Rakshasapuram: తెలుగులో రాజ్‌ బి శెట్టి రీసెంట్ బ్లాక్ బస్టర్.. ‘రాక్షసపురం’ రిలీజ్‌పై అధికారిక ప్రకటన

టోబి, సు ఫ్రమ్ సో సినిమాలతో తెలుగు ఆడియెన్స్ కు బాగా దగ్గరయ్యాడు కన్నడ స్టార్ నటుడు రాజ్ బి శెట్టి. ఆ మధ్యన ఆయన ఉపేంద్ర, శివరాజ్ కుమార్ లతో నటించిన 45 సినిమా కూడా తెలుగులో సూపర్ హిట్ గా నిలిచింది. ఇప్పుడు రాక్షసపురం అంటూ మరో కొత్త సినిమాతో మన ముందుకు వస్తున్నాడీ వెర్సటైల్ యాక్టర్.

Rakshasapuram: తెలుగులో రాజ్‌ బి శెట్టి రీసెంట్ బ్లాక్ బస్టర్.. రాక్షసపురం రిలీజ్‌పై అధికారిక ప్రకటన
Rakshasapuram Movie

Updated on: May 11, 2026 | 5:51 PM

ప్రముఖ నిర్మాణ సంస్థ క్రియేటివ్ కమర్షియల్స్ అధినేత, సీనియర్ నిర్మాత కె.ఎస్ రామారావు తెలుగు ప్రేక్షకులకు అందిస్తున్న లేటెస్ట్ మూవీ ‘రాక్షసపురం’. కన్నడలో సంచలన విజయం సాధించిన ‘రాక్షసపుర’ చిత్రానికి ఇది తెలుగు అనువాదం. తాజాగా ఈ సినిమా తెలుగు సెన్సార్ పూర్తియినట్లు చిత్ర సమర్పకులు కె.ఎస్ రామారావు ప్రకటించారు. సెన్సార్ బోర్డు నుంచి యూ/ఏ సర్టిఫికెట్ వచ్చిందని, సినిమా ప్రతి ఒక్కరినీ అలరించేలా ఉంటుందని ఆయన తెలిపారు. ఈ చిత్రాన్ని మే 15న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో గ్రాండ్‌గా విడుదల చేయనున్నట్లు కె.ఎస్ రామారావు మరోసారి స్పష్టం చేశారు. విభిన్నమైన నటనతో తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న కన్నడ స్టార్ రాజ్ బి శెట్టి ఈ సినిమాలో పవర్‌ఫుల్ పోలీస్ ఇన్ స్పెక్టర్ పాత్రలో నటించారు. డాక్టర్ రవి నిర్మాణంలో తెరకెక్కిన ఈ చిత్రం ఒక ఉత్కంఠభరితమైన మర్డర్ మిస్టరీ థ్రిల్లర్. ఇన్వెస్టిగేషన్ డ్రామా నేపథ్యంలో సాగే కథనం ప్రేక్షకులను అడుగడుగునా థ్రిల్‌కు గురి చేస్తుంది.

సెన్సార్ పూర్తయిన సందర్భంగా సినిమా గురించి కె.ఎస్ రామారావు స్పందిస్తూ..”ఈ సినిమాలోని మేకింగ్ విలువలు, సస్పెన్స్ ఎలిమెంట్స్ నన్ను బాగా ఆకట్టుకున్నాయి. అందుకే ఎలాంటి రాజీ పడకుండా ఈ చిత్రాన్ని తెలుగు ప్రేక్షకులకు అందించాలని నిర్ణయించుకున్నాం. సినిమాను మే 7న విడుదల చేయాలని ముందుగా అనుకున్నప్పటికీ, మరిన్ని మెరుగైన థియేటర్లు, గరిష్ట స్థాయిలో ప్రేక్షకులకు చేరువయ్యేలా చేసేందుకు వీలుగా మే 15న విడుదల చేస్తున్నాం. వేసవి సెలవుల దృష్ట్యా ఈ తేదీ సినిమాకు కలిసి వస్తుందని భావిస్తున్నాం. ప్రస్తుతం ఐపీఎల్ సందడి మరియు ఓటీటీల పోటీ ఉన్నప్పటికీ, కంటెంట్ బలంగా ఉన్న చిత్రాలను ప్రేక్షకులు ఎప్పుడూ ఆదరిస్తారని నమ్ముతున్నాం. ‘రాక్షసపురం’ కచ్చితంగా ఆ కోవలోకి వస్తుంది. సెన్సార్ నుంచి కూడా మంచి అప్రిసియేషన్ వచ్చింది. ఈ సినిమా అందరినీ ఆకట్టుకుంటుంది’’ అని రామారావు ధీమా వ్యక్తం చేశారు.

ఇవి కూడా చదవండి

 

నటీనటులు – రాజ్ బి శెట్టి, స్వాతిష్ట, అర్చన కొట్టిగె, అనిరుధ్ భట్, బి. సురేఖ, గోపాలకృష్ణ దేశ్ పాండే, తదితరులు

టెక్నికల్ టీమ్

ఎడిటర్ – కె.ఎం. ప్రకాష్
డీవోపీ – విలియమ్ డేవిడ్
మ్యూజిక్ – అర్జున్ జన్య
నిర్మాత – కె రవివర్మ
రచన, దర్శకత్వం – రవి సారంగ
సమర్పణ – కె.ఎస్. రామారావు.

విడుదల తేదీ: మే 15, 2026

 

మే15న గ్రాండ్ రిలీజ్..

 

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

 

 

Follow Us