డైలాగ్స్ రాస్తున్న రజినీకాంత్ !

|

Sep 28, 2020 | 9:20 PM

సూపర్​స్టార్ రజినీకాంత్‌ తన స్టైల్లో డైలాగ్ చెబితే ఎలా ఉంటుంది. సరైైన డీటీఎస్ ఉంటే రోమాలు నిక్కబొడుచుకుంటాయ్.

డైలాగ్స్ రాస్తున్న రజినీకాంత్ !
Follow us on

సూపర్​స్టార్ రజినీకాంత్‌ తన స్టైల్లో డైలాగ్ చెబితే ఎలా ఉంటుంది. సరైైన డీటీఎస్ ఉంటే రోమాలు నిక్కబొడుచుకుంటాయ్. స్టైల్, డైలాగ్ డెలివరీ విషయంలో రజినీ కెపాసిటీ గురించి కనీసం చెప్పే సాహసం కూడా చెయ్యలేం. అయితే ఆయన డైలాగ్ రాస్తే ఎలా ఉంటుంది. ఇది కాస్త కొత్త విషయమే.  అవును త్వరలో రజినీ రచయితగా మారనున్నారట. ఏ డైలాగ్‌ అయినా అలవోకగా, స్టైల్ గా, అనర్గళంగా చెప్పే సూపర్ స్టార్.. ఈసారి తానే స్వయంగా వాటిని రాయనున్నారట. దర్శకుడు శివ రజినీతో ‘అన్నాత్త’  సినిమా తీస్తున్నారు. ఇందులోని కొన్ని డైలాగ్స్ తలైవా అందిస్తున్నారని కోలీవుడ్​లో చాలా ప్రచారం జరుగుతుంది.

గతంలో ‘బాబా’ సినిమాకు స్క్రీన్‌ప్లే అందించారు రజినీ. ఇప్పుడు డైలాగ్స్‌ రాస్తున్నారనడం వల్ల అందరిలోనూ తెగ ఇంట్రస్ట్ పెరిగింది. ఇది ఎంత నిజమో తెలియాలంటే కొంతకాలం ఆగాల్సిందే. ‘అన్నాత్త’ మూవీలో మీనా, ఖుష్బూ, కీర్తి సురేష్‌ కీలక పాత్రలు పోషిస్తున్నారు. సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చే ప్లాన్ చేశారు కానీ లాక్‌డౌన్‌ వల్ల షూటింగ్‌ వాయిదా పడింది. త్వరలోనే షూటింగ్ తిరిగి ప్రారంభిస్తారు. సన్‌ పిక్చర్స్ ఈ చిత్రాన్ని‌ నిర్మిస్తోంది.
Also Read :
‘నో’ చెప్పలేకపోతే సమస్యలు తప్పవు: పూరీ