Jailer 2: బాక్సాఫీస్ బాద్‌షా తలైవర్.. 3 రోజుల్లోనే రూ.317 కోట్లు సాధించిన జైలర్ 2

సూపర్‌స్టార్ రజినీకాంత్, క్రియేటివ్ డైరెక్టర్ నెల్సన్ దిలీప్‌కుమార్ కాంబినేషన్‌లో వచ్చిన మోస్ట్ అవేటెడ్ సీక్వెల్ 'జైలర్ 2' బాక్సాఫీస్ వద్ద సరికొత్త చరిత్ర సృష్టిస్తోంది. మొదటి భాగం తెచ్చిపెట్టిన అపారమైన క్రేజ్‌తో భారీ అంచనాల నడుమ ప్రపంచవ్యాప్తంగా విడుదలైన ఈ యాక్షన్ ఎంటర్‌టైనర్, థియేటర్లలో కలెక్షన్ల సునామీ సృష్టిస్తోంది.

Jailer 2: బాక్సాఫీస్ బాద్‌షా తలైవర్.. 3 రోజుల్లోనే రూ.317 కోట్లు సాధించిన జైలర్ 2
Rajinikanth Jailer 2

Updated on: Oct 19, 2026 | 11:15 AM

‘జైలర్ 2’ సునామీ!సూపర్‌స్టార్ రజనీకాంత్ వెండితెరపై అడుగుపెడితే రికార్డులు తిరగరాయాల్సిందేనని మరోసారి రుజువైంది. నెల్సన్ దిలీప్‌కుమార్ దర్శకత్వంలో సన్ పిక్చర్స్ నిర్మించిన యాక్షన్ ఎంటర్‌టైనర్ ‘జైలర్ 2’ థియేటర్లలో కాసుల వర్షం కురిపిస్తోంది. ఈ నెల 15న విడుదలైన ఈ చిత్రం మొదటి రోజు నుంచే వీకెండ్ విశ్వరూపం చూపిస్తూ ప్రపంచవ్యాప్తంగా బాక్సాఫీస్ వద్ద సరికొత్త చరిత్ర సృష్టిస్తోంది. ఈ సినిమా కేవలం మూడు రోజుల్లోనే ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా రూ.317.15 కోట్ల గ్రాస్ వసూళ్లను సాధించి రూ.300 కోట్ల క్లబ్‌లో సునాయాసంగా చేరిపోయింది. శనివారం రోజున దేశవ్యాప్తంగా మొత్తం 14,604 షోల ద్వారా ‘జైలర్ 2’ రూ.47.8 కోట్ల నెట్ వసూళ్లను రాబట్టింది. తమిళనాడు: 7,802 షోలతో రికార్డు స్థాయిలో రూ.34.6 కోట్ల నెట్ రాబట్టింది. తెలుగు రాష్ట్రాలు: 2,100 షోల ద్వారా రూ.8.50 కోట్ల నెట్ సాధించి హౌస్‌ఫుల్ బోర్డులతో కళకళలాడింది. ఉత్తరాది (నార్త్ ఇండియా): 4,554 షోల ద్వారా రూ.4.25 కోట్ల నెట్ వసూలు చేసింది. కర్ణాటక (కన్నడ వెర్షన్): 148 షోలతో రూ.45 లక్షల నెట్ కలెక్ట్ చేసింది. టోటల్ గా ఇండియా వైడ్ గా 3 రోజులకు రూ.169.65 కోట్లు గ్రాస్, అలాగే  ఇండియా నెట్: రూ.144.60 కోట్లు రాబట్టింది.

అదేవిదంగా కేవలం భారతదేశంలోనే కాకుండా అమెరికా, యూకే, గల్ఫ్, ఆస్ట్రేలియా, మలేషియా వంటి అంతర్జాతీయ మార్కెట్లలో రజనీ మేనియా కనిపిస్తుంది. మూడో రోజు ఒక్క రోజే ఓవర్సీస్‌లో రూ.47.5 కోట్ల గ్రాస్ సాధించింది జైలర్ 2. ఇప్పటివరకు ఓవర్సీస్ లో మొత్తం గ్రాస్ రూ.147.50 కోట్లకు చేరింది. ఇండియా గ్రాస్ రూ.169.65 కోట్లు. ఓవర్సీస్ గ్రాస్రూ.147.50 కోట్లు. మొత్తం వరల్డ్ వైడ్ రూ. 317.15 కోట్లు సాధించింది జైలర్ 2 సినిమా.

జైలర్  మొదటి భాగం సాధించిన సంచలన విజయం ఇచ్చిన హైప్‌కు తోడు, ఈ సీక్వెల్‌లో రజనీకాంత్ మాస్ స్క్రీన్ ప్రెజెన్స్ ప్రేక్షకులను కట్టిపడేస్తోంది. అనిరుధ్ రవిచందర్ అందించిన అద్భుతమైన బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ థియేటర్లలో పూనకాలు తెప్పిస్తోంది. దీనికి తోడు మోహన్‌లాల్, హృతిక్ రోషన్, విద్యాబాలన్, ఎస్‌జే సూర్య వంటి స్టార్స్ ఈ సినిమాకు భారీ మైలేజ్‌ను అందించారు. రాబోయే రోజుల్లో ఈ చిత్రం మరిన్ని రికార్డులను తిరగ రాయడం ఖాయమని ట్రేడ్ వర్గాలు చెప్తున్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Loading...
Unable to load recommendations.
Follow Us