరోవైపు రామ్ చరణ్ భార్య ఉపాసన కొణిదెల తన తండ్రితో కలిసి పెద్ది సినిమాను వీక్షించారు. చరణ్ ఎంట్రీ సీన్ చూసి ఫుల్ జోష్ లో కేకలు , విజిల్స్ వేస్తూ తెగ ఎంజాయ్ చేశారు ఉపాసన. ఇందుకు సంబంధించిన వీడియోస్ నెట్టింట తెగ వైరలవుతున్నాయి.
ఎక్కువమంది చదివినవి : Raghavendra Rao : అది గొప్ప పాట.. జీవితాంతం గుర్తుంచుకోవాల్సిన సాంగ్.. రాఘవేంద్ర రావు మనసులో నిలిచిపోయిన పాట ఇదే..
. @imvangasandeep post watching #PEDDI in @amb_cinemas 🔥 pic.twitter.com/1uLVNROhDT
— ᴡᴀɴᴅᴀ❤️🔥ᴾᴱᴰᴰᴵ'ˢ ᴳᴵᴿᴸ🏏 (@CherryGalll_) June 4, 2026
Allu Family 😍 watching #peddi movie in hyd….allusnehareddy #alluayaan @alluarjun pic.twitter.com/A9ddpCh6IN
— 🧚 NIMMI ~RC PEDDI'S GIRL🏏 💫✨🐦 (@AlwaysNirmala_) June 4, 2026
Rajamouli at AMB cinemas for #PEDDI premiere 🥳😚 pic.twitter.com/vJwfZysysk
— 𝐏𝐫𝐢𝐲𝐚𝐡 ᴘᴇᴅᴅɪ'ꜱ ɢɪʀʟ 🏏 🐼 (@PriyaRC_4) June 3, 2026
ఎక్కువమంది చదివినవి : Reema Sen : ఇండస్ట్రీలో అతడే నాకు బెస్ట్ ఫ్రెండ్.. ప్రతి విషయంతో తనతోనే షేర్ చేసుకుంటాను.. రీమా సేన్..