
నిన్న (నవంబర్ 05) విడుదలైన బాలీవుడ్ ‘రామాయణ’ సినిమాకు బ్లాక్ బస్టర్ టాక్ వస్తోంది. నితేశ్ తివారీ టేకింగ్, రణ్ బీర్, సాయి పల్లవి, యశ్ ల యాక్టింగ్, అలాగే హాలీవుడ్ ని మించి పోయిన విజువల్ ఎఫెక్ట్స్.. వెరసి ఆధునిక రామాయణం ప్రేక్షకులకు పిచ్చి పిచ్చిగా నచ్చేస్తోది. నమిత్ మల్హోత్రాకు చెందిన ‘ప్రైమ్ ఫోకస్ స్టూడియోస్’, యష్‌కు చెందిన ‘మాన్స్టర్ మైండ్ క్రియేషన్స్’, ‘డీఎన్ఈజీ’ సంస్థలు భారీ బడ్జెట్ తో అత్యంత ప్రతిష్ఠాత్మకంగా ఈ సినిమాను నిర్మించాయి. రణ్ బీర్, సాయి పల్లవి, యశ్ ల తో పాటు సన్నీ డియోల్, శోభన, కాజల్ అగర్వాల్, రకుల్ ప్రీత్ సింగ్, హరీశ్ ఉత్తమన్, ఫైసల్ మాలిక్, వివేక్ ఒబెరాయ్, కునాల్ కపూర్, ముకేశ్ తివారి, అనుపమ్ ఖేర్, సౌరబ్ సచ్దేవ్, రవి దూబే, ఆదినాథ్ కొఠారే, నితీశ్ శర్మ.. ఇలా ఎంతో మంది స్టార్స్ ఈ సినిమాలో నటించారు. ముఖ్యంగా టాలీవుడ్ హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ చేసిన శూర్పణఖ పాత్ర కూడా ఈ సినిమాకు బాగా హైలెట్ గా నిలిచింది. అయితే ఈ పాత్ర పర్ఫెక్ట్ గా రావడానికి చాలా కష్టపడింది రకుల్. ఈ సినిమా ప్రమోషన్లలో భాగంగా మాట్లాడిన రకుల్ ‘రామాయణం’ చిత్రంలో పనిచేసిన తన అనుభవం గురించి మాట్లాడింది. అలాగే ఈ సినిమా కోసం తానెంత కష్టపడ్డానో కూడా పేర్కొంది.
‘రామాయణంలో శూర్పణఖ పాత్రను పోషించిన నా అనుభవాన్ని పంచుకోవడానికి నేను చాలా కాలంగా ఎదురుచూస్తున్నాను. ఇది నాకు చాలా ప్రత్యేకమైన ప్రయాణం. తరతరాలుగా మన జీవితాల్లో, సంస్కృతిలో భాగమైన ఒక కథలో భాగమయ్యే అవకాశం ప్రతిరోజూ రాదు. రామాయణం ఇంతటి ఘన స్థాయిలో రూపుదిద్దుకోవడం చూడటం నిజంగా ఒక విభిన్నమైన అనుభవం. మన దేశానికి అపారమైన ప్రాముఖ్యత ఉన్న కథలో భాగం కావడం, అది ఇంతటి ఘన స్థాయిలో రూపుదిద్దుకోవడం చూడటం ఈ ప్రయాణాన్ని మరింత ప్రత్యేకంగా మార్చింది. గొప్ప కలలు కని, ఆ కలను నిజం చేసిన నితేశ్ తివారీ, నమిత్ మల్హోత్రా సర్లకు ధన్యవాదాలు. అలాగే, రణబీర్ కపూర్, సాయి పల్లవి, యష్, రవి దూబే, కాజల్ అగర్వాల్, శోభన మేడమ్, చిత్ర బృందం మొత్తానికి ధన్యవాదాలు. అద్భుతమైన సహనటులుగా ఉండి, ఈ మ్యాజిక్‌ను తెరపైకి తీసుకురావడానికి ఎంతో కష్టపడిన మీకు ధన్యవాదాలు. అలాగే నా లుక్‌ను రూపొందించిన నా టీమ్‌కి, కాస్ట్యూమ్ డిజైన్ టీమ్‌కి ప్రత్యేక ధన్యవాదాలు. మేము పొందుతున్న ప్రశంసలన్నీ వారి సృజనాత్మకత, కఠోర శ్రమ ఫలితమే. ప్రతిరోజూ 4 గంటల పాటు నా కోసం కష్టపడిన వీరందరూ ఈ చిత్రాన్ని ఎంతో అద్భుతంగా మలిచారు. ఇది కేవలం ఒక సినిమా కాదు. ఇది ఒక భారతీయురాలిగా నన్ను గర్వపడేలా చేసే క్షణం’ అని రకుల్ ప్రీత్ సింగ్ పేర్కొంది. ఈ సందర్భంగా తన మేకప్, షూటింగ్‌కు సంబంధించిన కొన్ని ఫోటోలు, వీడియోలను ఇన్‌స్టాగ్రామ్‌లో పంచుకుందీ రకుల్.
కాగా రకుల్ చెప్పినట్లుగా, షూటింగ్ సమయంలో ఆమె గంటల తరబడి మేకప్ వేసుకోవాల్సి వచ్చింది. బరువైన నగలు ధరించాల్సి వచ్చింది. ‘రామాయణం’ షూటింగ్ సమయంలో ఆమె మరికొన్ని సమస్యలను ఎదుర్కొంది, అయితే ఇప్పుడు ఆ చిత్రం విజయం సాధిస్తుండటంతో ఆమె సంతోషంగా ఉంది.
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి