
మాస్ మహారాజా రవితేజ సంక్రాంతి బ్లాక్ బస్టర్ ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’. కిషోర్ తిరుమల దర్శకత్వంలో, సుధాకర్ చెరుకూరి ఎస్ఎల్‌వి సినిమాస్ బ్యానర్‌పై నిర్మించిన ఈ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ లో డింపుల్ హయతి, ఆషిక రంగనాథ్ కథానాయికలుగా నటించారు. జనవరి 13న గ్రాండ్‌గా విడుదలైన ఈ సినిమా సంక్రాంతి బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకుని హౌస్ ఫుల్ గా రన్ అవుతోంది. ఈ సందర్భంగా నిర్మాత సుధాకర్ చెరుకూరి విలేకరుల సమావేశంలో సినిమా విశేషాలు పంచుకున్నారు.
భర్త మహాశయులకు విజ్ఞప్తి బ్రేక్ ఈవెన్ అవ్వడం చాలా హ్యాపీ గా ఉందని.. ఆంధ్ర మొత్తం ఆల్మోస్ట్ అయింది. ఇది లాంగ్ వీకెండ్. సోమవారం కూడా హాలిడే. నైజం తో పాటు మిగతా ఏరియాలో కూడా అయిపోతాయని అన్నారు. ఆడియన్స్ నుంచి చాలా అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. అలాగే డిస్ట్రిబ్యూటర్స్ బయ్యర్స్ కూడా చాలా హ్యాపీగా వుండటం మాకు ఎంతో ఆనందం ఇచ్చిందని అన్నారు. మేము పండగకి రావాలనే ఈ సినిమాని మొదలుపెట్టాం. 65 రోజుల్లో పూర్తి చేశాం. రెగ్యులర్ రవితేజ గారి సినిమాల కాకుండా పండగకి ఒక మంచి ఫ్యామిలీ ఎంటర్టైనర్ లాగా ఈ సినిమాని తీసుకురావాలని ఉద్దేశంతోనే ప్రారంభించాం. సినిమాని అడుయన్స్ అద్భుతంగా ఎంజాయ్ చేస్తున్నారు. ఇలాంటి సినిమాలు మరిన్ని చేయాలనే భావిస్తున్నాం.
ఈ సినిమా కోసం దర్శకుడు తిరుమల కిషోర్ ప్రమోషన్స్ లో కూడా చాలా ఇన్వాల్వ్ అయ్యారు. మా డైరెక్టర్, హీరో హీరోయిన్స్ ప్రమోషన్స్ కి చాలా సపోర్ట్ చేశారు. రేపటి నుంచి ప్రమోషన్స్ టూర్స్ కూడా ఉంటాయి. పండగకి వచ్చిన అన్ని సినిమాలు కూడా విజయాలు సాధించాయి ఇది అరుదైన గొప్ప విషయం ఇది. వచ్చిన ఐదు సినిమాలు కూడా అద్భుతంగా ఆడాయి. సంక్రాంతికి చిరంజీవి గారి సినిమా ఫస్ట్ ఆప్షన్. అందరూ ఆ సినిమాని చూసేశారు. ఇప్పుడు సెకండ్ వీక్ నుంచి మిగతా సినిమాలన్నీ కూడా రన్ అద్భుతంగా ఉండబోతుంది. రెండో మూడో వారాలు కూడా చాలా మంచి రన్ వుంటుంది.
రవితేజ గారి సినిమా అన్నిటికంటే ముందు వస్తుందని మాకు తెలుసు. అందుకే ఇదే సినిమా మీద కాస్త ఎక్కువ ఫోకస్ చేయడం జరిగింది. పారడైజ్ కి మంచి టీం వుంది. మా సొంత మనుషులు ఉన్నారు. అన్ని సినిమాలు కూడా అద్భుతంగా జరుగుతున్నాయి. ఇక రవితేజతో పనిచేయడం ఇది రెండోసారి. మేము మొదటిది అనుకున్నంతగా రాలేదు. ఇది మాత్రం మేము ఏదైతే అనుకున్నామో అన్ని ఎలిమెంట్స్ కూడా అద్భుతంగా వర్కౌట్ అయ్యాయి. ఆడియన్స్ చాలా ఎంజాయ్ చేస్తున్నారు. రవితేజ గారు మాకొక బ్రదర్ లాగా ఉంటారు అని అన్నారు.
మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ చూడండి..