Rakul Preeth Singh: పాపం.. రకుల్ కష్టాలు.. బార్బీ డాల్‏గా టాలీవుడ్ బ్యూటీ..

|

Jul 07, 2023 | 3:29 PM

గత కొద్ది కాలంగా తెలుగు సినీపరిశ్రమలో రకుల్ జోరు తగ్గిపోయింది. ఈ ముద్దుగుమ్మ నుంచి కొత్త సినిమా అనౌన్స్ వచ్చి చాలా కాలమవుతుంది. చివరగా చెక్ సినిమాలో కనిపించింది రకుల్. ఇక ఆ తర్వాత బాలీవుడ్ వెళ్లిపోయి అక్కడే ఒకటి రెండు చిత్రాలు చేస్తుంది. అయితే సోషల్ మీడియాలో మాత్రం ఫుల్ రచ్చ చేస్తుంటుంది. ఎప్పటికప్పుడు తన లేటేస్ట్ ఫోటోస్ షేర్ చేస్తుంటుంది.

Rakul Preeth Singh: పాపం.. రకుల్ కష్టాలు.. బార్బీ డాల్‏గా టాలీవుడ్ బ్యూటీ..
Rakul
Follow us on

టాలీవుడ్ ఇండస్ట్రీలో ఒకప్పుడు వరుస సినిమాలతో టాప్ హీరోయిన్‏గా ఓ వెలుగు వెలిగింది రకుల్. వెంకటాద్రి ఎక్స్ ప్రెస్ సినిమాతో కథానాయికగా పరిచయమైన ఈ అమ్మడు.. ఆ తర్వాత బ్యాక్ టూ బ్యాక్ చిత్రాల్లో నటిస్తూ అతి తక్కువ సమయంలోనే ఫుల్ ఫాలోయింగ్ సంపాదించుకుంది. అయితే గత కొద్ది కాలంగా తెలుగు సినీపరిశ్రమలో రకుల్ జోరు తగ్గిపోయింది. ఈ ముద్దుగుమ్మ నుంచి కొత్త సినిమా అనౌన్స్ వచ్చి చాలా కాలమవుతుంది. చివరగా చెక్ సినిమాలో కనిపించింది రకుల్. ఇక ఆ తర్వాత బాలీవుడ్ వెళ్లిపోయి అక్కడే ఒకటి రెండు చిత్రాలు చేస్తుంది. అయితే సోషల్ మీడియాలో మాత్రం ఫుల్ రచ్చ చేస్తుంటుంది. ఎప్పటికప్పుడు తన లేటేస్ట్ ఫోటోస్ షేర్ చేస్తుంటుంది.

తాజాగా పింక్ కలర్ లాంగ్ డ్రెస్ లో బార్బీ బొమ్మగా ముస్తాబయ్యింది రకుల్. ఇందుకు సంబంధించిన ఓ క్రేజీ వీడియో షేర్ చేస్తూ తన కష్టాలను చెప్పుకొచ్చింది. అందులో లాంగ్ డ్రెస్ లో మీడియా, జనాల ముందు కాస్త పద్దతిగా.. జాగ్రత్తగా నడిచిన రకుల్.. ఆ తర్వాత తన గదికి వెళ్లే సమయంలో మాత్రం ఆ డ్రెస్ తో ఇబ్బందిపడింది. తన గదికి వెళ్లేందుకు పరుగులు పెట్టింది. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరలవుతుండగా.. బ్యూటీఫుల్ లుక్ అంటూ కామెంట్స్ చేస్తున్నారు నెటిజన్స్.

ఇవి కూడా చదవండి

ఇక ఓవైపు బాలీవుడ్ ఇండస్ట్రీలో ఒకటి రెండు సినిమాల్లో నటిస్తున్న రకుల్..మరోవైపు ఓటీటీలోనూ పలు వెబ్ సిరీస్ చేస్తుంది. అయితే ఓటీటీలోనూ ఆమెకు వరుసగా నిరాశే ఎదురవుతుంది.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.