Rakul Preet Singh : అవును అతనితో ప్రేమలో ఉన్నా.. క్లారిటీ ఇచ్చిన పాలబుగ్గల సుందరి రకుల్..

వెంకటాద్రి ఎక్స్ప్రెస్  సినిమాతో మంచి గుర్తింపు తెచుకుంది అందాల భామ రకుల్ ప్రీత్ సింగ్. ఆ సినిమాలో అందం అభినయంతో కట్టిపడేసింది రకుల్ ప్రీత్ సింగ్.

Rakul Preet Singh : అవును అతనితో ప్రేమలో ఉన్నా.. క్లారిటీ ఇచ్చిన పాలబుగ్గల సుందరి రకుల్..
Rakul

Updated on: Jan 10, 2022 | 6:56 PM

Rakul Preet Singh : వెంకటాద్రి ఎక్స్ప్రెస్  సినిమాతో మంచి గుర్తింపు తెచుకుంది అందాల భామ రకుల్ ప్రీత్ సింగ్. ఆ సినిమాలో అందం అభినయంతో కట్టిపడేసింది రకుల్ ప్రీత్ సింగ్. ఆతర్వాత ఈ అమ్మడికి వరుస ఆఫర్లు క్యూ కట్టాయి. వచ్చిన ఆఫర్లన్నింటిని అందిపుచ్చుకుంటూ టాలీవుడ్ లో రాణించింది రకుల్. ఆతర్వాత వరుసగా స్టార్ హీరోల సినిమాల్లో ఛాన్స్ లు దక్కించుకుంటూ.. వచ్చింది. ఇక తక్కువ సమయంలోనే రకుల్ స్టార్ హీరోయిన్ ట్యాగ్ ను అందుకుంది. ఇక ఈ అమ్మడు తెలుగుతోపాటు తమిళ్ లోనూ సినిమాలు చేసింది. అక్కడ కూడా స్టార్ హీరోల సినిమాల్లో నటించి ఆకట్టుకుంది ఈ ముద్దుగుమ్మ. అలాగే బాలీవుడ్ లోనూ మూవీస్ చేసి అలరించింది ఈ పాలబుగ్గల సుందరి.

ఇటీవల ఈ అమ్మడి జోరు తగ్గిందనే చెప్పాలి. తెలుగులో చివరిగా చేసిన రెండు సినిమాలో బాక్సాఫీస్ దగ్గర బోల్తాకొట్టాయ్. నితిన్ హీరోగా నటించిన చెక్, అలాగే క్రిష్ దర్శకత్వంలో వచ్చిన కొండపోలం సినిమాలు అమ్మడిని నిరాశపరిచాయి. ఇదిలా ఉంటే ఇప్పుడు ఈ చిన్నది ప్రేమలో మునిగి తేలుతుంది. ఈ విషయం పై గత కొంతకాలంగా గుసగుసలు వినిపిస్తున్నప్పటికీ రీసెంట్ గా కన్ఫామ్ చేసింది ఈ భామ. తాజాగా ఓ ఇంటర్వ్యూలో రకుల్ మాట్లాడుతూ.. బాలీవుడ్ నిర్మాత జాకీ భగ్నానీ, తాను ప్రేమలో ఉన్నామని చెప్పింది. తామిద్దరం చాలా కాలంగా డేటింగ్ లో ఉన్నామని చెప్పింది. తన జీవితంలో ఇదొక అద్భుతమైన ఫేజ్ అని తెలిపింది. తమ రిలేషన్ షిప్ గురించి తమ ఇంటి సభ్యులకు, స్నేహితులందరికీ తెలుసని చెప్పింది. అలాగే ఇప్పట్లో పెళ్లి చేసుకునే ఆలోచన లేదని.. ముందు కమిట్ అయినా సినిమాలను కంప్లీట్ చేయాలనీ చెప్పుకొచ్చింది రకుల్.

మరిన్ని ఇక్కడ చదవండి : 

Ashu Reddy: సామ్ స్పెషల్ సాంగ్ కు అదిరిపోయే స్టెప్పులేసిన ఆషూ రెడ్డి.. నెట్టింట్లో ఫుల్ వెర్షన్ వీడియో ..

Deepthi Sunaina-Shanmukh: ఇంత ప్రేమ, బాండింగ్ ఎటు పోయింది.. దీప్తికి షణ్ముఖ్ చివరి ముద్దు వైరల్

Harish Shankar: నెటిజన్ పై డైరెక్టర్ హరీశ్ శంకర్ సీరియస్.. ఎందుకంటే..

Loading...
Unable to load recommendations.
Follow Us