
తెలుగు చలనచిత్ర పరిశ్రమలో ప్రముఖ నిర్మాతగా తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు బెల్లంకొండ సురేష్. ఎన్నో వైవిధ్యమైన, భారీ బడ్జెట్ చిత్రాలను నిర్మించిన ఆయన, ఇటీవల ఒక ఇంటర్వ్యూలో తన కెరీర్ ఆరంభంలో ఎదుర్కొన్న ఒడిదొడుకులు , కన్నడ సూపర్ స్టార్ ఉపేంద్రతో తాను నిర్మించిన ‘రా’ (Ra) సినిమా వెనుక ఉన్న కొన్ని ఆసక్తికరమైన నిజాలను పంచుకున్నారు. ‘సాంబయ్య’ సినిమా విజయంతో తనకు 50 లక్షల రూపాయల భారీ లాభం వచ్చిందని, దాంతో అప్పట్లో తాను చాలా రిచ్ అయిపోయానని బెల్లంకొండ తెలిపారు.. ఆ ఊపులోనే కేవలం ఆరు నెలల వ్యవధిలో విజయశాంతి, రాజశేఖర్, ఉపేంద్రలతో ఒకే రోజు మూడు సినిమాలను రామానాయుడు స్టూడియోలో ప్రారంభించినట్లు ఆయన గుర్తుచేసుకున్నారు. అయితే అందులో ఉపేంద్ర నటించిన ‘రా’ సినిమా పంపిణీదారులకు, భాగస్వాములకు నచ్చకపోవడంతో సుమారు ఒకటిన్నర సంవత్సరం పాటు ఆగిపోయింది.
ఎక్కువ మంది చదివినవి : Trending Song: వామ్మో.. ఇదేం క్రేజ్ రా బాబూ.. యూట్యూబ్‌ను షేక్ చేస్తున్న పక్కా ఫోక్ సాంగ్.. ఇన్ స్టాలో దుమ్మురేపుతున్న రీల్స్..
సినిమా ల్యాబ్‌లోనే ఆగిపోవడంతో అప్పట్లో ఆ ప్రాజెక్ట్‌పై రూ.80 లక్షల ఫైనాన్స్ భారం పడింది. భాగస్వాములు తప్పుకోవడంతో, బెల్లంకొండ సురేష్ ఆ భారాన్ని తనపై వేసుకుని సినిమా నెగిటివ్‌ను హీరో ఉపేంద్ర వద్దకు పంపారు. ఉపేంద్ర ఆ అవుట్‌పుట్ చూసి, టోటల్ రష్ ఎక్కడ ఉందో కనుక్కుని, తన సొంత ఎడిటర్‌ను పిలిపించి సినిమాను సరికొత్తగా రీ-ఎడిట్ చేశారు.
ఎక్కువ మంది చదివినవి : Sampath Raj : అలాంటి హీరోను ఎక్కడా చూడలేదు.. ఆయన యాక్టింగ్ చూసి ఫిదా అయిపోయా.. నటుడు సంపత్ రాజ్..
ఉపేంద్ర మార్చిన ఎడిటింగ్ వెర్షన్‌ను రామానాయుడు స్టూడియోలో చూసిన బెల్లంకొండ సురేష్ షాక్‌కు గురయ్యారు. సినిమా మునుపటి కంటే ఎంతో అద్భుతంగా రావడంతో, వెంటనే ఆ కాపీని ప్రముఖ నిర్మాత డి. రామానాయుడుకి చూపించారు.. సినిమా కంటెంట్‌ను నమ్మిన రామానాయుడు . ఈస్ట్, వెస్ట్ గోదావరి, నెల్లూరు , సీడెడ్ హక్కుల కోసం అప్పట్లోనే రూ.50 లక్షల సింగిల్ చెక్ ఇచ్చి బెల్లంకొండను ఆదుకున్నారు. అలా ఎన్నో అడ్డంకులను దాటుకుని విడుదలైన ‘రా’ సినిమా బాక్సాఫీస్ వద్ద ఘనవిజయం సాధించి, బెల్లంకొండ సురేష్ కెరీర్‌లో ఒక మైలురాయిగా నిలిచింది.
ఎక్కువ మంది చదివినవి : Vadde Naveen: ఒకప్పుడు లవర్ బాయ్.. వడ్డె నవీన్ కొడుకును చూశారా.. ? వైరలవుతున్న ఫోటోస్..
ఎక్కువ మంది చదివినవి : Sirivennela Sitaramasastri : మనిషి జీవితంలో ఎదగటానికి ఈ లక్షణాలు ఉంటే చాలు.. సిరివెన్నెల సీతారామ శాస్త్రి..