Udhayanidhi Stalin : ఉదయ్ నిధి స్టాలిన్‌కు గోల్డ్ చైన్ గిఫ్ట్‌గా ఇచ్చిన బోనికపూర్.. కారణం ఏంటంటే

|

Jul 13, 2022 | 7:50 AM

ఒక వైపు రాజకీయాలను మరో వైపు సినిమాలను బ్యాలెన్స్ చేస్తూ దూసుకుపోతున్నారు ఉదయ్ నిధి స్టాలిన్. తమిళ్ నాడు ముఖ్యమంత్రి కుమారుడైన ఉదయ్ రాజకీయాల్లో ఉన్న విషయం తెలిసిందే.

Udhayanidhi Stalin : ఉదయ్ నిధి స్టాలిన్‌కు గోల్డ్ చైన్ గిఫ్ట్‌గా ఇచ్చిన బోనికపూర్.. కారణం ఏంటంటే
Udhayanidhi Stalin
Follow us on

ఒక వైపు రాజకీయాలను మరో వైపు సినిమాలను బ్యాలెన్స్ చేస్తూ దూసుకుపోతున్నారు ఉదయ్ నిధి స్టాలిన్(Udhayanidhi Stalin). తమిళ్ నాడు ముఖ్యమంత్రి కుమారుడైన ఉదయ్ రాజకీయాల్లో ఉన్న విషయం తెలిసిందే. ఉదయ్ నిధి స్టాలిన్ కెరీర్ బిగినింగ్ నుంచే విభిన్నమైన కథలను ఎంచుకుంటూ సినిమా చేస్తూ ప్రేక్షకులను అలరిస్తున్నారు. తాజాగా ఆయన ‘నెంజుక్కు నీది’ అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ఈ సినిమా ఘన విజయం సాధించింది. మొదటి షో నుంచి పాజిటివ్ టాక్ తో దూసుకుపోతోంది ఈ సినిమా. ఈ చిత్రాన్ని బాలీవుడ్ నిర్మాత, దివంగత శ్రీదేవి భర్త బోనీ కపూర్ నిర్మించారు. తాజాగా ‘నెంజుక్కు నీది’ 50 రోజులను విజయవంతంగా పూర్తి చేసుకుంది.

ఈ సందర్భంగా 50 డేస్ ఫంక్షన్ ను నిర్వహించారు మేకర్స్. ఈ కార్యక్రమంలో సినిమాకోసం పని చేసిన వారికీ షీల్డ్ ఇచ్చి సత్కరించారు. అలాగే హీరో ఉదయ్ నిధి స్టాలిన్ కు నిర్మాత బోనీ కపూర్ బంగారు గొలుసు బహుమతిగా ఇచ్చారు. ఉదయనిధి మాట్లాడుతూ.. నెంజుక్కు నీది సినిమా విజయం వెనుక అందరి కష్టం ఉందని చెప్పారు. త్వరలోనే సొంత బ్యానర్ లో ఓ  సినిమా చేస్తానని.. ఆ తర్వాత బోనీ కపూర్ బ్యానర్ లో మరో సినిమా చేస్తానని తెలిపారు. అలాగే నిర్మాత బోనీకపూర్ మాట్లాడుతూ.. మంచి కథలను, మంచి సినిమాలను నిర్మించడమే తన లక్ష్యమని అన్నారు. తమిళంలో వరుస సినిమాలు చేయాలనుకుంటున్నానని , ఉదయనిధితో మరో సినిమా చేస్తానని తెలిపారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి