
కేవలం కారు కొనడానికే నేను నా మొదటి సినిమాలో నటించానని ఎంతో ఉత్సాహంగా అన్నారు హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్.. ఇటీవల ఓ మీడియా సమ్మిట్ లో పాల్గొన్న ఆమె తన సినీ కెరీర్, పర్సనల్ లైఫ్ గురించి పలు విషయాలు పంచుకున్నారు. “పెళ్లి తర్వాత నా జీవితంలో పెద్దగా మార్పులేమీ రాలేదు. నా భర్త జాకీ భన్నానీ, నేను చాలా సహజంగా మా కొత్త జీవితంలోకి అడుగుపెట్టాము. మేము ఒకరి వృత్తిపరమైన నిర్ణయాల్లో మరొకరం జోక్యం చేసుకోము.” అని అన్నారు. నటిగా, వ్యాపారవేత్తగా తన ప్రయాణం చాలా సంవత్సరాల క్రితమే ప్రారంభమైందని ఆమె అన్నారు.
ఎక్కువ మంది చదివినవి : రోజుకు 15000 అడుగులు నడుస్తా.. టిఫిన్లు అస్సలు చేయను.. 86 ఏళ్ల వయసులో ఇంత ఫిట్‌గా.. మురళీ మోహన్ డైట్ సీక్రెట్ ఇదే..
2015లో హైదరాబాద్‌లో F45 జిమ్‌తో తన మొదటి వ్యాపారాన్ని ప్రారంభించానని, ఆ తర్వాత వెల్‌బీయింగ్ న్యూట్రిషన్ వంటి కంపెనీలలో పెట్టుబడి పెట్టి, ఆరోగ్యకరమైన ధాన్యాలను అందించే రెస్టారెంట్‌ను కూడా ప్రారంభించానని రకుల్ ప్రీత్ సింగ్ తెలిపారు. అలాగే తన డైట్, ఆరోగ్యం గురించి మాట్లాడుతూ.. “సరైన జీవనశైలిని పాటిస్తే చాలా ఆరోగ్య సమస్యలను నియంత్రించుకోవచ్చు. నేటి ఒత్తిడి, జీవనశైలి మార్పుల కారణంగా ఆరోగ్య సమస్యలు పెరుగుతున్నాయి. తమ శరీరాన్ని జాగ్రత్తగా చూసుకోవడం ప్రతి ఒక్కరి బాధ్యత. సీడ్ డేస్ అని పిలిచే రోజుల్లో కూడా నేను ఎక్కువగా ఆరోగ్యకరమైన ఆహారాన్నే తింటాను,” అని రకుల్ ప్రీత్ సింగ్ అన్నారు.
ఎక్కువ మంది చదివినవి : Krishna Vamsi: అతడిని డైరెక్టర్ చేయాలని సినిమా స్టార్ట్ చేశా.. ఎంతో ఫోర్స్ చేశా.. కానీ ఇప్పుడు పెద్ద నటుడు అయ్యాడు.. కృష్ణ వంశీ..
“నేను నా మొదటి సినిమాను కన్నడలో చేశాను. ఆ సమయంలో నేను కాలేజీలో చదువుకుంటున్నాను. మొదట్లో, కారు కొనాలనే ఉద్దేశంతో సినిమాల్లో నటించడానికి ఒప్పుకున్నాను.” రకుల్ ప్రీత్ సింగ్ చెప్పుకొచ్చారు. “ఆ సినిమా తర్వాత, నటనే నా జీవితం అని నేను నిర్ణయించుకున్నాను” అని అన్నారు. తెలుగు, తమిళం, కన్నడ, హిందీ భాషలలో ఎన్నో సూపర్ హిట్ చిత్రాల్లో నటించారు.
ఎక్కువ మంది చదివినవి : Bigg Boss 10 Telugu : బిగ్ బాస్‌లో జబర్దస్త్ క్రేజీ బ్యూటీ.. ఆఫర్ రావడంపై స్పందించిన గ్లామరస్ క్వీన్.. ఏమన్నారంటే..
ఎక్కువ మంది చదివినవి : Aishwarya Rajesh: అతడంటే క్రష్ కాదు పిచ్చి ఇష్టం.. తన కోసం చాలా ట్రై చేశా.. కానీ అంతలోనే తిరిగిరాని లోకాలకు.. ఐశ్వర్య రాజేశ్..