Rakul Preeth Singh: నార్త్ సినిమా వర్సెస్ సౌత్ మూవీస్ డిబేట్‏లో షాకింగ్ కామెంట్స్ చేసిన రకుల్ ప్రీత్ సింగ్..

|

Nov 07, 2022 | 11:15 AM

సినిమా అనేది భావోద్వేగాల భాష. ఇది కేవలం సరిహద్దులు కాదు. నార్త్ వర్సెస్ సౌత్ అనేది ఇప్పుడు స్టార్ట్ అయ్యింది కానీ..శ్రీదేవి, టబు వంటి ప్రముఖ హీరోయిన్స్ దక్షిణాదిలోనూ నటించారు.

Rakul Preeth Singh: నార్త్ సినిమా వర్సెస్ సౌత్ మూవీస్ డిబేట్‏లో షాకింగ్ కామెంట్స్ చేసిన రకుల్ ప్రీత్ సింగ్..
Rakul Preeth Singh
Follow us on

టాలీవుడ్ స్టార్ హీరోయిన్ రకుల్ ప్రస్తుతం హిందీలో వరుస చిత్రాలతో బిజీగా ఉన్నారు. ఇటీవల డాక్టర్ జీ సినిమాతో ఆడియన్స్ ముందుకు వచ్చిన రకుల్.. ఆశించనింతగా మెప్పించలేకపోయింది. తాజాగా నార్త్ వర్సెస్ సౌత్ మూవీస్ డిబెట్‏లో ఆమె ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. సినిమా అనేది భావోద్వేగాల భాష. ఇది కేవలం సరిహద్దులు కాదు. నార్త్ వర్సెస్ సౌత్ అనేది ఇప్పుడు స్టార్ట్ అయ్యింది కానీ..శ్రీదేవి, టబు వంటి ప్రముఖ హీరోయిన్స్ దక్షిణాదిలోనూ నటించారు. అప్పుడు ఇప్పుడు ఎన్నో సినిమాలు రీమేక్ అయ్యాయి. ఈరోజు వారు ఉన్నత స్థాయికి చేరుకున్నారు. కానీ కరోనా తర్వాత చిత్ర కంటెంట్, విజయం సాధించిన సినిమాల గురించి పెద్ద చర్చే జరుగుతుంది. ఇది ఆరోగ్యకరమైన పరిస్థితులకు దారితీస్తుంది. దీని వెనక చాలా శ్రమనే ఉంటుందని పేర్కొంది రకుల్.

అలాగే ప్రస్తుతం బాలీవుడ్ ఎదుర్కొంటున్న పరిస్థితులు ఒక దశ మాత్రమే అని.. ప్రజలు డిజాస్టర్ సినిమాల గురించి రాసేందుకు ఆసక్తి చూపిస్తారు. కానీ సినిమా తెరకెక్కించేందుకు చాలా కృషి అవసరం. ఇప్పుడు సౌత్ సినిమాలు పనిచేస్తున్నాయి. విడుదలైన సినిమా మంచి విజయాన్ని అందుకుంటున్నారు. కరోనా తర్వాత పరిస్థితి పూర్తిగా మారిపోయింది. ప్రేక్షకుల అభిరుచి మారిపోయింది కానీ.. సౌత్.. నార్త్ సినిమాల అని చూడడం లేదు. వారికి జీవితాల కంటే పెద్ద సినిమాలు కావాలి అంటూ చెప్పుకొచ్చింది.

ఇవి కూడా చదవండి

రకుల్ చివరిసారిగా తెలుగులో కొండపొలం సినిమాలో కనిపించింది. ఇక హిందీలో థాండ్ గాడ్ చిత్రంలో కనిపించింది. ప్రస్తుతం ఆమె నటించిన ఛత్రివాలి సినిమా కోసం వెయిట్ చేస్తుంది. ఇదే కాకుండా ఈ ముద్దుగుమ్మ చేతిలో రెండు భారీ బడ్జెట్ తమిళ్ సినిమాలున్నాయి. అలాగే పాన్ ఇండియా డైరెక్టర్ శంకర్, కమల్ హాసన్ కాంబోలో రాబోతున్న ఇండియన్ 2 సినిమాలోనూ నటిస్తోంది.

మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.