Raj Tarun’s Anubhavinchu Raja: రామ్ చరణ్ వదిలిన రాజ్ తరుణ్ టీజర్.. ఆకట్టుకుంటున్న అనుభవించు రాజా…

|

Sep 23, 2021 | 12:53 PM

కుర్ర హీరో రాజ్ తరుణ్ నటిస్తున్న తాజా చిత్రం అనుభవించు రాజా.. షార్ట్ ఫిలిమ్స్ చేస్తూ హీరోగా ఎదిగిన రాజ్ తరుణ్.. మొదటి సినిమా ఉయ్యాలా జంపాల సినిమాతో హీరోగా పరిచయం అయ్యాడు

Raj Taruns Anubhavinchu Raja: రామ్ చరణ్ వదిలిన రాజ్ తరుణ్ టీజర్.. ఆకట్టుకుంటున్న అనుభవించు రాజా...
Raj Tharun
Follow us on

Anubhavinchu Raja: కుర్ర హీరో రాజ్ తరుణ్ నటిస్తున్న తాజా చిత్రం అనుభవించు రాజా.. షార్ట్ ఫిలిమ్స్ చేస్తూ హీరోగా ఎదిగిన రాజ్ తరుణ్.. మొదటి సినిమా ఉయ్యాలా జంపాల సినిమాతో హీరోగా పరిచయం అయ్యాడు. తొలి సినిమాతోనే తన నటనతో ప్రేక్షకులను ఆకట్టుకున్నాడు ఈ యంగ్ హీరో.. ఆతర్వాత సినిమా చూపిస్తా మామ సినిమా కూడా మంచి విజయాన్ని అందించింది. ఇక సుకుమార్ రైటింగ్స్‌లో వచ్చిన కుమారి 21 ఎఫ్ సినిమా భారీ విజయాన్ని అందుకుంది. ఈ సినిమా తర్వాత రాజ్ తరుణ్‌కు ఆవకాశాలు క్యూ కట్టాయి. అయితే కుమారి సినిమా తర్వాత ఆ రేంజ్ హిట్ మాత్రం అనుకోలేక పోయాడు.. ఆ మధ్య మంచు విష్ణుతో కలిసి ఆడో రకం ఈడోరకం అనే సినిమా చేశాడు ఈ యంగ్ హీరో.. ఈ సినిమా పర్లేదనికించుకుంది. ఇక ఇటీవల వచ్చిన ఒరేయ్ బుజ్జిగా సినిమాకూడా యావరేజ్ టాక్ సొంతం చేసుకుంది.

ఇక ఇప్పుడు శ్రీనివాస్ గవి రెడ్డి దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నాడు రాజ్ తరుణ్.. ఈ సినిమాకు అనుభవించు రాజా అనే ఆసక్తికర టైటిల్ ను ఫిక్స్ చేశారు. ఇటీవలే ఈ సినిమా నుంచి రాజ్ తరుణ్ ఫస్టులుక్ పోస్టర్ ను వదిలారు. తాజాగా ఈ మూవీ నుంచి ట్రైలర్ ను విడుదల చేశారు చిత్రయూనిట్. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఈ సినిమా టీజర్ ను విడుదల చేశారు.  గ్రామీణ నేపథ్యంలో సాగుతుంది. రాజ్ తరుణ్ లుక్ చూస్తుంటే పేకాట .. కోడిపందాలుతో జీవితాన్ని విలాసవంతంగా గడిపేసేవాడిలా కనిపిస్తున్నాడు.

మరిన్ని ఇక్కడ చదవండి : 

Naga Chaitanya: రానా బాటలో అక్కినేని యంగ్ హీరో.. ఛాలెంజింగ్ రోల్‌కు సై అంటున్న చైతన్య..

chandramukhi 2: సెట్స్ మీదకు చంద్రముఖి 2.. రంగంలోకి దిగిన లారెన్స్..! వీడియో

NTR: కొత్త కారు కోసం ఫ్యాన్సీ నంబర్‌ దక్కించుకున్న ఎన్టీఆర్‌.. 9999 నంబర్‌కు ఎంత పెట్టారో తెలిస్తే షాక్..

Regina Cassandra: బంపర్ ఆఫర్ కొట్టేసిన రెజీనా.. ఆ క్రేజీ వెబ్ సిరీస్‌లో హీరోయిన్‌గా ఈ హాట్ బ్యూటీ..