Ragini dwivedi : మానసిక కుంగుబాటు వల్ల సరిగ్గా నిద్రపోలేకపోతున్నా… కనీటిపర్యంతం అయిన కన్నడ నటి

గతేడాది కన్నడ చిత్ర పరిశ్రమను కుదిపేసిన డ్రగ్స్‌ కేసులో అరెస్టయిన సినీ నటి రాగిణి ద్వివేదికి గతేడాది కన్నడ చిత్ర పరిశ్రమను కుదిపేసిన డ్రగ్స్‌ కేసులో అరెస్టయిన సినీ నటి రాగిణి ద్వివేదికి..

Ragini dwivedi : మానసిక కుంగుబాటు వల్ల సరిగ్గా నిద్రపోలేకపోతున్నా... కనీటిపర్యంతం అయిన కన్నడ నటి

Updated on: Feb 13, 2021 | 4:53 AM

Ragini dwivedi : గతేడాది కన్నడ చిత్ర పరిశ్రమను కుదిపేసిన డ్రగ్స్‌ కేసులో అరెస్టయిన సినీ నటి రాగిణి ద్వివేదికి సుప్రీంకోర్టు బెయిల్ మంజూరు చేసింది. సుప్రీంకోర్టు బెయిల్ మంజూరు చేసింది. అంతర్జాతీయ డ్రగ్స్‌ ముఠాతో సంబంధాలున్నాయని, చిత్రపరిశ్రమలో చాలా మందికి డ్రగ్స్ సరఫరా చేస్తున్నారనే కారణంతో గత సెప్టెంబర్‌లో రాగిణి, సంజనాలను బెంగళూరు క్రైమ్‌ బ్రాంచ్‌ పోలీసులు అరెస్ట్‌ చేసిన సంగతి తెలిసిందే. తాజాగా రాగిణి సోషల్ మీడియా వేదికగా అభిమానులతో మాట్లాడింది. ఈ సందర్భంగా ఆమె కనీటిపర్యంతం అయ్యింది.

కొంతమంది నెటిజన్లు నా కుటుంబం గురించి కామెంట్లు చేస్తున్నారు. నేను వాళ్లకి చెప్పేది ఒక్కటే.. మీరు చేసిన కామెంట్లను ఒక్కసారి మీరే చదవండి. అలాంటి నెగెటివ్‌ కామెంట్లు, మానసిక కుంగుబాటు వల్ల సరిగ్గా నిద్రపోలేకపోతున్నా. ఇప్పుడిప్పుడే నేను కోలుకుంటున్నా’  అని చెప్పుకొచ్చింది. ప్ర‌స్తుతం తాను క్లిష్ట ద‌శ‌లో ఉన్నానని చెప్పింది. ‘ఇక మిమ్మల్ని నవ్విస్తాను.. ఫీల్‌ గుడ్‌ చేస్తానని.. వంట, ఫన్నీ వీడియోలతో మీ ముందుంటా’ అని రాగిణి తెలిపింది. ప్రేమ, బాధ, ఆనందంతో కూడిన ప‌లు భావోద్వేగాలతో 2021 ప్రారంభమైంది. కొన్ని నెలలుగా జీవితంలో ఎన్నో ఒడుదొడుకులను ఎదుర్కొంటున్నాను అంటూ చెప్పుకొంది రాగిణి.

మరిన్ని ఇక్కడ చదవండి : 

Acharya Movie : శరవేగంగా ఆచార్య షూటింగ్.. త్వరలో ఖమ్మం జిల్లాలో చిత్రీకరణ జరుపనున్న టీమ్..