Rajinikanth: అన్ని కోట్లా..!! రజినీకాంత్ రెమ్యునరేషన్‌తో నాలుగు పాన్ ఇండియా సినిమాలు తీయొచ్చు..

పాన్ ఇండియా ట్రెండ్ రాకముందే ఆయన పాన్ ఇండియా స్టార్.. విదేశాల్లోనూ రజినీకాంత్ కు విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. ముఖ్యంగా జపాన్ లో రజినీకి భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. ఇక ఆయన సినిమాలు అవలీలగా వందకోట్ల వసూళ్లను దాటేస్తున్నాయి. ఇటీవలే జైలర్ సినిమాతో సంచలన విజయాన్ని అందుకున్నారు రజినీకాంత్.

Rajinikanth: అన్ని కోట్లా..!! రజినీకాంత్ రెమ్యునరేషన్‌తో నాలుగు పాన్ ఇండియా సినిమాలు తీయొచ్చు..
Rajinikanth
Follow us

|

Updated on: Apr 25, 2024 | 1:52 PM

సూపర్ స్టార్ రజినీకాంత్ ఏడుపదుల వయసులోనూ సినిమాలు చేస్తూ ప్రేక్షకులను మెప్పిస్తున్నారు. సూపర్ స్టార్ కు ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. పాన్ ఇండియా ట్రెండ్ రాకముందే ఆయన పాన్ ఇండియా స్టార్.. విదేశాల్లోనూ రజినీకాంత్ కు విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. ముఖ్యంగా జపాన్ లో రజినీకి భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. ఇక ఆయన సినిమాలు అవలీలగా వందకోట్ల వసూళ్లను దాటేస్తున్నాయి. ఇటీవలే జైలర్ సినిమాతో సంచలన విజయాన్ని అందుకున్నారు రజినీకాంత్. జైలర్ సినిమా ఏకంగా 700కోట్లకు పైగా వసూల్ చేసి రికార్డ్ క్రియేట్ చేసింది. ఇక ఇప్పుడు ఆయన బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో ప్రేక్షకులను అలరించడానికి రెడీ అవుతున్నారు. ఇప్పటికే క్రేజీ సినిమాలను లైనప్ చేశారు తలైవా..

జ్ఞానవేల్ రాజా దర్శకత్వంలో వేటయన్ అనే సినిమా చేస్తున్నారు రజినీకాంత్. అలాగే నెల్సన్ దిలీప్ దర్శకతవంలో జైలర్ సినిమాకు సీక్వెల్ గా హుకుం అనే సినిమాను కూడా రెడీ చేస్తున్నారు. వీటితో పాటు తలైవర్ 171 కూడా సిద్ధం అవుతుంది. ఈ సినిమాకు లోకేష్ కనగరాజ్ దర్శకత్వం వహిస్తున్నారు.  ఈ మూవీకి కూలి అనే టైటిల్ ను ఖరారు చేశారు.

రీసెంట్ గా కూలి సినిమా టైటిల్ గ్లింప్స్ ను విడుదల చేశారు. ఈ సినిమా మాస్ యాక్షన్ ఎంటర్ టైనర్ గా తెరకెక్కుతోంది. అలాగే లోకేష్ సినిమాటిక్ యూనివర్స్ కు లింక్ చేస్తూ ఈ సినిమా ఉంటుందని తెలుస్తోంది. ఇదిలా ఉంటే ఈ సినిమాకు రజినీకాంత్ రికార్డ్ స్థాయిలో రెమ్యునరేషన్ అందుకుంటున్నారని తెలుస్తోంది. ఇప్పటికే రజినీకాంత్ వంద కోట్ల వరకు రెమ్యునరేషన్ అందుకుంటున్నారు. ఇప్పుడు కూలి సినిమా కోసం ఏకంగా రూ. 260 నుంచి రూ. 280 కోట్ల వరకు పారితోషికం తీసుకుంటున్నట్లు టాక్ వినిపిస్తుంది. దర్శకుడు లోకేష్ ఈ సినిమా కోసం 60 కోట్లవరకు అందుకుంటున్నాడట. త్వరలోనే ఈ సినిమా షూటింగ్ ప్రారంభం కానుంది. ఈ సినిమాలో సూపర్ స్టార్కానీ గోల్డ్ స్మగ్లర్ గా కనిపించనున్నాడు.

లోకేష్ కానగరాజ్..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.