చాలా మంది హీరోయిన్స్ టాలీవుడ్ లో తమ అందం అభినయంతో ఆకట్టుకుంటూ దూసుకుపోతున్నారు. అయితే గ్లామర్ తో పాటు అదృష్టం కూడా ఉండాలి. ఒకొక్కసారి వరుసగా ఫ్లాప్స్ అందుకుంటున్న బ్యూటీకి ఆఫర్లు వస్తూనే ఉంటాయి.. ఒకొక్కసారి హిట్స్ అందుకున్న ముద్దుగుమ్మలకు అసలు ఆఫర్లే రావు. ప్రస్తుతం ఈ చిన్నదాని పరిస్థితి కూడా అలానే ఉంది. షార్ట్ ఫిలిమ్స్ తో కెరీర్ ప్రారంభించి ఆ తర్వాత హీరోయిన్ అయ్యింది వయ్యారి భామ ప్రియాంక జవల్కర్. ట్యాక్సీవాలా సినిమాతో ఈ చిన్నది హీరోయిన్ గా పరిచయం అయ్యింది. తొలి సినిమానే స్టార్ హీరో విజయ్ దేవరకొండ సరసన ఛాన్స్ దక్కించుకుంది ఈ భామ. ట్యాక్సీవాలా సినిమా మంచి విజయాన్ని అందుకుంది. ఈ సినిమాలో తన నటన అందంతో మంచి మార్కులు కొట్టేసింది ప్రియాంక. ఈ సినిమా తర్వాత కుర్ర హీరో కిరణ్ అబ్బవరం సరసన నటించింది. కిరణ్ అబ్బవరం హీరోగా వచ్చిన ఎస్ ఆర్ కల్యాణ మండపం అనే సినిమాలో నటించింది ఈ సినిమా కూడా మంచి విజయాన్ని అందుకుంది.
అయితే ప్రియాంక వరుస ఆఫర్లతో స్టార్ హీరోయిన్ గా మారిపోతుంది అని అనుకుంటే ఇప్పుడు ఈ చిన్నదానికి ఆశించినంతగా ఆఫర్లు రావడం లేదని తెలుస్తోంది. బ్యాక్ టు బ్యాక్ హిట్స్ అందుకున్నప్పటికీ స్టార్ హీరోల సినిమాల్లో ఛాన్స్ దక్కించుకోలేకపోతోంది ప్రియాంక. అయితే ఈ అమ్మడు సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటుంది. నిత్యం హాట్ హాట్ ఫోటోలను షేర్ చేస్తూ అభిమానులను ఆకట్టుకుంటోంది.
తాజాగా ఈ ముద్దుగుమ్మ షేర్ చేసిన ఫోటోలు సోషల్ మీడియాలో సెగలు పుట్టిస్తున్నాయి. ప్రియక కిల్లింగ్ ఫోజులు నెటిజన్లను తెగ ఆకట్టుకుంటున్నాయి. అమ్మడి అందాన్ని పొగుడుతూ.. కుర్రాళ్ళు కవితలు రాసేస్తున్నారు. ఈ అందమైన ఫోటోలపై మీరూ ఓ లుక్కేయండి. మరో సోషల్ మీడియాలో ప్రియాంక అందాలు చూసైనా స్టార్ హీరోలు, డైరెక్టర్లు సినిమా ఛాన్స్ ఇస్తారేమో చూడాలి.
మరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి..