
టాలీవుడ్ నటుడు రాజశేఖర్ తన ‘బైకర్’ (2026) మూవీ గురించి పలు ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. దర్శకుడు అభిలాష్ రెడ్డి చెప్పిన కథలో తన పాత్రతో పాటు శర్వానంద్ క్యారెక్టర్ కూడా చాలా అద్భుతంగా ఉందని ఆయన తెలిపారు. ఈ సినిమాలో రాజశేఖర్ మాజీ మోటోక్రాస్ రేసర్ ‘బుల్లెట్ సునీల్’గా, శర్వానంద్‌కు తండ్రి పాత్రలో కనిపించిన విషయం తెలిసిందే. మనసున్న ఇటువంటి బలమైన పాత్రలు దొరికితే మల్టీస్టారర్ చిత్రాలు చేయడానికి తాను సిద్ధమని ఆయన పేర్కొన్నారు.
ఇది చదవండి: నేను, రజినీకాంత్ బెస్ట్ ఫ్రెండ్స్.. ‘వాడు’ అనేంత చనువు ఉంది.. టాలీవుడ్ నటుడు
గతంలో వచ్చిన ‘ఎక్స్‌ట్రార్డినరీ మ్యాన్’ తన అభిమానులను నిరాశపరిచిన మాట వాస్తవమేనని అన్నారు. ఇక బైకర్ మూవీలో రాజశేఖర్ రోల్‌కు మంచి ప్రశంసలు దక్కిన సంగతి తెలిసిందే. ఒక పాత జ్ఞాపకాన్ని గుర్తు చేసుకుంటూ.. ‘సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు’ సినిమాలో తండ్రి పాత్రకు మొదట తనను అనుకున్నారని, కానీ చివరికి ఆ అవకాశం ప్రకాష్ రాజ్‌కు దక్కిందని రాజశేఖర్ వెల్లడించారు. అలాగే తన భార్య జీవిత, కుమార్తెలు శివానీ, శివాత్మికలు సినీ రంగంలో రాణిస్తున్నందుకు గర్వంగా ఉందన్నారు. అప్పట్లో ‘బలరామకృష్ణుడు’ వంటి చిత్రాల్లో తోటి నటులతో కలిసి సమాన ప్రాధాన్యత ఉన్న పాత్రలు చేశామని, నేటి తరం హీరోలు కూడా అలాంటి క్యారెక్టర్ రోల్స్ చేయడానికి ముందుకు రావాలని ఆయన అభిప్రాయపడ్డారు.
ఇది చదవండి: అన్నగారు చనిపోయిన చివరి రోజు జరిగిందిదే.. షాకింగ్ నిజం చెప్పిన సీనియర్ ఎన్టీఆర్ చీఫ్ సెక్యూరిటీ ఆఫీసర్