
సూపర్ స్టార్ మహేష్ బాబు , దర్శకుడు రాజమౌళి కాంబినేషన్ లో తెరకెక్కుతున్న సినిమా వారణాసి. ఈ సినిమా షూటింగ్ ను శరవేగంగా పూర్తి చేస్తున్నారు దర్శకుడు రాజమౌళి. ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ సైలెంట్ గా జరిగిపోతుంది. ఈ సినిమాను గ్లోబల్ రేంజ్ లో తెరకెక్కిస్తున్నారు రాజమౌళి. ఇక ఈ సినిమాలో హీరోయిన్ గా ప్రియాంక చోప్రా హీరోయిన్ గా నటిస్తున్న విషయం తెలిసిందే.. అలాగే ఈ సినిమాలో పృథ్వీరాజ్ సుకుమారన్ విలన్ గా నటిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన టీజర్ సినిమా పై అంచనాలను ఆకాశానికి చేర్చేసింది. ఓ భారీ ఈవెంట్ ను ఏర్పాటు చేసి సినిమాను అనౌన్స్ చేశారు రాజమౌళి.
ఈ సినిమా ప్రమోషన్స్ కూడా అప్పుడే మొదలు పెట్టారు చిత్రయునిట్. ఈ మేరకు హాలీవుడ్ మీడియాకు ఇంటర్వ్యూ ఇచ్చారు. ఆ ఇంటర్వ్యూ ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. ఈ ఇంటర్వ్యూలో చిత్రయూనిట్ అనేక విషయాలను పంచుకున్నారు. ఇక ఈ ఇంటర్వ్యూలో ప్రియాంక చోప్రా రాజమౌళికి ఓ కోరిక కోరినట్టు తెలిపింది. ఆ కోరిక వల్ల మహేష్ బాబు ఎలా ఇబ్బందిపడ్డారో కూడా సరదాగా తెలిపింది ప్రియాంక చోప్రా. ప్రియాంక మాట్లాడుతూ.. నేను దాదాపు 7 ఏళ్లు అవుతుంది ఇండియన్ సినిమా చేసి అని తెలిపింది.
ఇన్నేళ్ల తర్వాత నేను ఇండియన్ సినిమా చేస్తున్నా కాబట్టి నాకు మంచి డాన్స్ ఉండే సాంగ్ కావాలి, నాతో డాన్స్ చేయిస్తారా.? అని అడిగిందట ప్రియాంక. దాంతో ఓ భారీ డాన్స్ నెంబర్ ను రాజమౌళి ప్లాన్ చేశారట. ప్రియాంక దెబ్బకు మహేష్ కూడా షాక్ అయ్యారట. ప్రియాంకతో పాటు మహేష్ బాబు కూడా డాన్స్ చేయాల్సి వచ్చిందట.. ప్రియాంక ఈ విషయాన్నీ చెప్పగానే.. నీ వల్లే నేను కూడా డ్యాన్స్ చేయాల్సి వస్తోంది అంటూ మహేష్ బాబు ప్రియాంకను ఆటపట్టించారు. వారణాసి సినిమా వచ్చే ఏడాది సమ్మర్ కానుకగా ఏప్రిల్ 7, 2027న ఈ సినిమా విడుదల కానుంది. ఈ సినిమా కోసం ఫ్యాన్స్ ఈగర్ గా ఎదురుచూస్తున్నారు.
మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ చూడండి..